Flight Crash: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం-హెలికాప్టర్‌లు ఢీ కొన్నాయి. ఆ తర్వాత ఈ రెండు పక్కనేవున్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో విమానం దాదాపు 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను గుర్తించారు. మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
అక్కడి కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానం 60 మంది ప్రయాణికులతో కాన్సాస్‌లోని విషిటా నుంచి వాషింగ్టన్‌కు బయలుదేరింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు రన్ వేపై దిగేందుకు రెడీ అవుతోంది విమానం. అదే సమయంలో ఆ దేశ సైన్యానికి చెందిన బ్లాక్‌హాక్ హెలికాఫ్టర్ (సికోర్ స్కీ హెచ్-60)ను ఢీ కొట్టింది. ఆకాశంలో ఈ ఘటన జరగడంతో భారీ శబ్దం వినిపించింది. వెంటనే పోటోమాక్ నదిలో కూలింది విమానం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, అధికారులు పోటోమాక్ నది ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. ప్రస్తుతం నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేసింది రెస్య్కూ టీమ్.
విమానంలో 60 ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. అలాగే హెలికాఫ్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నాయి. వీఐపీలు ఎవరూ లేరని రక్షణశాఖ వర్గాల మాట. రాత్రి వేళ ఘటన జరగడంతో సహాయక చర్యలు కాసింత కష్టంగా మారింది. ఈ ఘటనపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని దేవుడ్ని కోరుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
ఈ ఘటన అంతా కేవలం 30 సెకన్లలో జరిగిపోయింది. ప్రమాదానికి ముందు రేడియో కాల్ ద్వారా హెలికాప్టర్‌కు మెసేజ్ వెళ్లింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రన్ వే పైకి ప్రయాణికుల విమానం దిగేందుకు లైన్ క్లియర్ ఇచ్చింది ఏటీసీ. సరిగ్గా అదే సమయంలో అటు ఓ మిలటరీ హెలికాప్టర్ వస్తోంది. మీ ముందు విమానం వస్తోందని, కనిపిస్తుందా అంటూ ఆ రేడియో కాల్ వాయిస్ పంపిన క్షణాల్లో ఈ ఘోరం జరిగిపోయింది.
ALSO READ: 20 మంది ప్రాణాలు తీసిన విమానం.. మరో ఘోర దుర్ఘటన!
నదిలో కూలిన విమానం
వాషింగ్టన్లో హెలికాఫ్టర్, విమానం ఢీ
రోనాల్డ్ రీగన్ విమానాశ్రయం వద్ద పోటోమాక్ నదిలో కూలిన చిన్న విమానం
ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
ప్రమాదానికి గురైంది పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానంగా గుర్తింపు pic.twitter.com/J0pG38MHNN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025