Gundeninda GudiGantalu Today episode May 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి,రవి సైకిల్ మీద వెళ్లడం చూసి సురేందర్ షాక్ అవుతాడు. హోటల్ ఓనర్ని చేసుకోవాల్సింది హోటల్ లో పని చేసే వారిని చేసుకుంది ఎలా భరిస్తుందో చూసావా అని శోభాతో సురేందర్ అంటాడు. కూతుర్ని అలా సైకిల్ మీద వెళ్లడం చూసి తల్లిదండ్రులు బాధపడతారు. వాడు ఇంకొకసారి నేల మీద నడుచుకొని పోకుండా చూడాలి అని సురేందర్ అనగానే శోభా నేను చూసుకుంటాను లేండి అసలు ఏం జరిగిందో నీకు అనుకుంటానని అంటుంది. ఇక కారు డ్రైవర్ల అందరు ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే గుణ అక్కడికి వచ్చి మీకు ఇచ్చిన టైం అయిపోయింది. కారులో నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు. ఇంత సడన్ గా డబ్బులు అడిగితే ఎలా ఇస్తాను గునా కాస్త టైం అయిన ఇవ్వాలి కదా అని రాజేష్ అడుగుతాడు. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నేను వడ్డీలకి డబ్బులు ఇచ్చాను ఆ డబ్బుల్ని రాబట్టుకుంటున్నారు. అంతేకానీ నేను మీ దగ్గర మీరు దౌర్జన్యంగా చేయట్లేదు కదా అని గుణం అంటాడు. సడన్ గా నువ్వు డబ్బులు కట్టమంటే ఎలా కడతాం కారు లేకుండా అంటే మా కుటుంబం ఎలా సాగుతుంది అని డ్రైవర్లు అందరూ బాధపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేష్ ఇంత డబ్బులు నీకు ఎక్కడ నుంచి వచ్చాయి రాని బాలుని అడుగుతాడు. నేను మీ అందరి కుటుంబాల్లో చీకటి నింపాలి అనుకోవట్లేదు రా అందుకే నా కారుని అమ్మేశానని చెప్పేస్తాడు. బాలు కారు నమ్మిస్తే నువ్వెలా బతుకుతావు రా అని రాజేష్ అంటాడు. నాకేమన్నా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అని బాలు అంటాడు.. ఇక మనోజ్ ఏం చేస్తున్న హోటల్ కి తనకు అప్పు ఇచ్చిన తన ఫ్రెండు అక్కడికి వస్తాడు. మనోజ్ అతను చూసి లోపలికి వెళ్లబోతుంటే అతను అడ్డుపడతాడు.. అప్పు వసూలు చేసుకోవడం నాకు రాదు అనుకున్నావా అని అతను మనోజ్తో అంటాడు.. మనోజ్ ఫ్రెండ్ రెస్టారెంట్ కి వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకురమ్మని చెప్తాడు. అయితే ఆ ఐటమ్స్అన్నీ ఒక్కడి తినేస్తాడు. అది చూసిన మనోజ్ చిరాగ్గా ఫీల్ అవుతాడు. అలాగే ఇవన్నీ ఒక పార్సెల్ తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇది డబ్బులు ఎవరు కడతారని అడిగితే నువ్వే కట్టాలి. వడ్డీ ఇవ్వలేదు కదా అని షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు..
ఆ తర్వాత సత్యం ఇంటికి వస్తాడు. ప్రభావతి సత్యమును ఎక్కడికి వెళ్లి వచ్చారు డబ్బులు తీసుకుని వెళ్లారు కదా తీసుకున్నారా..? మీ కొడుకు ఇలా అందరిని కొట్టుకుంటూ పోతుంటే నువ్వు మాత్రం డబ్బులు ఇచ్చుకుంటూ పోతుండు అని అంటుంది. వాళ్లకి ఇంకేముంది తీసుకునే ఉంటారులే అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది. కానీ సత్యం మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకోలేదు కొడుకు లాంటి అల్లుడే తన కొడుకుని కొట్టాడని బాధపడుతుందని చెప్తాడు. కూతురు కొట్టు పెట్టింది కదా బాగానే డబ్బులు సంపాదిస్తుంది అందుకే ఆ డబ్బులు ఇచ్చినట్లు ఉంది అని ప్రభావతి అంటుంది.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు. ఇప్పుడు చూసినా కోడల్ని ఆడిపోసుకోవడం తప్ప మరి ఏమి చేయవా నువ్వు అని సత్యం ప్రభావతిపై సీరియస్ అవుతాడు.. ఇక తర్వాత మీనా వస్తుంది. మా అమ్మని దానికి క్షమించండి మావయ్య అనేసి అడుగుతుంది. ఏమన్నారు మీ అమ్మ ఏం చేశారే అనేసి ప్రభావతి అడుగుతుంది. కానీ మీన మాత్రం సమాధానం చెప్పదు. సత్యం వెళ్ళగానే ప్రభావతి మీనా పై సీరియస్ అవుతుంది. అయితే మీనా మాత్రం మీ ఆయన్ని అడగండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
సత్యం మాత్రం బాలు రాగానే పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతాడు. మీనా వాళ్ళ అమ్మ నన్ను అలా అడుగుతుంటే నేనేం చేయాలి నాకు అర్థం కాలేదు మీ కొడుకు నాకు తోడుగా ఉంటాడు అనుకున్నాను. కానీ ఇలా నా కొడుకుతో చెయ్యి నీ విరగగొడతాడని అస్సలు అనుకోలేదని సత్యంతో పార్వతి అన్నట్లు. సీరియస్ అయినా బాలు మీరు ఎందుకు నాన్న అక్కడికి వెళ్లారు అని అడుగుతాడు.. బాలు మాత్రం ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు కారు నుంచి మారతాడు.. ఆటో డ్రైవర్ గా నేను ఈ పని చేసుకుంటానని అందరితో అంటారు..
ఇక మనోజ్ హోటల్ లో తన ఫ్రెండ్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడు. అయితే ఆ సమయంలో అతని షర్ట్ మీద సాంబార్ పడటంతో రోహిణి కనిపెడుతుంది.. ఏదో ఒకటి చెప్పి మనోజ్ మేనేజ్ చేస్తాడు. మరో కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకోడానికి వెళ్లిన మనోజ్ అరతని దగ్గర ఆర్డర్ తీసుకొని లోపలికి వెళ్ళగానే.. తన ఫ్రెండు సాంబారు ఆ టేబుల్ కి ఇవ్వమని ఇస్తాడు పొరపాటున ఒక కస్టమర్పై ఆ సాంబార్ పడిపోతుంది అతను చేసిన రచ్చ అంతా కాదు.. రెస్టారెంట్లో కొట్టుకునే అంత పని అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..