Gundeninda GudiGantalu Today episode march 2 nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ఇన్ని రోజులు దాచిపెట్టి నిజాన్ని బాలు బయట పెట్టడంతో ప్రభావతి మనోజ్ బాలుపై కోపంగా ఉంటారు. ఇక రోహిణి ఎంత చెప్పినా కూడా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణిని బ్రతిమలాడినా కూడా రోహిణి ఒప్పుకోదు. నిన్ను నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను నీకు తెలీదు అయితే నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని నేను అనుకోలేదు అని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక మాట అనడంతో రోహిణి ఏడుస్తుంది. మనోజ్ మాత్రం రోహిణిని ఓదార్చలేక పోతాడు. రోహిణి మనోజ్ మోసం చేశాడని బాధపడుతుంది. తనలో తానే కుమిలిపోతుంది. తన ఫ్రెండ్ తో మనోజ్ మోసాన్ని బయట పెడుతుంది.. బాధ పడుతుంది. మనోజ్ కు దూరంగా వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు పూల షాప్ గురించి పాంప్లెట్లు పంచడానికి పార్కు వెళ్తాడు అక్కడున్న వాచ్మెన్ తో మాట్లాడుతున్నప్పుడు అక్కడే కూర్చుని ఉన్న మనోజ్ ని చూస్తాడు. మనోజ్ ఇన్ని రోజులు ఇంట్లో జాబు ఉందని చెప్పి ఇలా పార్కుల్లో టైంపాస్ చేస్తున్నాడని మొత్తం వీడియోని తీసి ఇంట్లో వాళ్లకి చూపిస్తాడు. ఇంట్లో అందరూ నమ్మరు ముఖ్యంగా రోహిణి తన భర్త ఏ క్లైంట్ ను కలవడానికి వెళ్ళాడని అనుకుంటుంది. అయితే బాలు మాత్రం నీ భర్త క్లైంట్ ని కలవడానికి వెళ్ళాడా అయితే ఈ టైం కి చూడు ఈ టైం కి చూడు అని టైం ప్రకారం వీడియోలను తీసి చూపిస్తాడు.
అలాగే పార్కు వాచ్మెన్ తో సహా కార్ షోరూమ్ వాళ్ళని కూడా అడిగి వీడియోలను తీసుకొస్తాడు. రెండు నెలలుగా మనోజు ఆ పార్కులోనే ఉంటున్నాడని వాచ్మెన్ చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. ఈ విషయాన్ని మనోజ్ తో నిలదీస్తుంది. రోహిణి మాత్రమే కాదు అటు సత్యం కూడా మనోజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అలాగే మీనా శృతిరవీలు కూడా మనోజ్ నీ తిడతారు. ఇదంతా సహించలేకపోయిన రోహిణి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మనోజ్ వచ్చి ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా కూడా రోహిణి మాత్రం అసలు వినదు.
ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్లి మనోస్ నన్ను దారుణంగా మోసం చేశాడని బాధపడుతుంది. నేను ఒక పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు మనోజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాను నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతున్నాను అని అంటుంది. మనోజ్ జాబ్ లేదని చెప్పకపోవడం తప్పే కానీ నువ్వు ఎంత పెద్ద మోసం చేసి ఆ ఇంటికి కోడలు అయ్యావు ఆ విషయం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి నువ్వు ఇప్పుడు ఎన్ని మాటలు అయితే మనోజ్ ను అన్నావో అవన్నీ రివర్స్ నీకే తగులుతాయి అని నువ్వు ఆలోచించవా అని విజ్జి హెచ్చరిస్తుంది.
మనోజ్ కి ఎలాగైనా దూరంగా ఉండాలని అప్పుడే తను జాబ్ తెచ్చుకొని దారిలోకి వస్తాడని ఆ తర్వాత నేను మనోజ్ దగ్గరికి వెళ్లొచ్చని రోహిణి అనుకుంటుంది. ఇక మనోజ్ కి దూరం గా వెళ్ళిపోతుంది. రాత్రి అవుతున్న కూడా రోహిణి ఇంటికి రాకపోవడంతో ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడతారు. మనోజ్ విజ్జి కి ఫోన్ చేసి రోహిణి కి ఒకసారి ఫోన్ ఇవ్వవా నేను మాట్లాడతానని అడుగుతాడు. కానీ రోహిణి లేదు ఎక్కడికో వెళ్లిపోయిందని విజ్జి చెప్పగానే మనోజ్ షాక్ అవుతాడు..
ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని మనోజ్ వస్తాడు అయితే హాల్లో ఉన్న బాలు దగ్గరికి వెళ్లి నేరుగా బాలు కాలర్ పట్టుకుని నా భార్యను అన్నావు అందుకే నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది అసలు నువ్వెవరు నా భార్యన అనడానికని కాలర్ పట్టుకుంటాడు. నువ్వు చేసిన మోసని భరించలేక నీ భార్య వెళ్ళిపోయింది అంతేకానీ నేను ఏదో అన్నానని కాదు అది నువ్వు గుర్తు పెట్టుకొని ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడే సత్యం అక్కడికి వచ్చి కొట్టుకొని చావండి లాగా ఉందా అసలు రోహిణికి ఏమైందన్న విషయం తెలుసుకోకుండా ఇలా కొట్టుకుంటున్నారు కొంచమైనా మీకు బుద్ధుందా ఇంకెన్నాళ్లు ఇలా కొట్టుకుంటారు నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎవరికి వారు సపరేట్గా ఉంటే సరిపోతుందని సత్యం అంటాడు. ఇక ప్రభావతి కూడా మనోజ్ కి తోడుగా ఉండడంతో సత్యం మీనా బాలుని బయటకు పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే…