Big TV Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలో బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన అద్భుతమైన మాట తీరుతో, ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూ సెలబ్రిటీల నుంచి ఎన్నో విషయాలను రాబడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా మల్లి సీరియల్ నటి లాస్య(Lasya) పాల్గొన్నారు. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న లాస్య ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో నటి లాస్య యాంకర్ వర్షను ప్రశ్నిస్తూ… వర్ష మీరు కూడా సీరియల్స్ చేశారు కదా ఎందుకు సీరియల్స్ నుంచి తప్పుకున్నారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెబుతూ.. నాకు వయసు అయిపోయింది కాబట్టి సీరియల్స్ నుంచి తప్పుకున్నాను అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు కానీ ఈమె సీరియల్స్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేశారు. సీరియల్స్ లో దాదాపు ఏడు సంవత్సరాలుగా తాను కంటిన్యూగా చేశానని తెలిపారు. ముఖ్యంగా ప్రేమ ఎంత మధురం సీరియల్ తో తనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది ఇప్పటికి బయటకు వెళ్లినా నన్ను ప్రేమ ఎంత మధురం సీరియల్ నటిగానే గుర్తుపడతారని వర్ష గుర్తు చేసుకున్నారు.
ఇలా కంటిన్యూగా సీరియల్స్ లో నటించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సరైన నిద్ర లేకపోవడం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కావడం, మైగ్రేన్ హెడేక్ రావడం వంటి ఎన్నో రకాల సమస్యలు నన్ను వెంటాడాయి అందుకే సీరియల్స్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని ఈమె తెలిపారు. సీరియల్స్ లో నటించడం చాలా కష్టం ఉదయం ఏడు గంటలకు మొదలైతే రాత్రి 10 వరకు కూడా షూటింగ్స్ చేయాల్సి ఉంటుందని, సీరియల్స్ ద్వారా చాలావరకు నిద్రను మిస్ అవుతున్నామని తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటూ వర్ష తెలిపారు.
ఇలా సీరియల్స్ కారణంగా అనారోగ్యానికి గురి అవుతున్న నేపథ్యంలోనే కొంత బ్రేక్ తీసుకుందామని సీరియల్స్ నుంచి బయటకు వచ్చేసాననీ తెలిపారు. వర్షా ఇలా మాట్లాడటంతో లాస్య సైతం సీరియల్ చేయడం చాలా కష్టం కొన్నిసార్లు రెండు మూడు భాషలలో చేస్తే కనుక కంటిన్యూగా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అయితే వర్ష సీరియల్స్ నుంచి తప్పకున్నప్పటికి జబర్దస్త్ కార్యక్రమం , శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ అంటూ బిజీగా ఉన్న ఈమె యాంకర్ గా కూడా మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టి యాంకర్ గా కూడా సక్సెస్ అయ్యారు.
Also Read: ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటమే నా డ్రీమ్.. లాస్య కోరిక మామూలుగా లేదుగా?