E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?
Advertisement

Podarillu Today Episode November 2nd : కన్నా ఉదయం మా నేను కాలేజీకి వెళ్తున్నా అని చెప్తాడు.. అయితే మహా నేను తీసుకుని వదిలిపెడతాను బస్ స్టాప్ కి అని అంటుంది. అన్న నీతో మాట్లాడాలి కూడా పద వెళ్దామని తీసుకుని వెళుతుంది ఒక చోటికి వెళ్లిన తర్వాత అక్కడ బైక్ ఆపి కన్నా కి నారాయణ గురించి మంచిగా చెప్తుంది కానీ కన్నా మాత్రం అస్సలు వినడు. అయితే కన్నా ఎలాగైనా సరే వదిన నారాయణ గురించి మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. నారాయణ ఏం చేసినా కూడా వదినకి మంచిగానే ఉంటుంది. అందుకే నారాయణను వెనకేసుకుని వస్తుంది. అతను నా తండ్రి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మహా నీ కన్న తండ్రి నిన్ను ఏ రోజున కొట్టాడా తిట్టాడా ఎందుకు ఆయన మీద నీకు ఇంత కక్ష అని అంటుంది. నాకు ఆయన మీద ఎటువంటి కక్ష లేదు మా అమ్మని మా పెద్దమ్మని దూరం చేశాడన్న బాధ ఒక్కటే నాకుంది అని కన్నాతో మహాలక్ష్మితో అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నారాయణ గురించి చాలా గొప్పగా అని చెప్తూ ఉంటుంది.

నారాయణ అంటే అసహ్యమా..?

మేము ఎప్పుడూ ఆయన్ని నాన్న అని చూడలేదు కానీ నువ్వు మాత్రం ఆయననే నీ కొడుకు లాగే చూసుకుంటున్నావు. ఆయన ఏం చేస్తాడో కూడా నువ్వు మర్చిపోతున్నావు వదినా అని కన్నా అంటాడు. అయితే మహా మాత్రం ఆయన ఒక మంచి వాడు ఆయన గురించి తెలియని నిజాలు చాలా ఉన్నాయి తెలిసిన తర్వాత నువ్వే ఆయనని దేవుడు లాగా చూస్తావని ఎంత చెప్పినా సరే కన్నా మాత్రం అస్సలు వినడు. ఇక మహాలక్ష్మి నీ ఇష్టం నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండు అని అంటుంది. కానీ కన్న మాత్రం నారాయణ మీద కోపాన్ని మాత్రం అస్సలు తగ్గించుకోడు..

మాధవ్ కోసం కన్నీళ్లు..

Advertisement

మాధవ్ సైట్ లో వర్క్ చేస్తూ ఉండగా కన్నా అక్కడికి వెళ్తాడు. అయితే మాధవ్ బిజీగా ఉన్న టైంలో కన్నా అక్కడికి వచ్చి అన్నయ్య నీకోసం ఒక బెలూన్ తీసుకొని వచ్చాను అని అంటాడు. ఇది ఎందుకు తెచ్చావు రా అని అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత బాధ పడ్డారో నాకు వదిన చెప్పింది అందుకే నేను ఈ బెలూన్తీ సుకొని వచ్చాను. నువ్వు నన్ను ఎంత మంచిగా ప్రేమించావో నాకు తెలుసు అన్నయ్య నీ కన్నబిడ్డ లాగా చూసుకున్నావు. కానీ ఆ నారాయణ వల్లే నాకు కోపం.. నారాయణ ఎంత చేసినా కూడా తను మందు తప్ప మనిషిని అర్థం చేసుకోడు అని మాట్లాడుతూ ఉంటాడు.. ఇక మాధవ్ తన తండ్రి గురించి ఎలాగైనా సరే గొప్పగా తెలుసుకుని ఇలా చేయాలి అని అనుకుంటాడు.. మొత్తానికి అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్తో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

శైలు కేశవ మళ్లీ ఫైట్..

శైలు కేశవ ఇద్దరూ ప్రతి ఎపిసోడ్లను గొడవ పడుతూనే కనిపిస్తారు. మహాలక్ష్మి తన షాపు గురించి మంచి పోస్టర్ని ఇచ్చింది అని కేశవ చాలా సంతోషంగా ఉంటాడు.. అప్పుడు అక్కడే ఉన్నా శైలు అది చూసి మహాలక్ష్మిని అంతగా పొగుడుతున్నాడు అని చాలా కుళ్ళుకుంటూ కనిపిస్తుంది.. అయితే ఏమిలిద్దరూ గొడవపడతారు. మహాలక్ష్మి అంటే నేను నీకు ఇష్టం కదా మహాలక్ష్మితోనే మాట్లాడుకో పో నాతో ఏం మాట్లాడద్దు అని ఇద్దరు కూడా చాలా గొడవ పడుతూ ఉంటారు.. కానీ కేశవ్ మాత్రం ఇకమీదట గొడవ పడే ఓపిక నాకు లేదు కాబట్టి నీతోనే ఉంటాను అని వెటకారంగా మాట్లాడడంతో శైలు నిజమే అని నమ్ముతుంది..

చక్రికీ మహా ప్రపోజ్ చేస్తుందా..?

Advertisement

మహాలక్ష్మి ఫోన్ చేసి ఎక్కడున్నారు? నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి మీకు ఒక విషయం చెప్పాలి నా మనసులోని మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను అని అనగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. కొంపతీసి నా మీద ప్రేమ ఉందని చెప్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా తనకి చెప్పాలి అని అనుకోవడంతో చక్రి ఇంకా నాకు ప్రపోజ్ చేస్తుందనుకుంట నేనంటే ఇంత త్వరగా ఇష్టం కలుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి మహాలక్ష్మి నిజంగానే చక్రీకి ప్రపోజ్ చేస్తుందా లేదంటే తన బాసు విక్కీ ప్రపోజల్ గురించి చెప్తుందా లేదా తన ప్రాజెక్టు గురించి చెప్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి చక్రి కలిసిపోతే ఆ తర్వాత ఎపిసోడ్లో చాలా బాగుంటాయని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇంత త్వరగా వాళ్ళిద్దరూ కలిసిపోతారా లేదా ఇంకేదైనా ట్విస్ట్ ని డైరెక్టర్ పెడతాడా అన్నది ముందు ఎపిసోడ్లో చూడాల్సిందే అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి

Also Read :వంటలక్క ఒక్కరోజుకు అంత సంపాదిస్తుందా..? హీరోలకు పోటీనే మావా..

Related News

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Brahmamudi Serial Today Episode November 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన రాజుతో ఇందు ఏం చెప్పిందో తెలుసా..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతికి షాక్.. మనోజ్ పార్క్ ను వదలడా..? పండగ సందడి హైలెట్..

వంటలక్క ఒక్కరోజుకు అంత సంపాదిస్తుందా..? హీరోలకు పోటీనే మావా..

ఇదేం ట్విస్ట్ సామి.. మనోజ్ కు పిచ్చిపట్టిందా..?

రూ.50 లక్షలు వస్తే ముందు ఆ పని చేస్తా.. మనసులో మాట చెప్పిన లాస్య!

జబర్దస్త్ వర్ష సీరియల్స్ మానేయడానికి ఇదే కారణమా? ఇన్నాళ్లకు బయటపడిందిగా?

Big Stories

Advertisement
×