BigTV English

Suriya: సూపర్ హీరో పాత్రలో సూర్య.. మలయాళ దర్శకుడితో కలిసి ప్రయోగం..

Suriya: సూపర్ హీరో పాత్రలో సూర్య.. మలయాళ దర్శకుడితో కలిసి ప్రయోగం..

Suriya: నటీనటులు సినిమా సినిమాకు ఏదో ఒక కొత్తదనం చూపించాలి. అప్పుడే ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ఒకే విధమైన పాత్రలు చేస్తూ ఉంటే ఎంత స్టార్ అయినా ప్రేక్షకులకు నచ్చకుండా పోవచ్చ. ఈ ట్రిక్ తెలిసిన వారు ప్రతీ సినిమాకు డిఫరెంట్ స్క్రీప్ట్, డిఫరెంట్ క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిలో సూర్య ఒకరు. కోలీవుడ్‌లో ఒక సినిమా కోసం, పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే హీరోల్లో సూర్య పేరు ముందుంటుంది. తాజాగా సూర్య అప్‌కమింగ్ మూవీకి సంబంధించి ఒక కొత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మలయాళ దర్శకుడితో కలిసి ఈ తమిళ హీరో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.


సూపర్ హీరో సూర్య

ప్రస్తుతం సూర్య (Suriya).. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ‘రెట్రో’ తర్వాత సూర్య చేస్తున్న సినిమాలు ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇదే సమయంలో సూర్య ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ సైన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సూపర్ హీరో సినిమాలో సూర్య హీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ హీరో చివరిగా ‘కంగువా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది డిశాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా సినిమాల విషయంలో ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు సూర్య. అందుకే తన తరువాతి చిత్రం సూపర్ హీరో జోనర్‌లో ఎంచుకున్నాడని తెలుస్తోంది.


మళ్లీ అలాంటి మ్యాజిక్

ఇండియన్ భాషల్లో సూపర్ హీరో సినిమాలు అనేవి చాలా తక్కువగా తెరకెక్కాయి. ఇండియన్ మేకర్స్ చాలా తక్కువ సూపర్ హీరో క్యారెక్టర్లను క్రియేట్ చేశారు. అలా మాలీవుడ్‌లో క్రియేట్ అయిన ఒక సూపర్ హీరో పేరే ‘మిన్నాల్ మురళి’. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో టోవినో థామస్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులు కూడా సాధించింది. ఇక బాసిల్ జోసెఫ్‌తో కలిసి మరోసారి ‘మిన్నాల్ మురళి’ లాంటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయనున్నాడట సూర్య. దానిలాగానే ఇది కూడా ఒక సూపర్ హీరో ఫిల్మ్ అని, వార్తలు ఇంకా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది.

Also Read: మరోసారి వెండితెరపై తమన్ రీఎంట్రీ.. ఆ హీరో సినిమాలో ప్లానింగ్..

నటుడిగా బిజీ

బాసిల్ జోసెఫ్ (Basil Joseph) మాలీవుడ్‌లో కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటికీ నటుడిగా తన చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నా వాటన్నింటి నుండి బ్రేక్ తీసుకొని సూర్యతో సూపర్ హీరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సూర్య కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా ఎదురుచూస్తున్నాడు. శివ దర్శకత్వంలో తను నటించిన ‘కంగువా’ ఆ రేంజ్‌లో డిశాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మినిమల్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా డిశాస్టర్ అవ్వడం వల్ల సూర్య కూడా డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×