BigTV English

Nepal China BRI: ఇండియాను కాదని చైనా వెళ్లిన నేపాల్ కొత్త ప్రధాని.. బిఆర్‌ఐ ప్రాజెక్టుపై ఒప్పందం

Nepal China BRI: ఇండియాను కాదని చైనా వెళ్లిన నేపాల్ కొత్త ప్రధాని.. బిఆర్‌ఐ ప్రాజెక్టుపై ఒప్పందం

Nepal China BRI| నేపాల్ కొత్త ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలీ ఏళ్ల తరబడి పురాతన సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ చైనా వెళ్లారు. నేపాల్ దేశంలో కొత్తగా పదవి చేపట్టే ప్రధాన మంత్రి చాలా సంవత్సరాలుగా.. ముందుగా భారతదేశ పర్యటనకు వస్తారు. కానీ నేపాల్ కొత్త ప్రధాని కెపి శర్మ ఓలీ మాత్రం చైనా వెళ్లారు. వెళ్లడమే కాదు. గత నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు. చైనాతో వివాదాస్పద ప్రాజెక్టుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు భారత దేశంలో, నేపాల్ లో రాజకీయంగా ప్రభావం చూపనుందని జియో పాలిటిక్స్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.


చాలా సంవత్సరాలుగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్.. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, రష్యా దేశాలకు సరుకు రవాణా, అంతర్జాతీయ వాణిజ్య కోసం 2013లో ప్రారంభించింది. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే దురుద్దేశం చైనాకు ఉందనే అనుమానాలు కలిగిస్తూ.. కొన్ని దేశాల్లో ఘటనలు జరిగాయి. దీంతో ముందు చైనాతో ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ సహా కొన్ని దేశాలు తరువాత విరుమించుకున్నాయి.

Also Read: రూ.48 లక్షల కోట్లా?.. అంత జీతం కుదరదు.. ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన కోర్టు..


అయినా చైనా ప్రభుత్వం పట్టువదల కుండా అనుకున్నది సాధించండానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడు సంవత్సరాలుగా నేపాల్ ని కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే గత 7 సంవత్సరాలు నేపాల్ లో రాజకీయ సంక్షోభం కారణంగా ఇది కుదరలేదు. కానీ ఇటీవలే అక్కడ అనూహ్య రీతిలో నేపాల్ కమ్యానిస్టు పార్టీ నాయకుడు కెపి శర్మ ఓలీ అధికారం చేజిక్కించుకున్నారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన స్వయంగా ప్రధాన మంత్రి పదవిలో కూర్చున్నారు. ప్రస్తుతం నేపాల్ లో కమ్యూనిస్టు పార్టీ, నేపాల్ కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం కైవసం చేసుకున్నారు.

Also Read: టీనేజర్‌పై గ్యాంగ్ రేప్.. సవతి తల్లే డబ్బులు తీసుకొని..

అయితే ప్రధాని పదవి చేపట్టిన తరువాత కెపి శర్మ ఓలీ తన తొలి విదేశీ పర్యటన కోసం సంప్రదాయంగా ఇండియాను కాదని చైనాకు వెళ్లారు. అక్కడ గత ఏడేళ్లుగా చైనా ప్లాన్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో నేపాల్ భాగస్వామ్యం కాబోతున్నట్లు అంగీకారం తెలిపారు. ఈ మేరకు బుధవారం డిసెంబర్ 4, 2024న ఇరు దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ఎక్స్ లో పోస్ట్ చేసి తెలిపింది.

నేపాల్ చేపట్టబోయే ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు చైనా భరిస్తుంది. ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుంది. దీని ప్రణాళికలు ఏమిటి? అన్నది మొత్తం ఒప్పందం ప్రకారం జరుగుతుంది. ఇప్పడు ఈ విషయాలే నేపాల్, భారతదేశంలో రాజకీయంగా కీలకం కానున్నాయి. ఎందుకంటే చైనా ఏ దేశంలో ప్రాజెక్టులు నిర్మించినా ఆ దేశంతో ముందుగానే కఠినంగా షరతులు విధిస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు చైనా భరించినా.. దాన్ని అప్పుగా ఆ తరువాత ప్రాజెక్టు నిర్మిత దేశం చెల్లించాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో చైనా ఆ ప్రాజెక్టుని తన సొంతం చేసుకొని ఏ పన్నులు లేకుండా దాన్ని స్వీయ లాభం కోసం ఉపయోగించుకుంటుంది. ఇదే శ్రీలంకలో జరిగింది. ఇదే ఆఫ్రికాలో జరిగింది. ఇదే పాకిస్తాన్ , మాల్దీవుల్లో జరుగుతోంది.

ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నేపాల్ లో కూడా పోఖరా నగరంలో చైనా ఎయిర్ పోర్టు నిర్మించింది. దాని ఖర్చు 200 మిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ఇండియా ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వ పెద్దలని హెచ్చరించింది. చైనా పన్నే వలలో పడవద్దని. కానీ నేపాల్ ప్రభుత్వం చైనాతో చేతులు కలిపింది. పోఖరాకు 120 కిలోమీటర్ల దూరంలో నేపాల్ రాజధాని కాఠ్మాండు ఉంది. కాఠ్మాండు ఇండియా బార్డర్ వరకు విమానంలో చేరుకోవడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలా చైనా.. నేపాల్ లో చొచ్చుకొని రావడంతో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా.. ఇండియా నేపాల్ బార్డర్ లోని తన మిలిటరీ ఎయిర్ బేస్ ని మూసివేసింది.

మరోవైపు చైనా దెబ్బకు కుదేలైన శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల దుస్థితి చూసి నేపాల్ రాజకీయ పార్టీలు ప్రధాని కెపి శర్మ చర్యలను తప్పుబడుతున్నాయి. నేపాల్ ప్రభుత్వ కూటమిలో భాగమైన నేపాల్ కాంగ్రెస్ కూడా ప్రధాని కెపి శర్మ ఈ ప్రాజెక్టు విషయంలో తమను సంప్రదించలేదని ఆందోళన వ్యక్తం చేశాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×