Gundeninda GudiGantalu Today episode july 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి, రవి ఇంటికి రావడంతో పాటుగా కేక్ తీసుకొని వస్తుంది. అందరూ కేక్ కట్ చేసి సంతోషంగా ఒకరికొక తినిపించుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అటు మౌనికను వాళ్ళింట్లో వాళ్ళు ఏడుస్తున్నారని ఇంకాస్త ఏడిపించాలని సంజయ్ ఇంటికి తీసుకొస్తాడు. అయితే సంజయ్ ని మౌనికని చూసి అందరూ సంతోషపడతారు. కానీ సంజయ్ మాత్రం అక్కడ సీను చూసి షాక్ అవుతాడు. మీరు గొడవపడి విడిపోయారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని సంజయ్ అడుగుతాడు. నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటామని బాలు దిమ్మతిరిగి పోయేలా చెప్తాడు. సంజయ్ కు బాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మనోజ్ గురించి తెలియదేమో అని అంటాడు. రోహిణికి శృతి కౌంటర్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజూ మాత్రం వాళ్ళింట్లో చాలా సంతోషంగా ఉన్నారు.. ఇంకొకసారి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తే నేను అస్సలు తట్టుకోలేను మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి అని సంజయ్ అంటాడు. మౌనిక ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనే సామెత ఎందుకే అంటారు మీరు ఎప్పుడు వేరే వాళ్ళు ఇబ్బంది పడాలని కోరుకోకండి అని అంటుంది.. ఇంకొకసారి నాకు సలహాలిస్తే అస్సలు ఊరుకోను. కచ్చితంగా ఎక్కడపడితే అక్కడ కొడతాను అది చూసి నీ వాళ్ళు బాధపడాలి. మీ నాన్న అనారోగ్యంతో మంచాన్ని పడి చచ్చిపోవాలని అంటాడు. మీనా దగ్గరకు శృతి వస్తుంది. అయితే రోహిణి కూడా వచ్చి నాకు కూడా టీ కావాలని అడుగుతుంది.. వాళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మీనా శృతి ముందు పరువు తీసేసింది అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మీనా మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఎంత పొగరు మీనా కి నన్ను ఇలా శృతి దగ్గర తలదించుకునేలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనా పూలు కడుతుంటే శృతి వచ్చి పూల వాసన చాలా బాగుంది నాకు కొన్ని పూలు కావాలి అని అడుగుతుంది. ఇవి ఆల్రెడీ వాడిపోయేలా ఉన్నాయి. రేపు ఉదయము కొత్త పువ్వులను కట్టి తీసుకొచ్చి ఇస్తాను అని అంటుంది.
మీనా నటింట్లో పువ్వులు కట్టడం చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. శృతి మాత్రం ఆ పువ్వుల వాసనకి మైమరిచిపోతుంది. పొద్దున్నే నాకేం అవసరం లేదు నాకు ఇప్పుడే కావాలి ఒక మూరపువ్వులు తీసుకుని ఇవ్వవా అని అడుగుతుంది. ఆ పూలను చేతికి చుట్టుకుని వాసన పీలుస్తూ ఉంటుంది. శృతిని చూసిన ప్రభావతే షాక్ అవుతుంది. ఈ అమ్మాయి స్పీడ్ ఏంటసలు రవి అసలైన అమాయకుడు. మెతకమనిషి ఎలా భరిస్తాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. అటు మీనా కూడా శృతి స్పీడును చూసి సిగ్గు పడుతూ ఉంటుంది.
Also Read : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
బాలు మీనా ఫోన్ చేసిందని పైనుంచి ఎంత సంతోషంగా కిందకు వస్తాడు. మీనా చేతిలోనే మల్లెపూలు కిందపడి మీనా పై పడతాయి. బాలు మీనాల మధ్య రొమాంటిక్ సీను హైలెట్ కానుంది. మీనా పూల కొట్టు వల్ల తన మాట వినట్లేదని ప్రభావతి ఏదో ఒకటి చేసి మీనాని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. పూల కొట్టు వల్ల తనకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని తెగ బాధ పడిపోతుంది. మినపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని రోహిణి అనుకుంటుంది. ముందు మనోజ్ కి ఒక జాబ్ వస్తే నేను వీళ్ళ అందరి చేత మాటలు పడాల్సిన అవసరం ఉండదు అని మనోజ్ ని రెచ్చగొడుతుంది.
నువ్వు జాబ్ తెచ్చుకోలేదని నానా మాటలు అంటున్నారు. కెనడా వెళ్లాలని ప్రయత్నం అనుకొని ఇక్కడ ఏదో ఒక జాబ్ తెచ్చుకో మనోజ్ అని క్లాస్ పీకుతుంది. అటు శృతిరవిలు ఇద్దరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. శృతి చేసిన దాన్ని ప్రభావతి సత్యంతో చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…