Ram Charan birthday special: మెగాస్టార్ అంటే సినీ ఇండస్ట్రీకి ఒక ఆదర్శం.. స్వయంకృషితో సినిమాల్లో మకుటం లేని మహారాజుగా సినిమాలతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అప్పటికి ఇప్పటికీ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటి హీరో కొడుకు హీరో అవుతున్నాడంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి.. మెగా వారసుడిగా చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో మెట్టు అడుగుతూ తండ్రికి తగ్గ తనయుడు అని అందరితో చేత ప్రశంసలు అందుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన సినీ విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
రామ్ చరణ్ సినీ ప్రస్థానం..
మెగా నట వారసుడిగా చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి నటనను పునికిపుచ్చుకున్నాడు. మొదటి సినిమాతో నటనకు మార్కులు పడ్డాయి. రెండో సినిమాని రాజమౌళితో చేశారు. ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమా మెగా అభిమానుల మనసు దోచుకుంది. మూడో చిత్రంగా ‘ఆరెంజ్’ అంటూ లవబుల్ సినిమా చేసాడు. ఈ మూవీ అడ్వాన్స్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. రామ్ చరణ్ .. ఆ తర్వాత రచ్చ, నాయక్ వంటి మాస్ చిత్రాలతో తెలుగులో యాక్షన్ కథానాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డ్యాన్స్, నటనతో చిరంజీవిని మించి పోయాడనే టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఒక్కో సినిమాతో తన నటనతో అభిమానుల మనసు దోచుకున్నాడు.
రంగస్థలం సినిమాతో తనలోని మరో యాంగిల్ ని పరిచయం చేశాడు రామ్ చరణ్.. ఈ సినిమాలో తన నటనతో తిట్టిన నోళ్లతోనే ప్రశంసలు అందుకునేలా చేసుకున్నాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది.. రంగస్థలం తర్వాత చేసిన వినయ విధేయ రామ సినిమాతో యావరేజ్ కాకుండా అందుకున్నాడు కానీ తన నటనకు మాత్రం ఫుల్లు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటించాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన తీరును అందరు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో న తోటి స్టార్ అయిన ఎన్టీఆర్‌తో పోటీ పడ నటించాడు. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వతా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి యాక్ట్ చేసిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయింది.
త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటించాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆ సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఇప్పటివరకు రామ్ చరణ్ 15 సినిమాల్లో నటించాడు. ఒక్కో సినిమాతో ఒక్కో యాంగిల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్టార్ హీరోగా, గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఈ మూవీకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చెయ్యనున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
Also Read : ప్రేమించిన అమ్మాయి వేరొకరితో అలా.. ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నా..
పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..
మెగాస్టార్ తనయుడిగా సినిమాలపరంగా సక్సెస్ అయిన రామ్ చరణ్ తన రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యారు. బిజినెస్ ఉమెన్ ఉపాసన ను పెళ్లి చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ గౌరవాన్ని పెంచుకుంది. పలుసేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గ కోడలని ఉపాసన అనిపించుకుంది. ఇక వీరిద్దరి దంపత్యానికి గుర్తుగా పాప పుట్టింది. ఆ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు. సినిమాలతో బిజీగా ఉన్న కూడా సమయం దొరికినప్పుడల్లా తన కూతురితో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. ఇలా సినిమాలతో అత్యున్నత స్థాయికి వెళ్ళిన రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మెగా అభిమానులు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు రామ్ చరణ్ జరుపుకుంటూ, వరుస సినిమాలతో ప్రేక్షకుల హృదయాలల్లో చెరగని ముద్రవేసుకోవాలని మనస్ఫూర్తిగా బిగ్ టీవీ కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్..