BigTV English

OTT Movie : పోలీసులకే పిచ్చెక్కించే దెయ్యం… ఈ కిర్రాక్ హార్రర్ మూవీ చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి భయ్యా

OTT Movie : పోలీసులకే పిచ్చెక్కించే దెయ్యం… ఈ కిర్రాక్ హార్రర్ మూవీ చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి భయ్యా

OTT Movie : హారర్ సినిమాలను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు భయపెట్టే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ మధ్యకాలంలో హిందీ, తెలుగు, తమిళ్ భాషలలో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వరుస హత్యల కేసులో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లాంగ్‌లెగ్స్’  (Long legs). 2024లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఓస్‌గుడ్ పెర్కిన్స్ రచించి దర్శకత్వం వహించారు. మైకా మన్రో, అలీసియా విట్, బ్లెయిర్ అండర్‌వుడ్, నికోలస్ కేజ్ ఇందులో నటించారు. ఈ స్టోరీ 1990లలో ఒక FBI ఏజెంట్‌ను అనుసరిస్తుంది. ఆమె అనేక కుటుంబాలను హత్య చేసిన ఒక సీరియల్ కిల్లర్‌ను గుర్తించే పనిలో ఉంటుంది. జూలై 12, 2024న యునైటెడ్ స్టేట్స్‌లో నియాన్ ద్వారా ‘లాంగ్‌లెగ్స్’ విడుదలైంది. $10 మిలియన్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $126 మిలియన్లు వసూలు చేసింది. దేశీయంగా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

సిటీలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్న ఒక సైకో కిల్లర్ ని పట్టుకునే క్రమంలో హీరోయిన్ వస్తుంది. అయితే ఇప్పటివరకు ఎవరూ  పట్టుకోలేని ఆ క్రిమినల్ ని హీరోయిన్ పట్టుకుంటుంది. పోలీసులు ఆమె తెలివికి ఆశ్చర్యపోతారు. ఆమె బ్రెయిన్ మీద ఐక్యూ టెస్ట్ కూడా చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ను FBI కి పంపుతారు. అక్కడ కూడా ఎవరూ సాల్వ్ చేయలేకపోతున్న ఒక కేసును హీరోయిన్ కు ఇస్తారు. ఈ క్రైమ్ చాలా
డిఫరెంట్ గా ఉంటుంది. కుటుంబం లో అందర్నీ చంపిన తర్వాత ఆ కుటుంబ పెద్ద సూసైడ్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా చాలా కుటుంబాలు హత్యలకు గురవుతూ ఉంటాయి. ఈ హత్యలు జరిగిన చోట ఒక లెటర్ కూడా పెట్టి ఉంటుంది. అందులో ఎవరికి అర్థం కాని భాషలో రాసి ఉంటుంది. లాంగ్ లెగ్స్ అని ప్రతి లెటర్ లో ఉంటుంది. ఈ హత్యల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ప్రతినెల 14వ తారీకు పుట్టినరోజు జరుగుతున్న ఇంట్లోనే ఈ హత్యలు జరుగుతుంటాయి. ఒకసారి హీరోయిన్ ఇంటికి కూడా ఒక వ్యక్తి వచ్చి లెటర్ పెట్టి వెళ్ళిపోతాడు. అతన్ని పట్టుకునే లోగా కనిపించకుండా పోతాడు. ఆ లెటర్ ని హీరోయిన్ డి కోడ్ చేస్తుంది. అందులో నీ బర్త్డే రోజు నిన్ను కూడా చంపేస్తాను అని రాసి ఉంటుంది. చివరికి హీరోయిన్ ఆ సైకోని పట్టుకుంటుందా? సైకో హీరోయిన్ ను చంపేస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×