BigTV English

Trump Tariff: టారిఫ్ వార్.. ట్రంప్‌కు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు..

Trump Tariff: టారిఫ్ వార్.. ట్రంప్‌కు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు..

Trump Tariff: ఛాదస్తం పీక్స్‌కి వెళితే సొంత వాళ్లకు కూడా చికాకు పుడుతుంది. సరిగ్గా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పుడుబ విభజన స్వరాలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్‌తో సంబంధం లేకుండా స్వంతంత్రంగా విదేశీ వ్యవహారాలు నడపుతామంటూ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్.. ట్రంప్‌ టారీఫ్‌లతో మాకు సంబంధం లేదని ప్రకటించగా.. అమెరికావ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీలోనే ట్రంప్ టారీఫ్‌లకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇంతకీ, యునైటెడ్ స్టేట్స్‌లో వ్యతిరేక స్వరాలు దేనికి సంకేతం..? ట్రంప్‌పై తిరుగుబాటుతో అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.? రాష్ట్రాల సొంత నిర్ణయాలకు ఫెడరల్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా..?


ఏప్రిల్ 2న ప్రెసిడెంట్ ట్రంప్ ‘లిబరేషన్ డే’ టారీఫ్‌లు

యునైటెడ్ స్టేట్స్‌లో విభజన స్వరాలు వినిపిస్తున్నాయా..? ఫెడరల్ గవర్నమెంట్‌తో సంబంధం లేకుండా రాష్ట్రాలు స్వంతంత్రంగా విదేశీ వ్యవహారాలు నడపడం వెనుక అర్థం ఏంటీ..? కాలిఫోర్నియాలా మిగిలిన రాష్ట్రాలు కూడా ట్రంప్ టారీఫ్‌లను ఆమోదించమంటూ ముందుకొస్తాయా..? ఫెడరల్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాల సొంత నిర్ణయాలు సాధ్యమేనా..? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా, అమెరికాలో ఆర్థిక నిపుణులు ఆందోళనలో పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ నిర్ణయాలకు.. రాష్ట్రాల అభీష్టాలకు మధ్య.. అమెరికా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అనే నినాదంతో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ పీఠం ఎక్కారు గానీ.. ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ‘అమెరికా బికమింగ్ వరస్ట్’ అనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2న ప్రెసిడెంట్ ట్రంప్ నిర్వహించిన ‘లిబరేషన్ డే’ టారీఫ్‌ల ప్రకటన.. యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.


ప్రత్యర్థులే కాదు మిత్ర దేశాలనూ వదలకుండా సుంకాలు

ప్రత్యర్థి దేశాలతో పాటు వాణిజ్యంలో మిత్ర దేశాలను కూడా వదలకుండా ట్రంప్ సుంకాలు సమరానికి శంఖం పూరించారు. ఈ దెబ్బతో ప్రత్యర్థి దేశం చైనాతో పాటు.. తైవాన్, జపాన్‌ లాంటి మిత్రదేశాల కూడా ఖంగుతిన్నాయి. మరోవైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విభజన స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ మేం సొంత కుంపటి పెట్టుకుంటాం అంటూ సంచలన ప్రకటన చేశారు.

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాలిఫోర్నియా

ట్రంప్ సుంకాలకు మాకూ ఎటువంటి సంబంధం లేదంటూ అమెరికాలోని టెక్ స్టేట్ అయిన కాలిఫోర్నియా ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కాలిఫోర్నియా.. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది. ఆ రాష్ట్ర గవర్నర్, ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకుడైన గవిన్ న్యూసమ్.. కాలిఫోర్నియాలో తయారైన ఉత్పత్తులను ట్రంప్ సుంకాల నుండి మినహాయించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. “ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన సుంకాలు అన్నీ… అందరు అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించవు” అని సోషల్ మీడియా ఎక్స్‌ వేదికపై పోస్ట్ చేసిన వీడియో ద్వారా ప్రకటించారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న కాలిఫోర్నియాలో నివసించే 40 మిలియన్ల అమెరికన్ల తరపున గవర్నర్ గవిన్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో అత్యంత పెద్ద మానుఫ్యాక్చరింగ్ స్టేట్‌గా ఉన్న కాలిఫోర్నియా.. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన వాణిజ్య సంబంధాలు కోరుకుంటుందని అన్నారు.

కొత్త అవకాశాలను వెతుకుతున్నామన్న గవర్నర్ గవిన్

గ్రీస్‌లో డొనాల్డ్ ట్రంప్ రాయబారిగా ఉన్న కింబర్లీ గిల్‌ఫోయిల్‌ను వివాహం చేసుకున్న గవర్నర్ న్యూసమ్.. వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. “ప్రపంచదేశాలతో ఎప్పటిలాగే వాణిజ్యాన్ని విస్తరించడానికి.. కాలిఫోర్నియా స్థిరమైన భాగస్వామిగా ఉంటుందనీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య భాగస్వాములకు గుర్తు చేయాల్సిందిగా.. ట్రంప్ టారీఫ్‌ల బారినపడకుండా.. కొత్త అవకాశాలను వెతకాలని తమ అధికారులను ఆదేశించానని” గవర్నర్ గవిన్ న్యూసమ్ అన్నారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల.. కాలిఫోర్నియాలోని ప్రధాన వ్యవసాయ ఎగుమతి రంగంగా ఉన్న బాదం పరిశ్రమ బిలియన్ల డాలర్లను కోల్పోతుందనే ఆందోళలను ఉన్నాయి.

కాలిఫోర్నియా బిలియన్ల డాలర్లు నష్టపోతుందన్న గవిన్

చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఇప్పుడు అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించడానికి రెడీ అవ్వడంతో కాలిఫోర్నియా రాష్ట్రం బిలియన్ల డాలర్లు నష్టపోతుందని గవిన్ న్యూసమ్ ఆందోళన చెందుతున్నారు. అలాగే, చైనా నుండి అమెరికాకు వచ్చే దిగుమతుల్లో గణనీయమైన భాగం కాలిఫోర్నియా ఓడరేవుల నుండే వస్తుంది. మరోవైపు, మెక్సికో, కెనడాతో కూడా కాలిఫోర్నియా వాణిజ్యం భారీగా ఉంది. ఈ మూడు దేశాలు కాలిఫోర్నియా దిగుమతుల్లో 40% వాటా ఉండగా.. కాలిఫోర్నియా ప్రాథమిక ఎగుమతి గమ్యస్థానాలుగా ఈ దేశాలు ఉన్నాయి.

అమెరికా అన్ని దిగుమతులపై 10% బేస్‌లైన్ సుంకం

అయితే, ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రణాళికలో అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని విధించారు. అలాగే ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధించే ట్యాక్స్‌ను బట్టి కొన్ని దేశాలపై అధిక సుంకాలను కూడా విధించారు. ఈ సుంకాలలో చైనా నుండి వచ్చే దిగుమతులపై 34 శాతం పన్ను, యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతులపై 20 శాతం పన్ను, దక్షిణ కొరియాపై 25 శాతం, జపాన్‌పై 24 శాతం, తైవాన్‌పై 32 శాతం సుంకాలు ఉన్నాయి. అయితే… అమెరికా ఎక్కువగా ఉత్పత్తి చేసే దిగుమతులు వచ్చే మెక్సికో, కెనడాలకు..

Also Read: కేసీఆర్ నయా ప్లాన్.. జోగుకి కీలక బాధ్యతలు..

కెనడా, మెక్సికోలపై విధించిన 25% సుంకాలు

ట్రంప్ వేసిన తాజా సుంకాల నుండి కొంత మినహాయింపు అందింది. అయితే, ట్రంప్ గత నెలలో ఈ రెండు దేశాలపై విధించిన 25 శాతం సుంకాలు మాత్రం అలాగే ఉన్నాయి. దీనితో, కెనడా ప్రధాని కూడా అమెరికాపై ప్రతికార సుంకాలను విధించారు. చైనా అయితే అమెరికా వాణిజ్య యుద్ధంపై తీవ్రంగా స్పందించింది. అమెరికా కావాలనుకుంటే ఎలాంటి యుద్ధానికైనా చైనా సిద్ధంగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇక, అమెరికాలో ఉపయోగించే 90% అవకాడోలు మెక్సికో నుండే దిగుమతి అవుతాయి. ట్రంప్ టారీఫ్‌ల వల్ల అమెరికాలో అవకాడో ధరలు పెరిగితే, వినియోగం తగ్గుతుంది.

అమెరికాపై కాలిఫోర్నియా భారీ ఆర్థిక ప్రభావం

అయితే, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ స్పందించింది. వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గవిన్ న్యూసమ్ అంతర్జాతీయ ఒప్పందాలకు రెడీ అయ్యే బదులు కాలిఫోర్నియాలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని’ అన్నారు. ‘కాలిఫోర్నియాలో అదుపు తప్పిన నిరాశ్రయులు, నేరాలు, నిబంధనల ఉల్లంఘన, క్షీణించిన వినియోగశక్తిని సరిచేయడానికి చర్యలు చేపట్టాలని’ సూచించారు. అయితే, వైట్‌హౌస్ అధికారుల స్పందన ఎలా ఉన్నప్పటికీ.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీ వాటా ఉన్న కాలిఫోర్నియా మాటలు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు కూడా ప్రేరణ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కాలిఫోర్నియా.. అమెరికా ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కాలిఫోర్నియా అతిపెద్ద దిగుమతిదారుగా.. రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. $675 బిలియన్లకు పైగా టూ-వే ట్రేడ్‌తో కాలిఫోర్నియా భారీ ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల, ట్రంప్ సుంకాలు ఈ రాష్ట్రంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపైన కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా, కాలిఫోర్నియా వ్యాపారాలకు ఖర్చులను పెంచుతాయి. ఇది, ప్రపంచ సరఫరా గొలుసుకును దెబ్బతీస్తుందనే ఆందోళనలు వస్తున్నాయి.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×