Gundeninda GudiGantalu Today episode December 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో ఎవరు లేకుండా వెళ్లారు. బాగోలేని మనిషిని వదిలేసి వెళ్లారు అని బాలు ప్రభావతిని, కామాక్షిని అరుస్తాడు. ఇక అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది. మీనా ఇంటికి రాగానే సాంబార్ లో ఏం వేశావని బాలు నిలదీస్తాడు. తాను సాంబార్లో ఏం వెయ్యలేదని, వంట చేసి అన్ని జాగ్రత్తగా మూతలు పెట్టి, బయటకు వెళ్లాలని చెబుతోంది. కానీ, మీనా చెప్పిన మాటలు బాలు పట్టించుకోకుండా తిడతాడు. ఈ సమయంలో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. ఇంట్లో వారందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నావా? అంటూ మీనాను నిందిస్తుంది. అదే సాంబార్ ను మనోజ్ తీసుకువెళ్లాడని, వాడు తిన్నాడా ఏమో అని కంగారు కంగారుగా ప్రభావతి ఫోన్ చేయడానికి రూమ్ లోకి వెళుతుంది. అప్పుడే కామాక్షి ఆ ఫోన్ లాక్కొని అసలు విషయం చెప్తుంది. మనోజ్ బాక్స్ కట్టుకపోయినప్పుడు బల్లి పడలేదు మనం తిన్నప్పుడు కూడా బల్లి పడలేదు సాంబార్ మీద మూత తీసింది ఎవరో ఒకసారి ఆలోచించు అనేసి ప్రభావతికి చెప్తుంది. ఈ విషయం బాలు దగ్గర చెప్పి ఉంటే నీకు ఏమీ ఏదో ఆలోచించు అందుకే అక్కడ నీ పరువు పోగొట్టుకుంటావని ఇక్కడ చెప్తున్నాననేసి కామాక్షి అంటుంది. సంజయ్ శృతికి షాక్ ఇవ్వాలని అనుకుంటాడు రవి రావడంతో అక్కడ నుంచి పారిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం మీనా త్వరగా లేచి.. వంటలన్నీ పూర్తి చేస్తుంది. ప్రభావతి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. కాఫీ ఎప్పుడో చేసి అక్కడ పెట్టానని అంటుంది మీనా. వంటలను చూసి తొందరగానే ప్రిపేర్ చేశావ్.. ఈరోజు కూరల్లో ఏం వేసావ్ అంటూ మీనాను ప్రభావతి హేళన చేస్తుంది. దీంతో మీనాక్షికి మండుతుంది.. ఇంటిల్లిపాదిని పిలిచి.. తాను చేసిన కూరలను చూపిస్తుంది. ఇంట్లో ఒక మామ తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడుతుంది. నేను బయటకు వెళ్తున్నాను అనేసి అనగానే ప్రభావతి ఎక్కడికి వెళ్తున్నావ్ రోజు ఇదే పనా అని అడుగుతుంది. కార్తీక మాసం కదా గుడికి వెళ్తే పూజారి మంచిదని చెప్పారు అందుకే వెళ్తున్నా అనేసి అంటుంది. దానికి ప్రభావతి కౌంటర్ వేస్తుంది. రోజు కూడికెళ్తున్నావ్ ఏం కోరుకుంటున్నావు అని రోహిణి ప్రభావతి అడుగుతారు. దానికి ప్రభావతి మాత్రం దేశాన్ని ఉద్దరించేందుకు వెళ్లట్లేదు అని కౌంటర్స్ వేస్తుంది. దానికి సత్యం గుడికే కదా అని చెప్పింది అని వెళ్ళిపోతుంది. రోజు గుడికని చెప్పి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో అనేసి ప్రభావతి అనగానే సత్యం ఎప్పుడు నీకు అనుమానమేనా అనేసి అంటాడు.
ఫైనాన్సియర్ ఇంటికి ఫేషియల్ చేయడానికి రోహిణి వెళుతుంది. ఇంతలోనే మీనా కూడా ఫైనాన్సియర్ ను కలవడానికి అక్కడికి చేరుకుంటుంది. ఆ విషయాన్ని రోహిణి గమనిస్తుంది. మీనా ఇక్కడికి ఎందుకు వచ్చిందని తెలుసుకుని ప్రయత్నం చేస్తోంది. మీనాను చూడగానే.. మళ్లీ ఎందుకు వచ్చావు? అంటూ ఫైనాన్సర్ నిలదీస్తాడు. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన చాలా కష్టపడుతున్నారని, చాలా అనుమానాలు ఎదుర్కొంటున్నాడని మీనా బాధపడుతుంది. నీ మాటాలను ఒప్పుకుంటాను.. నిన్ను చూస్తే బాధ వేస్తుంది. మీ ఆయన పేరు తలచుకుంటే కోపంగా ఉంది.. మీ ఆయన, నువ్వు మాట్లాడుకొని నాకు రేపు చెప్పండి అని ఆ సేటు మీనాను పంపిస్తాడు. అది విన్న రోహిణి ఈ ఒక్క విషయం చాలు ఆ బాలు గాడికి ఇంట్లో షాక్ ఇవ్వొచ్చు అని అనుకుంటుంది. రచ్చ చేస్తారు అని రోహిణి అనుకుంటుంది.
మీ ముద్దుల కొడుకు గురించి ఈరోజు నీకు ఏదో తెలిసిందంట అనేసి ప్రభావతి అంటుంది. ప్రస్తుతం మీ బాలుకి ఏ ఉద్యోగం లేదని, డ్రైవర్ పని చేస్తున్నానని ప్రతి రోజు అబద్ధం చెప్తున్నాడు.పైగా ఆ ఫైనాన్సర్ ను బాలు కొట్టాడని చెబుతుంది. ఇప్పటి వరకూ బాలు లెక్కలు వేశాడుగా.. మేము ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాం కదా.. ఇప్పుడు అన్నం తినేయడం మానేస్తారా అంటూ మనోజ్ నోరు జారతాడు. దీంతో మీనాకు ఇక్కడ లేని కోపం వస్తుంది.. రోహిణికి షాకిస్తుంది. తన భర్త మగాడు, ఆయనకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదని, అవసరమైతే పస్తులు ఉంటామని, కానీ మరొకరి సంపాదనపై తాము ఆధారపడి బతకమని మీనా దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తుంది. ఒక్క నెల ఆయన పని మానేస్తేనే ఇంతగా మాట్లాడుతున్నారు. అయినా పనిచేయకుండా కూడా డబ్బులు ఇచ్చారు కదా అంటుంది. మీరు ఇలాంటి మాటలు అంటారని, ఆయన ఆత్మ అభిమానం చంపుకొని, ఓ అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పనికి చేరారని అసలు విషయం బయటపెడుతుంది మీనా. దీంతో ఇంట్లో వారందరూ షాక్ అవుతారు.. ఇక మీనా ఎవరిని మోసం చేసి బతకాలని లేదని, ఆయన ఏమైనా లక్షలు దోచుకున్నారా.. ఇల్లు తాకట్టు పెట్టారా.. అంటూ మీనా నిలదీస్తుంది. దీంతో సత్యం మాట్లాడుతూ ఇక చాలు అందరూ సైలెంట్ గా వెళ్లిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. బాలు రూమ్ లోకి వెళ్లగానే మీనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు ఫైనాన్షియల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? అంటూ నిలదీస్తాడు. అయినా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్లాలని అని అడుగుతాడు. పెళ్ళాం చేత చెప్పించాడు.. ఎదవ అని వాడు ఊరంతా చెప్పుకుంటాడు. నీకు సంతోషమా అంటాడు. దాన్ని బయట నుంచి బాలు సత్యం వింటాడు. అవును తప్పు చేసేటప్పుడు లేని పౌరుషం ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇక్కడ మీకు మీరే గొప్ప అనుకుంటున్నారు అని మీనా కడిగిపడేస్తుంది.. మీకు ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత పౌరుషం ఉంది కాదా.. మీరెందుకు అడుగుతారు.అవసరమైతే పల్లెటూర్లలో చెరువులలో బర్లు తోముతారు. ఎవరేమన్నా వారి కార్లను కడుగుతారు. మీ జీవితంలో మీరు ఎన్నడైనా దొంగతనం చేశారా? అలా పరాయి వాళ్ళు మీపై దొంగతనం నింద వేస్తే మీరు సైలెంట్ గా ఉన్నప్పుడైనా నా మనసు చచ్చిపోయింది.. అప్పుడు నోరు మెదపరు కదా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..