Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్10లో త్రిగుణ్ , వంశీ మొన్నటి వరకు ముఖేష్, రోహిత్ లపై ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ బయటకు వెళ్లిపోయిన తర్వాత ఎప్పటిలాగే ముఖేష్ పై పంచ్ లు విసురుతూ.. ఆయనకు అర్థం కాని తెలుగులో తిడుతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆ తర్వాత నీతూ మాస్టర్ తో వంశీ, త్రిగుణ్ ప్రవర్తన ఏ రేంజ్ లో పీక్స్ కి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లో 10వ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 68వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో త్రిగుణ్ ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చి సందడి చేయగా.. ఇప్పుడు రెండవ ప్రోమోలో నీతూ మాస్టర్ ఫ్యామిలీ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆమె కూతురుతో పాటు ఆమె భర్త ప్రముఖ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ కూడా హౌస్ లోకి వచ్చారు. తన భర్తని చూసి ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంది నీతూ మాస్టర్. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ..” మన ప్రతి కన్నీటి బొట్టు విలువైనదే” అంటూ ఆమెను ఏడవకుండా ఆపారు. ఇప్పటివరకు పడిన ప్రతి కన్నీటి బొట్టుని నువ్వు ఆయుధంగా మార్చుకో అని సలహా ఇచ్చారు.
ఇక తర్వాత వంశీ, త్రిగుణ్ లతో నటరాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ముందుగా వంశీ తో మాట్లాడుతూ.. మీ పాపని చూసి నేను ఫ్లాట్ అయిపోయాను అంటూ కామెంట్. ఇక త్రిగుణ్ నటరాజ్ తో మాట్లాడుతూ.. రెండుసార్లు చూశారు.. మీకు తెలియదా ఏంటి? అంటూ కామెంట్ చేశారు.
also read:కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!
నీతూ మాస్టర్ తో నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఒక బేబీ ఉన్నా సరే ఆ బరువు నువ్వు ఎలా మోయగలిగావు.. నీకు మేము అక్కడ ఫిదా అయిపోయాము అంటూ ఆయన కామెంట్ చేశారు.. ఇక నీతూ గురించి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. నీతూ ఒకప్పుడు రోడ్డు దాటాలన్నా సరే పెళ్లికి ముందు తన తల్లిని సపోర్టుగా తీసుకొని వెళ్ళేది. పెళ్లి తర్వాత ఆమెను నేను రోడ్డు దాటించేవాడిని. అంత భయం తనకు.. అలాంటి ఆమెను ఇప్పుడు నన్ను పట్టుకొని తీసుకెళ్లేలా మార్చేశాను అంటూ తెలిపారు నటరాజ్ మాస్టర్. నటరాజు పెళ్ళాం అంటే నటరాజ్ కాదు నటరాజ్ కి డబుల్ అంటే కామెంట్ చేశారు. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో నటరాజ్ మాస్టర్ తన భార్యకు ఇచ్చిన ధైర్యం ప్రశంసనీయం అని చెప్పాలి.