Prabha Bangarigalla Top Folk Songs:ఒకప్పుడు పాటలంటే సినిమా పాటలే ..జానపదాలు వినిపించినా అవి అడపాదడపానే .ఇక ఎంతో మంది సింగర్స్ సరైన గుర్తింపు లేక కనుమరుగైన వారే,కానీ ట్రెండ్ మారింది,సోషల్ మీడియా జమానా ఇపుడు రాజ్యమేలుతుంది.మారు మూల గ్రామాలకే పరిమితమైన పల్లె గొంతులు ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని పులకింపజేస్తున్నాయి.
ఇక వారి నుండి జాలు వారిన జానపదాలు పట్టాభిషేకం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఏ పాట అయినా మిలియన్ల వ్యూస్ ని కొల్లగొడుతున్నాయి.ఇక ఈ పాటలు పాడిన సింగర్స్ కూడా ఇపుడు అదే రేంజ్ లో పాపులర్ అవుతున్నారు.వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ప్రభ బంగాగల్ల గురించి.తనదైన గొంతుతో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రభ కెరీర్ లో టాప్ ఫోక్ సాంగ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
ముందుగా ప్రభ పాడిన ఫోక్ సాంగ్స్ విషయానికి వస్తే అందరికి గుర్తొచ్చే పాట ‘రాను బొంబాయికి రాను’. రాము రాథోడ్ లిరిక్స్ రాయడమే కాకుండా ప్రభతో కలిసి పాడిన ఈ పాట నెట్టింట ఒక సెన్సేషన్. ముఖ్యంగా శేఖర్ వైరస్ అందించిన కోరియోగ్రఫీకి ,కళ్యాణ్ కీస్ సంగీతం కలిసి పాటని మరోమెట్టు ఎక్కించగా ప్రభ గొంతు ఈ పాటకి ప్రాణం పోసిందని చెప్పాలి.ఇక ఈ పాట ఇప్పటికి ఏకంగా 953మిలియన్ల వ్యూస్ తో ప్రభ కెరీర్ లో టాప్ సాంగ్ గా నిలిచిపోయింది.
ఇక ఈ పాట తర్వాత చెప్పుకోవాల్సిన పాట ‘ఓ పిలగ వెంకటి‘.మనం మాట్లాడుకునే అచ్చ తెలంగాణా పదాలతో రాసిన ప్రభ తనే స్వయంగా పాడటం విశేషం.ఇక పూజా నాగేశ్వర్ ,రౌడీ హరీష్ స్టెప్పులు వేసిన ఈ పాటకి ఇప్పుడు సాలిడ్ గా సౌండ్ చేస్తున్న వెంకట్ అజ్మీరా ఈ పాటకి మ్యూజిక్ అందించగా ఎప్పటిలాగే తనవైన స్టెప్పులతో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాడు కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్.ఇక ఈ పాట కేవలం రెండేళ్ళలోనే ఏకంగా 403 మిలియన్లని రాబట్టిందంటే ఆడియన్స్ ప్రభ గొంతుకి ఎంతలా ఫిదా అయ్యారో అర్థం అవుతుంది.
ఇక రాను బొంబాయికి రాను ఇచ్చిన జోష్ ని కంటిన్యూ చేస్తూ ‘రింగు రింగులా జుట్టూ దానా’ అంటూ మరోసారి రాము రాథోడ్ తో కల్సి అదరగొట్టింది ప్రభ.దాదాపు ఏడాది కిందట నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాట ఇప్పటికి 113 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది.ఈ పాటకి సురేష్ గంగుల, దేవ్ పవార్ లిరిక్స్ అందించగా ఇండస్టీ ని ఏలెస్తున్న కళ్యాణ్ కీసే సంగీతం అందించడం విశేషం.
ఇకపొతే ఇప్పటికీ నెట్టింటిని ముఖ్యంగా డిజే బాక్సులని దద్దరిల్లేలా చేస్తున్న ‘నిమ్మ తోట వనం లో’ పాట కూడా ప్రభనే పాడటం విశేషం. వెంకట్ అజ్మీరా సంగీతం అందించిన ఈ పాటకి మాధురి రాథోడ్ వేసిన స్టెప్పులు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి.అలా ఇప్పటికి 178 మిలియన్ల మంది ఈ పాటకి ఫిదా అయిపోయారు.
https://youtu.be/_OpUphXDMv4?si=Y-BbINLDqEdQ2hYL
ఇక బోనాల సమయంలో ఒక ఊపు ఊపుతున్న ‘నా పేరే ఎల్లమ్మ’ పాటని కూడా ప్రభనే పాడింది.నాగ దుర్గ లీడ్ రోల్ లో నటించిన ఈ పాటకి మదీన్ మ్యూజిక్ ఇవ్వగా రాజేందర్ కొండ తనవైన పదాలతో ఈ పాటని మరో రేంజ్ కి తీసికెళ్ళిపోయాడు.అలా ఏడాది కిందట వచ్చిన ఈ పాట ఇప్పటికి 138 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిందంటే ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుందో అర్థమవుతుంది.
https://youtu.be/zyRFufOmeFY?si=JSyHqvqhKHDgKdXI
ఇక ఇక ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు సినిమా పాటలు కూడా పాడతానంటూ ప్యారడైజ్ సినిమాలో ఏష నాగుల కట్ట మీద అనే పాటని పాడి మెప్పించింది ప్రభ.మొత్తానికి తనదైన అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటల్ని పాపులర్ చేసిన ప్రభ బంగారిగళ్ళ ఎందరికో ఆదర్శం అని చెప్పకతప్పదు !
ALSO READ :ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !