Gundeninda GudiGantalu Today episode April 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఆ మాణిక్యం గురించి బయట పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఎలాగోలా రాజేష్ తో బాలు మాట్లాడటం రోహిణి వింటుంది. కచ్చితంగా ఈ బాలు అనుకున్నట్లు చేసేస్తాడు ఎలాగైనా ఈ మాణిక్యం ను వెంటనే పంపించాలని అనుకుంటుంది. రోజు ఉదయం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హాల్లోకి మాణిక్యం వస్తాడు. ఏమైంది అని అంటే ఏం కాలేదు ఒకసారి మీ మటన్ షాపు ఎక్కడుంది ఏ ఏరియాలో ఉందంటే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా అనేసి అన్ని అడ్డంగా దొరికిపోతాడు. అయితే బాలు మాత్రం నువ్వు కచ్చితంగా మలేషియా నుంచి రాలేదు మటన్ కొట్టు నడుపుతున్న అని అర్థం అయిపోయింది ఏంటి నాటకం గురించి అని అడుగుతాడు రోహిణి అడ్డంగా దొరికిపోయిందని ఫీల్ అవుతుంది. రోహిణి గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని మాణిక్యంను ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది. ఫోన్ రాకున్నా కూడా వచ్చింది అని ఎదో డ్రామా ఆడుతుంది. అక్కడ నుంచి పంపించాలని అందరిని నమ్మిస్తుంది. మా అత్తయ్యకు బాగోలేదని ఆలోచించి పంపింద్దా అని అనుకుంటుంది. హడావిడి గా మాణిక్యం ను బయటకు పంపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి మాత్రం ఆయన ఇప్పుడు వెళ్ళకుండా అంటే చాలా ప్రమాదం మా ఇంటికి చాలా సీరియస్ గా ఉందంట వెళ్ళి తీరాల్సిందే అని పట్టు పట్టి మరి అతని పంపించే ప్రయత్నం చేస్తుంది. మరి మరిది గారు మీరు వెళ్లినప్పుడు మనోజ్ బిజినెస్ గురించి మాట్లాడండి అని ప్రభావతి అంటుంది. ప్రభావతిని రోహిణి సోది అనేసి అంటుంది. ప్రభావం ఒక్క మాట అనగానే అందరూ షాక్ అవుతారు నువ్వేంటి మమ్మల్ని అంటున్నావేంటి అని బాలు కూడా అంటాడు. సారీ ఆంటీ నేను కావాలని లేదు ఏదో కోపంలో అనేసాను మా ఇంటికి ఎలా జరిగిందని టెన్షన్ లో ఉన్నాను అనేసి అంటుంది. మొత్తానికి మాణిక్యంను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది.
అందరం మేము వెళ్ళిపోతున్నాం మాకు పనులు ఉన్నాయని అంటారు. కానీ సుశీల మాత్రం మీరందరూ అప్పుడే వెళ్లిపోతారా అని అడుగుతుంది ఇక్కడ బోర్ కొడుతుంది నానమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదని రవి అంటాడు. మీరందరూ వెళ్లకుండా ఉండడానికి నేను ఒక మంచి ప్లాన్ చేశాను ఇక్కడ ప్రతి ఆటనే ఆడెందుకు ఏర్పాట్లు చేశాను అని చెప్పి అంటుంది అది వినగానే అందరూ సంతోషపడతారు..
దాన్ని చూస్తే మీరు కచ్చితంగా ఇకనుంచి వెళ్ళిపోరు అని అంటుంది. మన ఊర్లో ఆడే ఆటలు గురించి నీకు తెలిసిందే కదా అవి ఇప్పుడు ఏర్పాటు చేయించాను మీరు కచ్చితంగా ఆడి తెలుసుకోవాలని ఇలా అంటుంది. శృతి, రవిలు, అలాగే మనోజ్, రోహిణిలు కూడా ఇప్పుడు ఆడే పోటీల్లో బాలుని ఎలాగైనా ఓడించాలి అప్పుడే మన ఊరికినే కాపాడినట్టుగా ఉంటుంది. ఊరికివే ఒలంపిక్స్ కాబట్టి మనం కచ్చితంగా ఇందులో గెలవాలని ప్రభావతి అని టీం ఆలోచిస్తూ ఉంటారు. మీనా బాలు మాత్రం మనం లో ఎవరు గెలిచినా కూడా మంచిదే అనేసి ఆలోచిస్తారు. అప్పుడే సుశీల వచ్చి చూశారా వీళ్ళ మంచితనం వీళ్లు ఎలా ఉన్నా మనమే గెలుస్తామని అంటారు కానీ వాళ్ళు మాత్రం వీడ్ని ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారని అంటుంది.
అయితే అందరూ గ్రూప్ లో మాట్లాడుకుని ఎవరికి ఎవరు కావాలి రివర్ టీంలో ఉండాలని సుశీల అడుగుతుంది. మీరు మాత్రం నాకొద్దు మీరు కడుపులో నొప్పి నన్ను తన్నాడు ఇప్పుడు కాల్ ఇరగ్గొడతాడేమో అని అంటుంది. చూసావా బొమ్మ ఈ వైరం ఇప్పుడు ది కాదు నేను పుట్టక ముందు నుంచే ఉందన్నమాట అని బాలు అంటారు. అందరూ కలిసి బాలుని ఓడించాలని అనుకుంటారు. ఇక సుశీల మాత్రం బాలుని ఎలాగైనా గెలిపించాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనా ప్రభావతికి బాలు అంటే ఎందుకు కోపం అని అడుగుతుంది. బాలు ఎమోషనల్ అవుతాడు నాకు చిన్నప్పట్నుంచి అమ్మ ఉంది కానీ అమ్మ ప్రేమ నాకు తెలియదు.. నేను చెయ్యని తప్పు కూడా నా మీద వేసుకొని అమ్మ ప్రేమకు దూరం అయ్యాను నేను ఏదైతే ప్రేమగా అనుకుంటానో అది నాకు దూరం అవుతుంది అందుకే నేను అందరితో ఇలానే ఉంటాను ప్రేమ అనే పదాన్ని నా జీవితంలో లేకుండా చేసుకున్నాను అని బాలు ఎమోషనల్ అవుతాడు. అది విన్న మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…