Kisik Talks:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో ఈ వారం గెస్ట్ గా పలకరించింది భావన లాస్య.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బుల్లితెరపై నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ లో ఎదురైనా అనుభవాలని, ముఖ్యంగా మల్లి సీరియల్ ని తాను ఎందుకు మానేయ్యాల్సి వచ్చింది అనే విషయాలపై ఇలా ఆసక్తికరంగా వివరణ ఇచ్చుకుంది.
సీరియల్స్ వల్ల ఆరోగ్య సమస్యలు.. అందుకే తప్పుకున్నా!
సీరియల్స్‌లో నటించడం అనేది బయటకు కనిపించినంత సులభం కాదని లాస్య తెలిపింది. రోజూ షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని, దాదాపు ఒక రెగ్యులర్ ఉద్యోగంలా సీరియల్స్ ఉంటాయని చెప్పింది. తనను ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయికి తీసుకొచ్చింది సీరియల్సేనని గుర్తుచేసుకుంది. ఇక ఇప్పటికీ బయటకు వెళ్లినప్పుడు ప్రేక్షకులు ప్రేమ ఎంత మధురం సీరియల్ గురించి అడుగుతుంటారని ఆనందం వ్యక్తం చేసింది.
అయితే ఆ సీరియల్‌ను మధ్యలో వదిలేయడం తనకు కూడా ఇష్టం లేదని, కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సీరియల్స్‌లో కంటిన్యూటీ సీన్స్, డ్రెస్ చేంజెస్, ఎక్కువ గంటల షూటింగ్స్ కారణంగా నిద్ర సరిగ్గా ఉండదని, సమయానికి భోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుందని తెలిపారు. అందుకే కొంతకాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని అసలు విషయం చెప్పుకొచ్చింది.
బిగ్ స్క్రీన్‌పై కనిపించడమే నా పెద్ద కల!
బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సినిమాల్లో నటించాలనే కోరిక ఇంకా తీరలేదని తెలిపింది. పెద్ద స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకుల చేత సెలబ్రేట్ చేయించుకోవాలనేది తన జీవితంలో ఉన్న పెద్ద కోరిక అని మనసులో ఉన్న మాటని బయటపెట్టింది .ఇప్పటికే సినిమాల కోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలిపింది.
గతంలో తన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కమిటీ కుర్రోళ్లు సినిమా దర్శకులు తనను పిలిచి ఆడిషన్ తీసుకున్నారని ,అయితే అప్పట్లో తాను రెండు సీరియల్స్‌లో నటిస్తున్నానని, సినిమా కోసం మూడు నెలల పాటు డేట్స్ కేటాయించాలని అడగడంతో కుదరలేదని వివరించింది. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకపోవడం, మూడు నాలుగు నెలల పాటు డేట్స్ బ్లాక్ చేయాల్సి రావడం వంటి కారణాలతో ఆ అవకాశం సెట్ కాలేదని వాపోయింది .
ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏ సినిమాతో దర్శనమిస్తుందో !
అయితే భవిష్యత్తులో సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బుల్లితెరపై నటించేవారికి సినిమాల్లో అవకాశాలు రావడం కొన్నిసార్లు కష్టమవుతుందని, అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తానని చెప్పింది.
ఏది ఏమైనా ఒకప్పుడు టిక్‌టాక్ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో చేసే డాన్స్ వీడియోలతోనూ ప్రేక్షకులను అలరించిన లాస్య ఇపుడు ప్రస్తుతం తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉండటం మెచ్చుకోతగ్గ విషయం. చూడాలి మరి వెండి తెరపై సందడి చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏ సినిమాతో దర్శనమిస్తుందో !