Russia S-500: దాని పేరు వింటేనే పాకిస్తాన్ వణికిపోతోంది. దాని పనితీరు తెలిసి.. ప్రపంచం నివ్వెరపోతోంది. అదే.. ఎస్-400 ట్రయంఫ్. మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ప్రపంచంలో ఇప్పుడున్న గగనతల రక్షణ వ్యవస్థల్లో.. దీనిని మించింది మరొకటి లేదు. ఇదే.. శత్రువుల అస్త్రాలకు దడ పుట్టిస్తుంటే.. ఇప్పుడు దాని తాత రాబోతోంది. అదే.. ఎస్-500 డిఫెన్స్ సిస్టమ్! పైగా.. ఇండియాతో కలిసి ఎస్-500 తయారీకి సిద్ధంగా ఉన్నామంటూ రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాంతో వరల్డ్ వైడ్ ఇప్పుడు దీనిమిదే డిబేట్ మొదలైంది. ఎస్ 400 కంటే ఎస్ 500 ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది?
సిస్టమ్ ఆన్ చేస్తే చాలు.. ఫుల్లీ ఆటోమేటెడ్.
సిస్టమ్ ఆన్ చేస్తే చాలు.. ఫుల్లీ ఆటోమేటెడ్. శత్రుదేశాల నుంచి వచ్చే విమానాలైనా, డ్రోన్లయినా, మిసైళ్లయినా.. ఉతికి ఆరేస్తుంది. పేల్చేసి.. కాల్చేస్తుంది. ఇదీ.. భారత్ దగ్గరున్న సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కెపాసిటీ. ఆపరేషన్ సిందూర్‌తో.. ఇండియా సత్తా ఏమిటో పాకిస్తాన్‌కు మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా బాగా తెలిసొచ్చింది. స్వదేశీ డిఫెన్స్ వ్యవస్థలకు.. విదేశీ టెక్నాలజీ తోడైతే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది అందరికీ అర్థమైంది. పాకిస్తాన్ డ్రోన్లని, మిసైళ్లని.. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు.. పురుగుల్లా లేపేశాయ్. భారత్‌పై వందల డ్రోన్లతో విరుచుకుపడినా.. మిసైళ్లతో ఎన్నిసార్లు దాడులకు ప్రయత్నించినా.. దాయాది దేశం దారుణంగా దెబ్బతింది. మన ఆకాశ్, బ్రహ్మోస్ సహా ఎస్-400 సుదర్శన చక్ర బాగా పనిచేశాయ్. ముఖ్యంగా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరు.. ఇక్కడ హైలెట్‌గా నిలిచింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లని, మిసైళ్లని కనిపెట్టి.. గాల్లోనే కూల్చేసింది. దాంతో.. ఎస్-400 వ్యవస్థ ఎంత కచ్చితంగా పనిచేస్తుందనే విషయం ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. దాంతో.. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం.. చాలా దేశాలు రష్యాన్ని సంప్రదిస్తున్నాయ్. ఈ సంగతి పక్కనబెడితే.. ఎస్-400ని మించిన ఎయిర్ డిఫెన్స్ రెడీ అవుతోంది. అదే.. ఎస్-500.
భారత్ గగనతల రక్షణ వ్యవస్థకు కీలకంగా ఎస్-400
ఇండియా గగనతల రక్షణ వ్యవస్థకు.. ఎస్-400 సిస్టమ్ కీలకంగా మారింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు సహా అనేక గగనతల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు.. అంతకుమించిన కెపాసిటీ గల ఎస్-500 మిసైల్ విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు.. భారత్‌లో వీటిని కలిసి తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించింది. ఇప్పుడు.. వరల్డ్ వైడ్ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో.. ఎస్500 రక్షణ వ్యవస్థ.. ఎస్400 కంటే ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది? అది ఎలా పనిచేస్తుందన్న చర్చ కూడా మొదలైంది. ఎస్500 ప్రోమిథియస్.. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్. ఇది.. భూమి మీద నుంచి గాల్లోని మిసైళ్లను పక్కాగా కూల్చేస్తుంది.
యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని టార్గెట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
ఎస్400 ప్రధానంగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని టార్గెట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది.. బాలిస్టిక్ మిసైళ్లని కూడా 60 కిలోమీటర్ల దూరంలో అడ్డుకోగలదు. ఇక.. ఎస్500.. ఎస్400కి కంప్లీట్ వెర్షన్‌గా తయారుచేశారు. ఇది.. ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లతో పాటు హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, తక్కువ ఎత్తులో ఉన్న శాటిలైట్లు, స్పేస్ ఆయుధాలను కూడా టార్గెట్ చేయగలదు. ఇది.. బాలిస్టిక్, హైపర్‌సోనిక్ మిసైళ్లను కూల్చడంలో కీలకంగా ఉంది. ఎస్400 రేంజ్.. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చగలుగుతుంది. అదే.. ఎస్500.. 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా సులువుగా ఛేదిస్తుంది. బాలిస్టిక్ మిసళ్లైని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే పసిగడుతుంది. ఇది.. ఎస్400 కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించి కూల్చేయగలదు. ఎస్400.. 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న టార్గెట్లను ఎదుర్కోగలదు. ఎస్500 ఆల్టిట్యూడ్ రేంజ్ అంతకుమించి ఉంది. 180 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోనూ.. శత్రు దేశాల అస్త్రాలను అడ్డుకొని కూల్చేయగలదు.
