Infinix Smart 10| ఇన్ఫినిక్స్ స్మోర్ట్‌ఫోన్ కంపెనీ తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 పేరుతో ఒక లోబడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శుక్రవారం భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ మార్కెట్ సెగ్మెంట్‌లో ఓ సంచలనమని, నాలుగేళ్ల పాటు లాగ్ లేని అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి IP64 రేటింగ్ కూడా ఉంది. అంటే ధూళి, నీటి తడిని తట్టుకుంటుంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ Unisoc T7250 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇంకా, ఇన్ఫినిక్స్ AI ఫీచర్లు, Folax AI వాయిస్ అసిస్టెంట్, UltraLink ఫీచర్‌తో కాల్స్ చేయడం సులభం, అది కూడా నెట్‌వర్క్ లేకుండా!
ధర, అందుబాటు:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర 4GB RAM + 64GB స్టోరేజీతో రూ. 6,799గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ట్విలైట్ గోల్డ్ రంగుల్లో వస్తుంది. ఆగస్టు 2 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్స్, ఫీచర్లు:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) IPS LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB LPDDR4x RAM, 64GB స్టోరేజీ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ TÜV SÜD సర్టిఫికేషన్‌తో నాలుగేళ్లు లాగ్-ఫ్రీ అనుభవాన్ని హామీ ఇస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1తో పనిచేస్తుంది. ఇందులో Folax AI వాయిస్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 8-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. రెండూ 2K వీడియో రికార్డింగ్‌ను 30fpsలో సపోర్ట్ చేస్తాయి. డ్యూయల్ వీడియో మోడ్ కూడా ఉంది.
ఇతర ఫీచర్లు:
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, FM రేడియో, OTG కనెక్టివిటీ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ UltraLink ఫీచర్‌తో నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్‌లకు కాల్స్ చేయవచ్చు. ఇది IP64 రేటింగ్‌తో ధూళి, నీటి నుంచి రక్షణ ఇస్తుంది. DTS ట్యూన్డ్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 187గ్రా, కొలతలు 165.62 x 77.01 x 8.25mm.
ఈ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. అడ్వాన్స్ టెక్నాలజీ, AI ఫీచర్లు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ తో ఇది యూజర్లకు గొప్ప ఎంపికగా నిలుస్తుంది.