Gundeninda GudiGantalu Today episode November 2nd : బాలు మీద కొట్టడానికి వచ్చాడు అని తెలుసుకున్న ఆ గుణాను ఇంట్లోని వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా కలిసి వారిని కొట్టి పంపించేస్తాడు. ఇక తర్వాత ప్రభావతి నీకేం కాలేదు కదరా.. అసలు వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని అంటుంది.. వాడికి ఇందాక నేను వడ్డీ కట్టనివ్వలేదు అని కోపం పెంచుకున్నాడు అందుకే నేను ఏం మాట్లాడకుండా ఈ పూజ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పాను. ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని వాడు ఇక్కడికి వచ్చాడు అని బాలు అంటాడు. నువ్వు ఎప్పుడు మౌనంగా ఉన్నావని అప్పుడు ఇలానే జరుగుతుంది అని మనోజ్ కూడా అంటాడు. ఇదంతా జరిగింది నీ వల్ల రా నువ్వే ఇదంతా చేసింది అని బాలు మనోజ్ ని తిడతాడు. మొత్తానికి బాలు సేఫ్ గా ఉన్నాడు అని నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తానికి సత్యం ఇప్పుడు ఏం జరగలేదు కదా వాడు ఇంకొకసారి వస్తే అప్పుడు చూసుకుందాం పదండి వెళ్లి మనం సరదాగా ఆడుకునే పడుకుందాం అని అంటాడు. అవునా ఎందుకు వచ్చాడు నాకు చాలా అనుమానంగా ఉంది అని మీనా అంటుంది.. అమ్మవారి దగ్గర మనం ఉన్నాం ఇంకా ఏం జరిగినా ఆవిడ చూసుకుంటుంది అని మీనా బాలుకి భరోసా ఇస్తుంది.
బా లు మీనా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలండి అని మీనా అంటుంది.. అదేంటంటే సుమతి ప్రేమలో పడింది.. అబ్బాయిని మనకు పరిచయం చేస్తానని చెప్పింది అయితే మంచి రోజు చూసుకుని అబ్బాయిని మనం ఒకసారి కలుద్దాం అండి సుమతి మంచి అబ్బాయిని ప్రేమించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని మీనా అంటుంది. ప్రేమించింది అరుణ్ అని తెలిస్తే బాలు ఎలా రియాక్ట్ అవుతారు అని అర్థం కావడం లేదు కానీ ప్రస్తుతానికి అయితే మీనా తన చెల్లి యొక్క ప్రేమ వ్యవహారాన్ని బాలుకి చెప్పేస్తుంది. ఇంకా బాలు కూడా అతని కలిసి ఎలాంటి వాడు తెలుసుకుందామని అంటాడు.
సుమతి అరుణ్ణి కలుద్దామని ఇంటికి వెళుతుంది అయితే అక్కడ అరుణ్ వాళ్ళ మదర్ అతని జాబ్ పోవడానికి కారణం ఒక వ్యక్తి అని తనపై తిట్లు పురాణం మొదలుపెడుతుంది. అయితే అప్పుడే సుమతి ఎక్కడున్నారు అయినా నే అంటుంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత తను అరుణ్ తో మాట్లాడుతుంది ఒక వ్యక్తి నా మీద కక్ష కట్టాడు అతని వల్ల నా జాబ్ పోయింది అని చెప్తాడు. కానీ ఈ సుమతి మాత్రం ఈ సమయాన్ని మీరు వృధా చేయకుండా ఆంటీతో టైం స్పెండ్ చేయండి ఇంట్లో పని చేయడానికి ముందుకు రండి అని సలహా ఇస్తుంది.. ఇక అంతే కాదు పెళ్లి గురించి ఇంట్లో చెప్పిన విషయాన్ని కూడా అరుణ్ తో చెప్తుంది.
ఇక మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏంట్రా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఏం జరిగింది? మల్ల ఏమైనా మింగావా అని అడుగుతుంది. ఏం లేదమ్మా లక్కీ డ్రా లో మనకి కారు వస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి. ఎటువైపు పార్క్ చేస్తే మంచిది అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఏంటి మళ్లీ వీడు షాప్ దివాలా తీసి పార్కులో పల్లిలు అమ్ముకుంటున్నాడా ఏంటి? పార్క్ అని వినిపించింది అని సడన్గా ఎంట్రీ ఇస్తాడు. లక్కీ డ్రా లో నాకు కారు వస్తే ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నా అంతే తప్ప పార్కులో పడుకోలేదు అని మనోజ్ అంటాడు. అయితే ఈ శృతి తన డబ్బింగ్ చెప్పిన సీరియల్ గురించి ఒక్క లైన్ చెప్పగానే రోహిణి తనపై సీరియస్ అవుతుంది. దాంతో రోహిణి పై ప్రభావతి కూడా సీరియస్ అవుతుంది.
ప్రతిరోజు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాదో ఈరోజు గుడి కదా గుడిలో చాలా గ్రాండ్గా చేయాలి అని అనుకుంటున్నాము అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి అని అందరు గుడికి వెళ్తారు అక్కడ బాలు మీనాక్షి పుస్తెలతాడు వేస్తారు అది ఎమోషనల్ గా మారుతుంది. ఎపిసోడ్కి హైలైట్ గా కూడా నిలుస్తుంది.. ఇక గుడిలో అందరూ కూడా ఆటపాటలతో చాలా సరదాగా అమ్మవారికి పూజ చేస్తారు. ఈ జంట కూడా తమ అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. మొత్తానికి ఇవాళ గుండె నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక గుడిలో శోభ కూడా రావడంతో బాలు వాళ్ళందరూ కూడా శోభా పై సెటైర్లు వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో చింతామణి ప్రభావతికి షాక్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?