ఎస్-500 యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్
ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెస్పాన్స్ టైమ్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎస్400 సిస్టమ్ టార్గెట్లని గుర్తించి.. 10 సెకన్లలోనే యాక్షన్ మొదలుపెడుంది. అదే.. ఎస్500 అయితే.. కేవలం 4 సెకన్లలోనే రెస్పాండ్ అవుతుంది. ఇది.. వేగవంతమైన టార్గెట్లను ఎదుర్కోవడంలో.. ఎంతో కీలకంగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మరింత శత్రుదుర్భేద్యంగా మారుస్తుంది. ఎస్400 సిస్టమ్‌లో ఉన్న మల్టీ ఫంక్షన్ రాడార్.. 36 టార్గెట్లని ఒకేసారి ట్రాక్ చేయగలదు. అదే.. ఎస్500 అయితే 80 నుంచి వంద టార్గెట్లను.. ఒకేసారి ట్రాక్ చేయగలదు. ఇందులో ఉన్న అడ్వాన్స్‌డ్ మల్టీ ఫంక్షన్ రాడార్.. స్టెల్త్ టెక్నాలజీ సహా తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ టార్గెట్లను గుర్తించడంలో మెరుగైన కెపాసిటీ కలిగి ఉంది. ఎస్400లో.. 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూల్చేందుకు మిసైళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అదే.. ఎస్500 అయితే.. హైపర్‌సోనిక్, బాలిస్టిక్ మిసైళ్ల లాంటి టార్గెట్లని అడ్డుకునేందుకు సరికొత్త యాంటీ బాలిస్టిక్ మిసైళ్లని ఉపయోగిస్తుంది.
ఎస్-500.. ఎస్-400 కంటే అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
ఎస్500 సిస్టమ్.. ఎస్400 కంటే ఎంతో అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది.. నేటితరం యుద్ధరంగాల్లో ఎదురయ్యే కొత్త రకం బెదిరింపుల్ని ఎదుర్కొనేందుకు, శత్రు దేశాల అస్త్రాలను చిత్తు చేసేందుకు తయారుచేసిన రక్షణ వ్యవస్థ. ఎస్500.. సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే.. హైపర్‌సోనిక్ మిసైళ్లని కూడా అడ్డుకుంటుంది. ఎస్400కి ఈ కెపాసిటీ లేదు. ఇక.. తక్కువ భూకక్ష్యలో ఉన్న శాటిలైట్లు, హైపర్ సోనిక్ విమానాల నుంచి ప్రయోగించే స్పేస్ ఆయుధాలను కూడా ఎస్500 టార్గెట్ చేయగలదు. ఎస్400తో పోలిస్తే.. ఎస్500లో మరింత అడ్వాన్స్‌డ్ రాడార్ సిస్టమ్ ఉంది. ఇది.. ఎఫ్-22, ఎఫ్-35, బీ-2 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్, హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్స్ లాంటి తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ టార్గెట్లని కూడా ట్రాక్ చేయగలదు. ప్రధానంగా.. ఎస్500 డిజైన్‌లో ఆటోమేషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది.. వేగంగా రెస్పాండ్ అవడంతో పాటు శత్రు టార్గెట్లను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఎస్500 ఒకేసారి 10 బాలిస్టిక్ హైపర్‌సోనిక్ టార్గెట్లను ఎదుర్కోగలదు.
భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. ఎప్పుడు యుద్ధం వస్తుందో కచ్చితంగా చెప్పలేం. పాక్ ఎప్పుడు దాడికి దిగుతుందో ఊహించలేం. అందువల్ల.. మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిందే. ఈ సమయంలో.. ఎస్ 400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలకంగా మారింది. అయితే.. ఇంతకుమించిన కెపాసిటీ గల ఎస్ 500 డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా అందించేందుకు రష్యా ఆఫర్ చేసింది. అది కూడా భారత్ అమ్ములపొదిలో చేరితే.. మన దేశం మరింత శత్రుదుర్భేద్యంగా మారుతుంది.
