Karivepaaku Paneer Fry: మన వంటకాల్లో పన్నీర్‌కు ఉండే క్రేజ్ ఏ వేరు. పన్నీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పన్నీర్‌తో రకరకాల కూరలు, బిర్యానీలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసే సాధారణ పన్నీర్ కూరలా కాకుండా, ప్రత్యేకంగా “కరివేపాకు పన్నీర్ ఫ్రై” ట్రై చేస్తే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నం, సాంబార్‌తో లేదా చపాతీ, పుల్కాలోకి ఈ ఫ్రై సైడ్ డిష్‌గా సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది. కరి వేపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలతో.. పాటు పన్నీర్ సాఫ్ట్‌నెస్ ఈ వంటకానికి ప్రత్యేక రుచిని తెచ్చిపెడతాయి. అతి తక్కువ సమయంలో..ఇంట్లోని పదార్థాలతోనే ఈ రెస్టారెంట్ స్టైల్ కరివేపాకు పన్నీర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పన్నీర్: 250 గ్రాములు
కరివేపాకు: 1 కప్పు
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
కారం పొడి: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
నూనె లేదా వెన్న: 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
1. ముందుగా పన్నీర్ ముక్కలను చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన.. తర్వాత పన్నీర్ ముక్కలను అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. (పన్నీర్ గట్టిపడకుండా ఉండాలంటే.. వేయించిన వెంటనే గోరు వెచ్చని ఉప్పు నీటిలో 2 నిమిషాలు ఉంచి తీస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి).
2. ఇప్పుడు అదే ప్యాన్‌లో మిగిలిన నూనెలో సగం కప్పు తాజా కరి వేపాకును వేసి కొద్దిగా వేయించి, దానిని మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కరి వేపాకు పేస్ట్ కూరకి అసలైన సువాసనను, రుచిని ఇస్తుంది.ఇప్పుడు అదే ప్యాన్ లో మరో రెండు స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, మిగిలిన ఫ్రెష్ కరివేపాకు రెమ్మలను వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది.
Also Read: ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి..దొండకాయ ఉల్లికారం ఇలా ట్రై చేయండి!
3. ఉల్లిపాయలు వేగిన.. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీల కర్ర పొడి, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా.. రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్‌ను కూడా అందులో వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. మసాలా బాగా ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేయాలి. మసాలా అంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా మెల్లగా కలపాలి. చివరగా గరం మసాలా, కొద్దిగా కొత్తి మీర చల్లుకొని, రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమ గుమలాడే రుచి కరమైన “కరివేపాకు పన్నీర్ ఫ్రై” సర్వ్ చేయడానికి రెడీ!