Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో నటించి మెప్పించారు. నిహారిక సినిమాలకన్నా ముందు ఢీ జూనియర్స్ అనే ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలోను నటించింది. 2018లో రిలీజ్ అయిన ఒక మనసు చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె తీసే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. కొన్ని వెబ్ సిరీస్ ని నిర్మిస్తూ, కొత్త ప్రాజెక్టులను ఓకే చేస్తూ బిజీగా గడుపుతున్నారు నిహారిక. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది.
గుడ్ న్యూస్ అదేనా ..
ఇక నిహారిక ఇంస్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీలో, చాలామంది సెలబ్రిటీలైన ఆమె ఫ్రెండ్స్ వారింటికి రావడం వీడియోలో చూడొచ్చు. అయితే వారి పేర్లను స్పష్టంగా నిహారిక పేర్కొనలేదు. వారిలో వికిత, మానస ఉన్నారు. పాజిటివ్ ఫిమేల్స్ ఎనర్జీ అంతా మా ఇంట్లోనే ఉంది అని ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేస్తూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఇంతమంది స్నేహితులు, సన్నిహితులు ఆమె ఇంటికి రావడానికి కారణం ఆమె ఏమైనా గుడ్ న్యూస్ చెప్పిందా అని అభిమానులు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. 2020లో చైతన్యతో వివాహం కాగా 2023లో వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన ఏడాదికే వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. సూర్యకాంతం సినిమా తరువాత నిహారిక హీరోయిన్ గా తెలుగులో ఇక సినిమా చేయలేదు. నిజంగా అమ్మడి గుడ్ న్యూస్ చెప్పనుందా లేదంటే గెట్ టుగెదర్ గా అందరూ ఒకచోట కరిసారా అనేది తెలియాల్సి ఉంది.
కెరియర్ పరంగా ..
సినిమాల పరంగా చూస్తే.. నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఈమె వెబ్ సిరీస్ లోను నటించి మెప్పించారు.డెడ్ పిక్సల్స్, నాన్న కూచి అనే సిరీస్ లలో నటించారు. తన సంస్థ నుంచి ఇటీవలే నిహారిక మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. సంగీత్ శోభన్ హీరోగా ఈ సినిమా మానస శర్మ దర్శకత్వంలో రానున్నట్లు తెలుస్తోంది. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలలో అద్భుతమైన నటనతో మనల్ని మెర్పించారు సంగీత్ శోభన్. ఇప్పుడు ఈ సినిమాలో సోలో హీరో పాత్రలో మన ముందుకు రానున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హీట్ ను అందుకుంటుందో చూడాలి.
Sukumar : సుకుమార్‌ను చూసి సిగ్గుపడ్డ ఐటెం గర్ల్… ఆ ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని…