Gundeninda GudiGantalu Today episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో… శృతి రవిని నిద్రలేపి పైకి తీసుకెళ్తుంది.. అక్కడున్న టెంట్ హౌస్ ని చూపిస్తుంది. మీ అన్నయ్య తాళం వేసుకొని వెళ్ళిపోయారు అన్నారు కదా.. అందుకే నేను మధ్యాహ్నం షాపింగ్ కి వెళ్ళినప్పుడు దీన్ని కొన్నాను ఇక్కడ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ నీతో ఉండాలని అనిపిస్తుంది అని శృతి అంటుంది. ఇక ఉదయం లేవగానే ప్రభావతి శృతికి రవికి కాఫీ తీసుకొని వస్తుంది. కానీ అక్కడ శృతిరవిలు ఉండరు. ఇక మనోజ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పైకి వెళ్తారు. అక్కడ టెంట్ చూసి షాక్ అవుతాడు ఏంటి కొంపతీసి టెంట్లో దొంగలు ఏమైనా ఉన్నారా? వీళ్ల దగ్గర మారనాయుధాలు ఉన్నాయా నేను ఒక్కడినే కాదు ఇంట్లో వాళ్ళందరిని పైకి తీసుకొస్తాను అని మనోజ్ కిందికి వెళ్తాడు.. ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పి అందరిని పైకి తీసుకొని వస్తారు. టెన్షన్ పడుతూనే ఆ టెంటులో ఎవరున్నారో తెలుసుకోవడానికి రెడీ అవుతారు.. శృతి, రవిలు టెంట్లో పడుకోవడం చూసి అందరూ కిందకు తీసుకొచ్చి పెద్ద క్లాసే పీకుతారు. శృతికి శోభా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. టెంట్ గురించి చెప్పడంతో శోభా ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి టెన్త్ ఏసుకొని పడుకునిందని ఇంట్లో వాళ్ళని ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని శోభ ప్రభావతి ఇంటికి వస్తుంది.. ప్రభావతి మీద చిందులేస్తుంది. కూతురుకి కనీసం రూమ్ కూడా ఇవ్వట్లేదని ఇదేనా మీరు చూసుకుని మర్యాద అని ఇదేనా మీరు చూసుకునే జాగ్రత్త అని ప్రభావతిని తిడుతుంది శోభ. ముగ్గురు కొడుకులు ఉన్నారు మరి మీ ఆయన లోన్ కట్టే కదా ఈ ఇల్లు కట్టించారు అదేదో ఇంకొక గది కట్టించొచ్చు కదా అనేసి శోభ అంటుంది. మీ ఆయన లోన్ కోసం మా ఆయన కాళ్ళ వేళ్ళ పడ్డాడు కాళ్ళు పట్టుకునే అంత పని చేశాడు ఆయన మీరు ఇలా చేస్తారని శోభ అంటుంది. అప్పుడే బయట బాలు వెయిట్ చేస్తుంటాడు. ఆ మాట అనగానే లోపలికి వస్తాడు. ఆ మాట వినగానే బాలు రెచ్చిపోతాడు ఇక శోభాని నోటికి వచ్చినట్లు అనేస్తాడు. మా నాన్న అనే హక్కు మీకు ఎవరిచ్చారు మీ కూతురు గురించి మీరు చూసుకోండి మా నాన్న మీ ఆయన కాళ్లు పట్టుకోవాలని చూశాడా ఏం మాట్లాడుతున్నారు ఏం ప్రభావతి నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా నీకు కనీసం కొంచెం కూడా నాన్నని అంటుంటే బాధగా అనిపించలేదా అని ప్రభావతికి శోభా కి పెద్ద పీకుతాడు బాలు..
మాటలు మర్యాదగా రానివ్వమను.. మా నాన్న వెదవ కాళ్లు పట్టుకోవాల్సిన కర్మేంటి? అని బాలు రెచ్చిపోతాడు. దీంతో రవి.. కాస్త మర్యాదగా మాట్లాడు అన్నయ్య అని బాలు అని అంటాడు. ఎవడికి రా మర్యాద ఎవరికి ఇవ్వాలి? లేచిపోయి పెళ్లి చేసుకున్న వాడి అత్తకి ఇవ్వాలా? తిరిగి మన ఇంటికి వచ్చిన నీకు ఇవ్వాలా అని అడుగుతాడు. అయినా మీ విషయం గురించి నేను ఏం మాట్లాడటం లేదు.. లోన్ కోసం ఆ వెధవ కాళ్లు పట్టుకున్నాడని మీ అత్తయ్య అంటేనే నేను సమాధానం చెబుతున్నాను అని బాలు అంటాడు.. ప్రభావతి పెద్ద చిన్న లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అంటావని అరుస్తుంది. ఇంతకన్నా ఎక్కువే మాట్లాడుతాడు మీ పెంపకం అలాంటిది మీరు అలా పెంచారు మీ పిల్లల్ని అనేసి శోభా ప్రభావతి అంటుంది. ఇలాంటి కుటుంబంలోకి రానివ్వకూడదని మేము ఈ పెళ్లి ఒప్పుకోలేదని శోభ అందరిపైనా ఫైర్ అవుతుంది.. మీ ఆయనను అంటే నీకు చీమకుట్టినట్టు కూడా లేదా అని బాలు ప్రశ్నించగా.. ఆమె లోన్ గురించి తప్పుగా మాట్లాడడం తప్పే.. కానీ మాటకు మాట అనుకుంటూ వెళ్తామని గొడవను పెద్దది కాకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, శోభ మాత్రం తగ్గకుండా..ఇలాంటి రౌడీలు, గుండాలు తిరిగి చోట నా కూతుర్ని ఉంచలేను ఇంటికి వెళ్దాను.. పదవే అని శృతిని లాగుతుంది శోభ. దీంతో ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని బాలు సంతోషిస్తాడు. ఇంతలోనే.. సత్యం వస్తాడు. ఏమైందమ్మా అని శోభాను మీరు జాగ్రత్తగా చూసుకుంటారని నేను మా అమ్మాయిని ఇక్కడ వదిలేను కానీ మీరు రూమ్ కూడా ఇవ్వకుండా చూసుకున్నారని అర్థమైంది అని శోభ అంటుంది..
దానికి సత్యం రూమ్ ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పారు అనని అడుగుతాడు.. ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను శృతి ఫోన్ చేసింటే చెప్పింది అని చెప్తుంది. నేను వేరేలా చెప్పాను నాన్ సింక్లో డబ్బింగ్ చెప్పినట్లు మీ డైలాగ్ లు మీరే చెప్పుకుంటారు ఏంటి నేను చెప్పేది కాస్త వినండి మమ్మీ నేను రూమ్ ఇవ్వలేదని చెప్పలేదు నేను టెంట్ కొనుక్కొని టెంట్లో పడుకున్నానని చెప్పాను. మీ అమ్మాయికి ఏ కష్టం రానివ్వకుండా మేము చూసుకుంటాం అనేసి సత్యం మరోసారి మాట ఇస్తాడు. ఇక శృతిని నువ్వు ఏదైనా మీ పుట్టింటి వాళ్ళకి చెప్పాలనుకుంటే అర్థమయ్యేలా చెప్పు అప్పుడే ఇలాంటి అపార్ధాలు రాకుండా ఉంటాయని అంటాడు. అలాగే అంకుల్ నేను చూసుకుంటానని వాళ్ళ మమ్మీని తీసుకొని శృతి బయటికి. ఇక బాలు రాజేష్ దగ్గరికి వచ్చి నా తప్పు లేకపోయినా నన్నే క్షమాపణలు చెప్పమంటారు ఏంటని జరిగిందంతా బయట పెడతాడు. ఇక బార్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. కార్తీక్ రాజేష్ బాలుల కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. ఇక అందరూ కలిసి బార్ కి వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు బార్ లో గొడవ పడతాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…