Brahmamudi serial today Episode: ప్రశాంత్ ఫోన్ చేయడంతో రాజు ఆవేశంగా ఆఫీసుకు వెళ్లబోతుంటే చలపతి ఆపేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు అంటాడు. నేను వెళ్తుంది ఇంటికి కాదు ఆఫీసుకు అని రాజు చెబితే.. అక్కడ కూడా ఇందు ఉంటుంది కదా అని చలపతి అంటే.. ఉంటుంది కానీ నేను వెళ్లేది ఆఫీసు పని మీద అక్కడికి వెళ్లి జస్ట్ ఒక సంతకం చేసి వస్తాను.. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా..? నువ్వు ఆ ఇంట్లోంచి తీసుకొస్తుంటే.. నేను మౌనంగా నీతో వచ్చేశాను.. ఇప్పుడు నేను వెళ్లకపోతే ఆఫీసులో వాళ్లకు చాలా నష్టం వస్తుంది అంటూ రాజు చెప్పగానే.. చలపతి సరే అంటూ లోపలికి వెళ్లిపోతాడు. రాజు ఆఫీసుకు వెళ్లిపోతాడు.
ఆఫీసులో ఇందు కన్ఫీజ్ అవుతుంది. రాజు వస్తాడా..? వస్తే ఏలా మాట్లాడతాడు. నేనేం మాట్లాడాలి అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే రాజు ఆఫీసుకు వస్తాడు. ఇందు ఎమోషనల్ అవుతుంది. రాజు లోపలికి వెళ్లగానే.. ప్రశాంత్ వెల్కం చెప్తాడు. సంతకం ఎక్కడ చేయాలో చెబితే చేసి వెళ్లిపోతాను అంటాడు. ఇందు ఎమోషనల్‌గా చూస్తుంది. రాజు చాంబర్‌లోకి వెళ్లగానే.. ఇందు తన చాంబర్‌లోకి వెళ్లి తనలో తాను మాట్లాడుకుంటుంది. బావ ఏమీ అనలేదు అసలు పలకరించలేదేంటి అనుకుటంది. అప్పుడే ప్రశాంత వెళ్లి మేడం మీలో మీరే మాట్లాడుకోవడం మానేస్తే ఇద్దరం కలిసి సార్ మీద దండయాత్ర చేద్దామని చెప్తాడు. ఏం చేసేది ఎంత కోపంగా ఉన్నాడో చూశావా..? అంటుంది ప్రశాంత్ కాఫీ తీసుకుని రాజు దగ్గరకు వెళ్తాడు. రాజు కోపంగా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు.. కాఫీ కాదు పేపర్స్ తీసుకొస్తే.. సంతకం చేసి వెళ్లిపోతాను.. అంటాడు.
ప్రశాంత్ మాత్రం ఇందు బాధపడుతుందని చెప్తే రాజు పట్టించుకోడు.. అక్కడ ఇందు మేడంకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇక్కడ మీరు ఇలా కూర్చుంటే ఎలా సార్ అంటాడు. మీలో ఒక చిన్నపాటి యుద్దమే జరుగుతుంది సార్.. మీ మనసులో ప్రతిష్టించుకున్న మేడంను చూశాను.. ఇప్పుడే ఈ క్షణమే పోయి మేడంకు సారీ చెప్పండి సార్ అంటాడు. రాజు కోపంగా ప్రశాంత్‌ను కొడతాడు. అదంతా గమనించిన ఇందు వెళ్లి ప్రశాంత్‌ను ఓదారుస్తుంది. నా కష్టాలేవే నేను పడతాను నువ్వు వెళ్లి డాక్యుమెంట్స్ ఏంటో చూడు అంటూ ఇందు చెబితే.. నేను వినను మేడం మీ ఇద్దరిని కలపడానికి నేను చివరి వరకు పోరాడతాను అంటాడు.
తర్వాత ఇందు, రాజు చాంబర్‌లోకి వెళితే రాజు వెళ్లబోతుంటే… తప్పు చేసిన వాళ్లే వెళ్లిపోతారు అంటూ ఇందు చెప్పగానే.. రాజు అక్కడే కూర్చుంటాడు. తన చేతి వంట తినమని ఇందు బాక్స్ తీసి రాజు ముందు పెడుతుంది. రాజుకు ఇష్టమైన వంటకాలు చూపిస్తుంది. ఇవన్నీ నీకు ఇష్టమని చేశాను అంటూ ప్లేట్ తీసుకుని వడ్డించబోతుంటే.. రాజు తనుక ఆకలిగా లేదని చెప్తే.. ఇందు బాధగా చూస్తూ.. ప్రేమ చచ్చిపోయిందా..? అంటే.. రాజు షాక్ అవుతాడు.. అదే ఆకలి చచ్చిపోయిందా..? అంటుంది ఇందు. ఇద్దరి మధ్య ఎమోషనల్ ఆర్య్గూ జరుగుతుంది. భోజనం చేస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తానని ఇదు చెప్తుంది. రాజు మౌనంగా ఉంటాడు. రాజు నువ్వు నిజంగా వెళ్లిపోతావా..? నా గురించి నువ్వు ఆలోచించడం లేదా..? అంటే రాజు తిరిగి బాధపడుతుంటాడు. ఇందు ఎందుకు నా ముఖం చూసి మాట్లాడటం లేదు నువ్వు అని అడుగుతుంది. రాజు కోపంగా ఫైల్ ఇస్తే సంతకం చేసి వెళ్తాను అంటాడు. ఇందు ఫైల్ ఇస్తుంది. రాజు సంతకం చేసి వెళ్లిపోతాడు. ఇందు బాధగా చూస్తుంది.
ఇంట్లో విషయం తెలిసిన భ్రమరాంబ టెన్షన్ పడుతుంది. మళ్లీ రాజు, ఇందు ఆఫీసులో కలిశారంటే నాకు భయం వేస్తుంది అని శేషుకు చెప్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఆస్థి మొత్తం మన చేతికి వస్తుంది అనుకుంటే మళ్లీ వాళ్లిద్దరు కలిశారంటేనే భయం వేస్తుంది అప్పుడే ఆఫసులో పని చేసే ఒక ఎంప్లాయి రేఖకు పోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు. రాజు అసలు ఏమీ మట్లాడకుండా సంతకం చేసి వెళ్లిపోయాడు. ఇందు మేడం కూడా ఏం మాట్లాడలేదు.. అని చెప్పగానే.. రేఖ ఏం వదిన ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా…? అంటూ అడుగుతుంది. ఇక మనం గెలిచినట్టే అని భ్రమరాంబ అంటే శేషు మాత్రం నాకెందుకు వాళ్లిద్దరూ మీతో ఆడుకుంటారనిపిస్తుంది అంటాడు. అందరూ శేషును తిడతారు.
బయటకు వెళ్లిన రాజు బైక్ స్టార్ట్ అవ్వదు.. ప్రశాంత్ నవ్వుతుంటాడు. ఏమైందని ఇందు అడిగితే సార్ బైక్ సైలెంన్సర్‌లో తన కర్చీప్ పెట్టానని ఆ బైక్ స్టార్ట్ కాదని చెప్తాడు. సార్ మీ కారు ఎక్కుతారు అప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్లొ్చ్చు అని చెప్తాడు ప్రశాంత్. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.