Gundeninda GudiGantalu Today episode January 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజును కిడ్నాప్ చేసి బాలు కారులో తీసుకెళ్తుంటాడు. నీలకంఠం మనుషులు పోలీస్ డ్రెస్ లో ఫాలో అయ్యి.. ఎట్టకేలకు బాలుని పట్టుకుంటారు. ఆ తర్వాత సంజుని విడిపించి, పోలీస్ స్టేషన్ కు తీసుకవెళ్లకుండా ఓ గోడన్ కు తీసుకెళ్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చారని ప్రశ్నించగా.. లోపలికి నడవని, బాలుని లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో బంధిస్తారు. బాలుని తన ఫ్రెండ్ రాజేష్ ఫాలో అవుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కాకుండా ఓ గోడౌన్ కు తీసుకువెళ్ళడంతో అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని మీనాకు చెబుతాడు.. మీనా భయపడి మీనా తొందరగా అక్కడికి వెళుతుంది. ఇక అప్పుడే సంజయ్ నీలకంటే ఎక్కువ ఫోన్ చేస్తాడు. ఐదు నిమిషాల్లో వస్తానని చెప్తాడు. సత్యం కు ప్రభావతి నిజం చెప్తుంది బాలు పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేశాడండి అని చెప్పగానే షాక్ అవుతాడు. ఈ విషయాన్ని వెంటనే వాళ్లకి చెప్పాలని అనుకుంటే ప్రభావతి వద్దండి కాసేపు ఆగండి అని అంటుంది. ఇక మీనా వాళ్ళ అమ్మ వచ్చి మీనా పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో తెలిసిందంట వెళ్ళింది తీసుకొని వస్తారులే అన్నయ్య కాసేపు ఆగండి అనేసి అంటుంది. మీరు టెన్షన్ పడకండి మీనా వెళ్ళింది కదా ఎలాగైనా తీసుకొని అంటుంది. అటు రంగా కామాక్షిని పెళ్ళికొడు కోసం వెళ్లారు ఇంకా రాలేదేంటి అనేసి అడుగుతాడు నేను మౌనవ్రతం నాకు ఏమీ అడక్కండి ప్రభావతి నన్ను నోరు మూసుకొని ఉండమని చెప్పింది అనేసి అంటుంది. ఇక మొత్తానికి సంజు బాలును ప్లాన్ ప్రకారం కట్టేసి కల్యాణ మండపం కు వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నీలకంఠం సంజు పక్క ప్లాన్ తోనే తొందరగా పెళ్లి చేయాలనీ పంతులుని తొందర పెట్టేస్తారు.. ఇక పంతులు తొందరగా పెళ్లి జరిపిస్తాడు. బాలు వచ్చేలోగా సంజు తో మౌనిక పెళ్లి జరిగిపోతుంది. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పక్కనే ఉన్న దీపం స్టాండ్ ను తీసుకువెళ్లి, సంజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అందరూ బాలుని అడ్డుకుంటారు. తన ఇంట్లో వారు అందరూ.. ఆపినా బాలు ఆగడు. ఆ స్టాండ్ తో సంజూను పొడవడానికి వెళ్తాడు. దీంతో తన చెల్లి మౌనిక అడ్డుపడుతుంది. దీంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. వాడు ఒక నరరూప రాక్షసులని వాడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు ఇప్పుడు తన జీవితం రోజు దినదిన గండం లాగా మారిపోతుంది ఈ పెళ్లిని జరగనిచ్చేదే లేదు వీన్ని ఇప్పుడే చంపేస్తానని బాలు ఆవేశపడతాడు. సత్యం బాలుని ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆగడు సంచుని కిందకు లాక్కొచ్చి మరి కొడతాడు ఇక సత్యం కూడా బాలుని కొడతాడు..
ఇక నీలకంఠం తన కొడుకుని కొడుతున్నందుకు బాలుపై ఆవేశంతో ఊగిపోతాడు తన నిజస్వరూపాన్ని చూపించాలని అనుకుంటాడు కానీ మండపంలో చూపిస్తే అందరూ భయపడతారని తను మౌనంగా ఏమి తెలియనట్లు వదులు వదులు అని అరుస్తాడు. పచ్చని పెళ్లి పందిరిలో మీ చెల్లెలి పసుపు కుంకుమను చెడిపేయడానికి తయారయ్యావా? మూర్ఖుడా.. అంటూ బాలుని సత్యం నిందిస్తాడు. తాను గొప్పింటి సంబంధం తెస్తే.. చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావా..? ఇన్నాళ్లు నువ్వు తాగిన మైకంలో మాట్లాడుతున్నావని అనుకున్న.. ఆరోజు జరిగిన దానిని మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా అవమానిస్తావా.. నష్టజాతకుడా అని ప్రభావతి అరుస్తుంది.. జీవితంలో నీ మొహం నాకు చూపించదు అనేసి బయటికి వెళ్లిపోని అరుస్తుంది. నా మీద అరవడం కాదు మీనాను కూడా అడుగు అసలు వాడు ఎవడో తెలుస్తుంది అనేసి అంటాడు.. మీనా చెప్పబోతుంటే ప్రభావతి ఆగు నీదొక దరిద్రపు సంబంధం నువ్వు ఒక దరిద్రం సంబంధాన్ని తీసుకొచ్చావు మా నెత్తిన పెట్టావు అని దారుణంగా అవమానిస్తుంది.
తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ మీనా ను కూడా అవమానిస్తుంది. మరోవైపు సుశీలమ్మ కూడా.. ‘నచ్చకపోతే పెళ్లికి రాకపోవాల్సింది. కానీ, పచ్చని పందిరిలో నీ చెల్లిని చేసుకున్న వాడిని ఇలా అవమానిస్తావా..అంటూ బాలుపై కోప్పాడుతుంది. ఇంతలోనే రవి, శృతి ఇద్దరూ పెళ్లి మండపానికి చేరుకుంటారు.. రవి చెప్పినా కూడా వినరు. శృతి కూడా అవునత్తయ వీడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మీరు ఒక మెంటల్ గాడు మీరు టార్చర్ భరించలకే నేను రవిని తొందరపెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి అంటుంది. అయినా కూడా ఎవరు నమ్మరు. శృతి పై నీలకంఠం అరుస్తాడు. వాళ్ళు ఎవరు చెప్పినా అక్కడ వాళ్ళు ఎవరో నమ్మరు. ఇక బాలు ఆ తాళిని తెంచేస్తానని వెళ్తాడు. మౌనిక ఎంత వదిలించుకోవాలని చూసినా బాలు వదలడు ఇక మౌనిక చెయ్ చేసుకొని నా జీవితం నా ఇష్టం ఇక నువ్వు నా జీవితంలోకి రావద్దు అనేసి కొడుతుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నీలకంఠ మాత్రం తాను అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయిందని నవ్వుతాడు..
తన అన్నయ్యను కొట్టిన భాదతో మౌనిక అక్కనుండి వెళ్ళిపోతుంది. ఏ చెల్లెలు కోసం .. ఇంత రాద్ధాంతం చేశావో.. ఆ చెల్లెలే నిన్ను చీకొట్టి వెళ్లిపోమంటుంది సత్యం అంటాడు. ఇకపై నీ ముఖం నాకు చూపించకు.. ఇకనుండి వెళ్ళిపో’ అంటూ బాలుని సత్యం చీకొడతాడు. అరే.. నష్టజాత కూడా మరోసారి నీ ముఖం నాకు చూపించకు. ఇకనుండి వెళ్లిపోరా.. జీవితంలో నీ మొఖం నాకు చూపించకు అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది.. ఇక మీనా మౌనిక కోసం వెళ్తుంది.మౌనిక తన చెయ్యి కాల్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని చూసిన మీనా షాక్ అవుతోంది. ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెబుతుంది. ‘మీ అన్నయ్యకు నువ్వంటే ప్రాణం.. నీ జీవితం బాగుండాలని మీ అన్నయ్య ప్రయత్నించాడు అంటూ మీనా అంటుంది. అసలు అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో.. తనకు అర్థం కాలేదని , ఆ ఆవేశంలో ఏమైనా చేస్తాడేమోనని, తాను అన్నయ్యను కొట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇస్తుంది మౌనిక.. మీనా ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటాము అని భరోసా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..