Gundeninda GudiGantalu Today episode April 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఏం చెయ్యాలి అంటూ టెన్షన్ పడుతుంది. ఆమె చేస్తున్న హంగామా చూసి అందరు షాక్ అవుతారు. రోహిణి వాళ్ళ మేనమామ గురించి మాట్లాడినప్పుడల్లా కొడుకు బాలు తన మాటల తూటాలతో ప్రభావతి నోట మాట రాకుండా చేస్తాడు. మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మేనమామ అసలు వస్తాడో రాడో తెలియదు కానీ ప్రభావం మాత్రం ఓవర్ బిల్డప్ ఇస్తుంది అంటూ అత్త సుశీలమ్మ మందలిస్తుంది.. మీ మామయ్య వస్తున్నాడా లేదా అని అడుగుతుంది సుశీలమ్మ. దగ్గర వరకు వచ్చాడని, కార్ లోనే వస్తున్నాడని బదిలిస్తుంది. దగ్గరికి వచ్చాడని చెప్పడంతో ప్రభావతి ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతోంది.. రవి, శృతీలు తమ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. రోహిణి మా రూమ్ ఇస్తామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి వాళ్ళ మామయ్య కోసం ప్రభావతి టెన్షన్ పడుతూ హడావిడి చేస్తుంది. అంతలోకే ఓ వ్యక్తి కాపాడండి అంటూ వచ్చి ఇంట్లోనే కుడితి తోట్టలో పడిపోతాడు. అతనే మలేషియా మావయ్యని రోహిణి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అయ్యాయో ఇలా పడిపోయారేంటి? మీరు ఇలా కారులో కాకుండా కాలినడకని ఎందుకు వచ్చారు అని ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకు ఊరన్న సీనరీ అన్న చాలా ఇష్టం కారిని అక్కడే పంపించేసి అక్కడినుంచి నడుచుకుంటూ వచ్చేసానని మాణిక్యం అంటాడు.
అయితే కుడితి నీళ్లల్లో కూరగాయలు వేస్తే మేకలు బాగా తింటాయి. బాగా బలంగా తయారవుతాయని మటన్ షాపు ఓనర్ లాగా మాట్లాడుతాడు. బాలు కి డౌట్ వస్తుంది. నువ్వు మలేషియా నుంచి వచ్చావా మటన్ కొట్టు నుంచి వచ్చావా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఉన్న నాలుగు రోజులు అతని అసలు యవ్వారం బయట పెట్టాలను అనుకుంటాడు. ఒక కన్నెయ్యాలని అనుకుంటాడు.
ప్రభావతి అతని చూసి సంతోషపడుతుంది. ఏమైనా నీకు దేవుడిచ్చిన అమ్మ అని మాణిక్యం ప్రభావతిని ను రాగానే బుట్టలో వేస్తాడు.. ఇక ప్రభావతి కాళ్ళు, చేతులు ఆడట్లేదు అని అతని లోపలికి తీసుకెళ్ళి స్నానంకు ఏర్పాట్లు చెయ్యమని చెబుతుంది. రోహిణి వాళ్ళ మామయ్యకు స్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. మళ్లీ ఒక చోటికి తీసుకెళ్లి గుసగుసలు మాట్లాడుతుంది. వీరిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది అంటూ బాలు ఆలోచిస్తాడు. ఇక మాణిక్యం లోపలికి వెళ్లి స్నానాలు పూర్తిచేసుకుని వస్తాడు.
ప్రభావతి మీరు ఒకసారి బయటికి వెళ్ళండి మరిది గారు అనేసి అంటుంది. మాణిక్యం అప్పుడే బయటకు వెళ్ళమన్నారు ఏంటి అంటూ షాక్ అవుతాడు. ఆ తర్వాత మీనా శృతి రోహిణి ముగ్గురు కలిసి హారతిస్తారు. ప్రయాణం ఎలా జరిగింది మరిది గారు అని ప్రభావతి అడుగుతుంది. మట్టి రోడ్లు కదా కాస్త ఇబ్బందిగా అనిపించింది అని అంటారు. రవి మలేషియన్ నుంచి మట్టి రోడ్లమీద వచ్చారా అని కౌంటర్ ఇస్తాడు.
ఇక మాణిక్యం తెచ్చిన బట్టలు అలాగే బ్రేస్లెట్ ని బయటపడతాడు. అది చూసిన ప్రభావతి సంతోషంతో ఉబ్బిపోతుంది. ఇక బాలు అక్కడికి వచ్చి ఏం తెచ్చాడు ఒక బ్రెస్లెట్ బట్టలే కదా దానికి ఇంత ఫీల్ అవ్వాలి అని అంటాడు.. వీళ్ళ నాన్నగారు చాలానే తీసుకెళ్ళమన్నాడు నాకే అంత ఓపిక లేక ఇది తీసుకొచ్చాను ఈసారి వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొస్తాను మా పాప సంతోషమే మా సంతోషం అని పాపపురాణం ఎత్తుతాడు. బాలుకు మాత్రం ఎక్కడో ఇతని చూసానే అని అనుమానం వస్తుంది.
మిగతా 99 వెనకాల ఫ్లైట్లో వస్తున్నాయా అని బాలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. ఇక మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి మరిది గారు అని ప్రభావతి అంటుంది. సుశీల వంట పని చేయాలి కదా ఇక పదండి ఎవరి పనులు చేసుకోవాలని అంటుంది. శృతి నేను ఈ వంటలు కట్ చేయలేకున్నానా ? నన్ను పంపించొచ్చు కదా నిద్రపోతాను అంటే.. ఆడపిల్లలు మధ్యాహ్న నిద్రపోకూడదు ఇంటికి దరిద్రం అని సుశీల పెద్ద క్లాసు వీడుతుంది.. ఇక మీనా వంటలకి నేను హెల్ప్ చేస్తాను అంటే నువ్వు ఏమి చేయొద్దు నీ పని నువ్వు చూసుకో అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలుకు మటన్ కొట్టు వ్యక్తిని కన్ఫామ్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..