Vantalakka : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 సీరియల్ కూడా ఒకటి. గతంలో వచ్చినా కార్తీకదీపం సీరియల్ ఎంత క్రియేషన్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సీరియలు మంచి డిమాండ్లను సొంతం చేసుకోవడంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు మరొక సీరియల్ ప్రసారమవుతుంది. అయితే ఈ సీరియల్ కూడా అంతకుమించి క్రేజీని సంపాదించడంతో ఫ్యాన్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న వంటలకు గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. అయితే వంటలక్క రోజుకి ఎంత సంపాదిస్తుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. మరి వంటలక్క ఎంత సంపాదిస్తుంది? ఆమెను ఎలా సంపాదన ఎంత ఉండవచ్చు? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
కార్తీకదీపం సీరియల్ లో దీపా అనే పాత్రలో నటిస్తున్న వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఈమె ఒక కేరళకు చెందిన నటి. మలయాళం లో పలు సీరియల్స్లలో అలాగే సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ వంటలక్క ఈమె సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఒక్క రోజుకి దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లెక్కను చూస్తే ఆమె సీరియల్ తో పాటుగా సోషల్ మీడియాని అలాగే పలు యాడ్లలో కనిపిస్తూ ఎక్కువగానే సంపాదిస్తూ ఆస్తులు కూడబెడుతుంది అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి వంటలక్క క్రేజ్ మామూలుగా లేదు. ఎటు చూసినా కూడా ఈమెకు మంచి క్రేజ్ తో పాటుగా మంచి సంపాదన కూడా ఉంది ఏది ఏమైనా కూడా వంటలక్క సంపాదన విషయంలో నో కాంప్రమైజ్ అంటూ ముందు దూసుకువెళ్తుంది..
కార్తీకదీపం సీరియల్ లో వంటలకు పేరుకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డాక్టర్ బాబు కన్నా వంటలకు ఎక్కువ డిమాండ్ కూడా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వంటలక్క అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ప్రేమే విశ్వనాథకు మంచి డిమాండ్ కూడా ఉంది. టాప్ లో కొనసాగుతున్న సీరియల్ లో ఆమె హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో జనాలు కూడా ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ కేరళ కుట్టి ఒక వైపు సీరియల్స్ మరోవైపు సినిమాలతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తోంది.. ఇకముందు ఎలాంటి పాత్రలో నటిస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇకపోతే వంటలక్క ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..