Gundeninda GudiGantalu Today episode April 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి మరిది గారు అని ప్రభావతి అంటుంది. సుశీల వంట పని చేయాలి కదా ఇక పదండి ఎవరి పనులు చేసుకోవాలని అంటుంది. శృతి నేను ఈ వంటలు కట్ చేయలేకున్నానా ? నన్ను పంపించొచ్చు కదా నిద్రపోతాను అంటే.. ఆడపిల్లలు మధ్యాహ్న నిద్రపోకూడదు ఇంటికి దరిద్రం అని సుశీల పెద్ద క్లాసు వీడుతుంది.. ఇక మీనా వంటలకి నేను హెల్ప్ చేస్తాను అంటే నువ్వు ఏమి చేయొద్దు నీ పని నువ్వు చూసుకో అనేసి అంటుంది. ఇక మీనా అమ్మమ్మ గారు మీకు కాఫీ టీ ఏమైనా ఇవ్వమంటారా అని అడుగుతుంది. నాకు ఏది వద్దు ఏదైనా కావాలంటే నా కోడలు నాకు తెచ్చేస్తుందిలే అని సుశీల అంటుంది. సత్యం అందరు సరదాగా ఉంటారు. అక్కడికి వచ్చిన మాణిక్యం నేను కట్ చేస్తానని అంటాడు. అందరు షాక్ అయ్యేలా కట్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ముగ్గు పెట్టినమీనా పై ప్రశంసలు కురిపిస్తారు. ఈ పొంగల్ అవ్వగానే అందరూ గుడికి వెళ్ళాలి అని అంటారు. రోహిణి వెళ్లి వాళ్ళ మామయ్యని పిలుచుకోవాలి రోహిణి మాణిక్యంకు ముందే వార్నింగ్ ఇచ్చి మరీ తీసుకొని వస్తుంది. ముగ్గురి కోసం మూడు కుండ లో ప్రసాదం అందిస్తుంది సుశీల. ప్రభావతిని ఆ కుండలని కోడలు తల మీద పెట్టి కిందకు వలకకుండా గుడి దగ్గరికి తీసుకురావాలని చెప్తుంది. అందరూ తల మీద ప్రసాదంతో గుడికి వెళ్తారు. గుడిలో పూజ అయిన తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి ప్రసాదంని తింటారు.
ప్రసాదం తింటున్న మాణిక్యం ఎంత బాగుందో మా ఆవిడ ఎప్పుడు ఇలా చేయదు. మిగిలిపోయిన మటన్ తోనే కూర వండి పెడుతుంది అనేసి నోరు జారుతాడు. లాజిక్ ని పట్టుకున్న బాలు మాణిక్యంపై సెటైర్లు వేస్తాడు. మీకు మటన్కు ఏదో అభినాభావ సంబంధం ఉంది కదా మేకలాగే మేక భాష మాట్లాడుతున్నారని అంటాడు. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అవి ఆకుల్ని తింటాయి. నేను వాటిని తింటాను అందుకే నాకు అవంటే చాలా ఇష్టమని అంటాడు.
ఇక అందరూ కలిసి ఒక సెల్ఫీ దిగుదామని శృతి అంటుంది. శృతి చెప్పినట్లు పెట్టి అందరూ సెల్ఫీ దిగుతారు. మీనా శృతి దగ్గరకొచ్చి నాకు మా ఆయనకు ఒక ఫోటో తీయవు అని అడుగుతుంది. బాలుని తీసుకురా పో నేను ఫోటోలు మంచిగా తీస్తానని అంటుంది శృతి. బాలు మొదట డబ్బడమ్మ ఫోన్లో నేను ఫోటోలు దిగను అని అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగుతారు. మనోజ్ రోహిణి కూడా మాణిక్యం ను వెలిసి ఈ ఫోటోలు దిగుతారు అయితే మనోజ్ కింద పడిపోవడంతో అందరూ నవ్వుతారు.
అందరూ కలిసి లోపలికి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పనిలో పనిగా మనోజ్ కు బిజినెస్ పెట్టించాలనే ప్లాన్ బయట పెట్టేస్తారు ప్రభావతి మనోజ్.. బాలు మాత్రం మనోజ్ కి జాబ్ లేదని సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. బిజినెస్ పెట్టించాలనే కోరిక ఉంది మీరు కొంచెం సాయం చేస్తే బిజినెస్ చేస్తానని మనోజ్. రోహిణి వాళ్ళ నాన్నకు పెద్ద బిజినెస్ మాన్.. చాలా బిజినెస్ లు ఉన్నాయి ఈ బిజినెస్ లలో పడి వాళ్ళ అమ్మని కూడా పట్టించుకోక మాకు అన్ని రోగాలు వచ్చి చనిపోయింది. రోహిణికి అమ్మని దూరం చేశాడు అని అంటాడు.
ఆ మాట వినగానే రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతుంది.. మళ్లీ లోపలి కి వచ్చిన రోహిణి మీ అమ్మ కోసం బాధపడ వద్దని అందరు అంటారు. బయటకొచ్చి మళ్ళీ రోహిణి బాధపడుతూ ఉంటే ప్రభావతి మీనా శృతి సుశీల అందరూ బాధపడవద్దని ఓదారుస్తారు. అత్త మామరే నీకు తల్లిదండ్రులు వాళ్ళకి మంచి సేవలు చేసుకుంటే మీకు దేవుడు మంచే చేస్తాడని సుశీల అంటుంది. ముగ్గురు కోడల్ని ఒకేలాగా చూసి తల్లిలాగ ప్రేమించిన అత్త చాలా మంచిదనేసి ప్రభావతి పై సుశీల కౌంటర్ లేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు మాణిక్యం చేత నిజం రా పట్టించేందుకు కల్లు ప్లాన్ వేస్తాడు.. అది వర్క్ అవుట్ అవుతుందా లేదా? రేపటి ఎపిసోడ్లో చూడాలి..