Gundeninda GudiGantalu Today episode march 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి మంచి చీర కొనాలని అనుకుంటాడు. మీనాకు ఆ చీరను తెచ్చి ఇస్తాడు ఇదేంటి మీరు ఇది కొనడానికి వెళ్లారా నేను ఇంకా ఏదో అనుకున్నాను అనేసి నేను అనగానే.. భర్తలు ఎప్పుడూ తాగడానికి డబ్బులు తీసుకురమ్మ ఇలాంటివి కూడా కొన్ని కొంటారు అవి నమ్మండి అనేసి అనగానే బాలు నేను హర్ట్ అయ్యాను అంటాడు. బాలుని క్షమాపణలు కోరుతుంది. ఊర్లో నా భార్య మంచి చీర కట్టుకొని తిరగాలని నేను అనుకున్నాను అందుకే ఈ చీర కొన్నాను అని అనగానే మీనా బాలుకు ముద్దు పెట్టేస్తుంది. రోహిణి మాత్రం తన మామయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ను సెట్ చేస్తుంది. తనకి ట్రైనింగ్ ఇచ్చే పనిలో ఉంటుంది. మొత్తానికి రోహిణి అనుకున్నట్లుగా తన మామయ్యగా మాణిక్యంను దించబోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరి షీలా డార్లింగ్ ఊరికి వెళ్ళడానికి సిద్ధం అవుతారు. కానీ రవి, శృతిలు రాలేదని బాలు అంటాడు. ప్రభావతి నేను వెళ్లి తీసుకొస్తాను అంటుంది. అక్కడ శృతి రావడానికి ఇష్ట పడదు. రవి శృతిని ఒప్పించే పనిలో ఉంటాడు అది విన్న ప్రభావతి శృతి వస్తున్న రాదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఇలా మాట్లాడితే రాకుండా ఉండిపోతుందేమో అనేసి ప్రభావతి లోపలికి వెళ్లి అమ్మ శృతి ఏంటి ఇంకా రాలేదు రెడీ అవ్వలేదు ఏంటి మీ కోసం అందరు కింద వెయిట్ చేస్తున్నారని అంటుంది. లేదంటే నేను రావడం లేదు నాకు కొంచెం పని ఉంది అనేసి శృతి అంటుంది.
తనకి పల్లెటూరికి రావడం ఇష్టం లేదంటమ్మ మనం వెళ్తే తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంట. అని రవి అనగానే ప్రభావతి అయ్యయ్యో అలా చేస్తే చాలా తప్పమ్మా మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది. కానీ విడివిడిగా వెళ్తే ఏదో జరిగిందని మీరిద్దరి మధ్య ఏదో గొడవలు జరిగాయని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అక్కడ నీకు ఏ లోటు రాదు . నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని ప్రభావతి అంటుంది. మొత్తానికైతే ప్రభావతి శృతిని ఒప్పించి కిందకు తీసుకొస్తుంది.
వచ్చేసారా అందరూ మరి ఎవరు ఏ కార్లో ఎక్కాలంటే అరే లేచిపోయినోడా ఆ కార్ లో కూర్చొని బాలు సెటైర్లు వేస్తాడు. ఇక బాలుని మీనా, సత్యం ఎంతగా వద్దని చెప్తున్న కూడా బాలు నోటికి మాత్రం మూతపడదు. ఇక సత్యం అందరూ సర్దుకున్నారా అది పల్లెటూరు. ఇక్కడ ఏదైనా తీసుకోవాలంటే 50 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది అందరూ సద్దుకోండి అనేసి అనగానే మేము అందరం సర్దుకున్నాం. ఈ లక్షల మింగనోడు మాత్రమే సరిగ్గా సర్దుకోలేదు అని అంటాడు. దానికి రోహిణి మనోజ్ కి సద్దడానికి నేనున్నాను అనేసి అంటుంది.
ఇక బయటికి వెళ్ళగానే ప్రభావతి మీనా ను నా బ్యాగు పట్టుకోమని అంటుంది. మీ బ్యాగు నేను పట్టుకుంటే నా బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు అని అనగానే బాలు ఆవిడ బ్యాగు నువ్వు పట్టుకో నీ బ్యాగ్ ఆవిడ పట్టుకుంటుంది అంతే కదా అనేసి అంటారు. ఏమొద్దు నా బ్యాగు నేనే పట్టుకుంటాను అని ప్రభావతి అంటుంది. శృతి మకార్లో వస్తారా అంటే లేదు లేదు బాలు తో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది నేను మధ్యలోనే దిగిపోవాల్సి వస్తుంది. నేను రాను అనే సన్నగాని నువ్వు మా ఆవిడని కాపాడే డబ్బులు అమ్మ నిన్ను ఏమీ అనను. రా వెళ్దాం అని అంటే లేదు నేను రాను అనేసి శృతి అంటుంది.
సత్యం ప్రభావతి బాలు కారులో వచ్చేందుకు ఒప్పుకుంటారు. అందరూ సరదాగా నానమ్మ ఊరికి వెళ్లడానికి బయలుదేరుతారు. బాలు మీనా ఇద్దరు పల్లెటూరు వాతావరణ ని ఆస్వాదిస్తుంటే ప్రభావతి మాత్రం కౌంటర్లు వేస్తుంది. ఇది ఏమైనా లండన్ అనుకున్నారా పల్లెటూరేగా అనేసి అనగానే బాలు ప్రభావతికి తిరిగి కౌంటర్లు. అలా సరదాగా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతారు. సత్యం తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడతారు. అందరూ తమ ఫ్యామిలీ విషయాలు గురించి పంచుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శీల డార్లింగ్ అంటూ బాలు సరదాగా భామను ఎత్తుకొని తిరుగుతాడు.. రోహిణి టెన్షన్ పడుతుండడం బాలు గమనిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..