Delhi Crime: కాలం మారింది.. పరిస్థితులు మారాయి. ఫలితంగా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు భర్తింటి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. భర్తలు సూసైడ్‌కు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్యతోపాటు అత్తమామల వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్‌కు పాల్పడ్డారు. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అసలేం జరిగింది.. ఇంకాస్త డీటేల్స్‌లోకి డీప్‌గా వెళ్లొద్దాం.
పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పునీత్ ఖురానా. ప్రస్తుతం వయస్సు 40. పక్కనే ఉన్న ఆమె పేరు మనికా జగదీష్. ఢిల్లీలో సొంతంగా బేకరీ నిర్వహిస్తున్నాడు పునీత్. ఆ బేకరీలో మనికా జగదీష్ పెట్టుబడి పెట్టింది. మొదట్లో లాభాలు భారీగా వచ్చాయి. దీంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు దినదినాభివృద్ధి చెందింది. ఈ క్రమంలో పునీత్-మనికా మరింత దగ్గరయ్యారు.. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. అనుకున్నట్టుగానే 2016లో వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మోడల్ టౌన్‌లోని కల్యాణ్ విహార్ ప్రాంతంలో ఉంటున్నారు.
మొదట్లో దంపతులు బాగానే ఉండేవారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. చివరకు ఆలుమగల మధ్య విబేధాలకు దారి తీసింది. ఎడబాటు పెరిగింది.. ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. న్యాయస్థానంలో అప్లై చేశారు కూడా. అయినా పునీత్ ఖురానా మనస్సు ఏ మాత్రం అంగీకరించలేదు. భార్యతోపాటు అత్తమామల టార్చర్ తట్టుకోలేక డిసెంబర్ 31న సూసైడ్ చేసుకున్నాడు పునీత్. తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఈ కేసు ప్రస్తుతం పోలీసులు సవాల్‌గా మారింది.
మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీలో కలతలు ఏర్పడ్డాయి. మనసులో బాధను పేరెంట్స్‌తో షేర్ చేసు కునేవాడు పునీత్ ఖురానా. ఈ క్రమంలో పునీత్ ఫోన్, ఇతర వస్తువులు తండ్రికి అప్పగించారు. ఫోన్ ఓపెన్ చేయగానే భార్య మనికాతో మాట్లాడిన దాదాపు పావుగంట సేపు ఆడియో ఒకటి కనిపించింది. వ్యాపారం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ‘విడాకులు తీసుకుందాం.. తాను ఇప్పుడు మీ బిజినెస్ పార్టనర్ మాత్రమే. మీరు బకాయిలు చెల్లించాలి’ ఆడియోలో ఉంది. ఈ లెక్కన భార్య, అత్తమామలు పునీత్‌ను వేధింపులకు గురిచేసినట్టు గుర్తించారు. తన కొడుక్కి న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ALSO READ: ఎంత కష్టం వచ్చిందో.. కాళ్ల పారాణి ఆరనేలేదు.. వధువు ఆత్మహత్య!
పోస్టుమార్టం తర్వాత బాడీని పేరెంట్స్‌కు అప్పగించారు పోలీసులు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. తొలుత మనికా జగదీష్‌తో విచారణ మొదలుపెట్టారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. కొద్దిరోజుల కిందట బెంగుళూరులో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 34 ఏళ్ల అతుల్ సుభాష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు. తాను ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను అనేది క్లియర్ లేఖలో రాశాడు. తన భార్య, బంధువులు తనను అనుక్షణం వేధిస్తున్నారని, పైగా తప్పుడు కేసులు బనాయించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని రాసుకొచ్చిన విషయం తెల్సిందే. ఇదే సీన్.. ఢిల్లీ పునీత్ కేసులో రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
👉ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్
యజమని (పునీత్) ఆత్మహత్య
👉ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు. pic.twitter.com/JayoaTuhdT— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2025