Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 68వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో త్రిగుణ్ భార్య, కూతురు హౌస్ లోకి అడుగుపెట్టారు. తన కూతురితో ఆడుతున్నంతసేపు డాడీ సినిమాను తలపించింది అంటూ కొంతమందికి సరదాగా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తన భార్యతో తన గేమ్ గురించి అడిగి మరీ తెలుసుకున్న త్రిగుణ్ కి ఆయన భార్య గట్టిగానే కండీషన్ పెట్టింది. మరి ఆ కండీషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడూ అగ్రేసివ్ గా కంటెస్టెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు దక్కించుకున్న త్రిగుణ్.. హౌస్ లో తన కూతుర్ని చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లాడు అయిపోయాడు .ఆ పాపతో బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకున్నాడు. త్రిగుణ్ ను తొలిసారి ఇలా చూసేసరికి ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక కన్న తండ్రి తన కూతురు ముందు ఎంతటి గొప్పవాడైనా ఇలా తగ్గాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే డాడీ సినిమాను ఈ ప్రోమో తలపించిందని చెప్పాలి. కన్న కూతురి ముందు మరింత చిన్నపిల్లాడు అయిపోయి సరదాగా ఆడుకున్నాడు. ఇకపోతే ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ యూకి పాప చాలా యాక్టివ్ గా ఉంది.. తండ్రిలాగే ఆమె కూడా హుషారుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది విజేత అవుతారో లేదో తెలియదు కానీ ఒక తండ్రిగా ఇక్కడ అసలైన విన్నర్ అనిపించుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read:‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?
నేను విజేత అవుతానో లేక ఫెయిల్ అవుతానో తెలియదు కానీ నా ఆటను నా స్థాయికి మించి ఆడుతున్నాను అంటూ త్రిగుణ్ తన భార్యతో చెప్పాడు. ఆయన భార్య మాత్రం నువ్వు ఆట ఆడతావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ట్రోఫీ ని గెలవాలి అంటూ గట్టిగా కండిషన్ పెట్టింది. ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఉన్నావు అని అడగగా.. నేను త్రిగుణ్ భార్యను అంటూ ఆయనకే కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అయితే త్రిగుణ్ వాళ్ళ ఫ్యామిలీని చూశాక అసలైన క్యూట్ ఫ్యామిలీ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే భార్య కండిషన్ పెట్టింది. మరి తన భార్య కోరిక మేరకు త్రిగుణ్ ట్రోఫీతో ఇంటికి వెళ్తారో లేదో చూడాలి.. మరోవైపు విజేత రేస్ లో నిలిచిన త్రిగుణ్.. అటు దెబ్జానీ పేరెంట్స్ కూడా విజేత అవుతాడని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.