అంతరిక్షంలోని టార్గెట్లను ధ్వంసం చేయగల ఎస్-500
అవును.. ఎస్-500తో ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్‌గా తయారవుతుంది. దీనిని.. ఎస్-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఇది.. శత్రుదేశాల అస్త్రాలనే కాదు.. అంతరిక్షంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగలదు. భూమి పైనుంచి దూసుకొచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్లను నాశనం చేయగలికే కెపాసిటీ దీని సొంతం. ఫైటర్‌జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్‌సోనిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్‌ని సైతం కూల్చగలదు. దీని చుట్టూ 600 కిలోమీటర్ల పరిధిలో.. శత్రుదేశం యుద్ధవిమానాల నుంచి అత్యంత అధునాతన మిసైళ్ల దాకా.. ఏవీ కూడా దీని ధాటికి తట్టుకోలేవు. గంటకు దాదాపుగా 25 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే టార్గెట్లని కూడా ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది. ఎస్-500ను అల్మాజ్ ఆంటే అనే సంస్థ డిజైన్ చేసింది. 2021లో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టారు.
రష్యాతో 5 స్క్వాడ్రన్ల ఎస్-400ల కొనుగోలుకు ఒప్పందం
ఇప్పటికే.. ఇండియా దగ్గర ఎస్-400 సిస్టమ్ ఉంది. 2018లో రష్యాతో 5 స్క్వాడ్రన్ల ఎస్-400ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు భారత్‌కు చేరాయి. మరో 2 స్క్వాడ్రన్లు.. ఇంకొన్ని నెలల్లో భారత్ చేరుకోనున్నాయి. వీటికి ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ కూడా తోడైతే.. ఇక శత్రు దేశాలకు సీన్ సితారైపోతుంది. భారత్ వీటిని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు తీర ప్రాంతాలైన ముంబై, చెన్నై, వైజాగ్ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా.. వీటి మోహరింపు ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే.. రష్యా ఎస్-500ని భారత్‌తో కలిసి సంయుక్తంగా తయారుచేసే ప్రతిపాదనని తీసుకొచ్చింది. ఈ ఒప్పందం గనక కుదిరితే.. అత్యంత ఆధునిక గగనతల రక్షణ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాల సరసన భారత్ చేరుతుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన సొంతమవుతుంది. అప్పుడు.. చైనా, పాకిస్తాన్.. ఇండియా వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయ్.
పెరుగుతున్న హైపర్‌సోనిక్, స్పేస్ ఆధారిత బెదిరింపులు
భవిష్యత్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని.. ఎస్-500కి వ్యూహాత్మక ప్రాముఖ్యత నెలకొంది. నేటితరం యుద్ధాల్లో.. హైపర్‌సోనిక్, స్పేస్ ఆధారిత బెదిరింపులు పెరుగుతుననాయ్. ఎస్-500 ఈ కొత్త రకం బెదిరింపుల్ని ఎదుర్కొనేందుకు తయారుచేసిన వెపన్. ఇది.. దేశాల రక్షణ వ్యవస్థల్ని.. భవిష్యత్‌కు తగ్గట్లుగా సిద్ధం చేస్తుంది. ఎస్-500.. ఎస్-400ని మించిన డిఫెన్స్ సిస్టమ్. ఇది.. ఎక్కువ పరిధి, ఎత్తు, క్విక్ రెస్పాన్స్, ఎలాంటి టార్గెట్లనైనా ఛేదించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. దీనిలో ఉన్న రాడార్ టెక్నాలజీ.. ఆధునిక యుద్ధరంగంలో.. ఓ కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేస్తాయ్. అందువల్ల.. ఇండియా దీన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇప్పటికే ఆర్డర్ చేసిన ఎస్-400 స్క్వాడ్రన్‌లు పూర్తిగా సప్లై అయ్యాక కొంటారా? లేక.. ఇంకా సప్లై జరగని ఎస్-400 స్థానంలో.. ఎస్-500 తీసుకుంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
Also Read: కాళ్లబేరానికి వచ్చిన పాక్ బుద్ధి మారలే! మేమే గెలిచామంటూ ఈ ప్రసంగాలేందుకంటే?
ప్రధానంగా చైనా, పాకిస్తాన్ నుంచి మిసైల్ బెదిరింపులు
భారతదేశ రక్షణ వ్యవస్థకు.. ప్రధానంగా చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్ బెదిరింపులు సవాళ్లుగా ఉన్నాయ్. ఎస్ 500 ఈ బెదిరింపుల్ని సమర్థవంతంగా నిరోధించగల కెపాసిటీ ఉంది. ఇది.. ఇండియా రక్షణ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది. చైనా హైపర్ సోనిక్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్‌ని అడ్డుకునే టెక్నాలజీ భారత్ దగ్గర ఉండటం.. వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎస్ 400, స్వదేశీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లకు.. ఎస్-500 కూడా తోడైతే.. దేశానికి సమగ్రమైన రక్షణ కవచంలా మారుతుంది. అప్పుడు.. శత్రు దేశాలకు భారత్‌పై దాడి చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది.
ఇండియాపై మిసైల్స్, డ్రోన్లతో దాడి చేయడం దాదాపుగా అసాధ్యం
పైగా.. ఇండియాపై మిసైల్స్, డ్రోన్లతో దాడి చేయడం దాదాపుగా అసాధ్యమవుతుంది. వీటికి మించి.. ఎస్-500 యుద్ధాన్ని నిరోధించే ఆయుధంగానూ పనిచేస్తుంది. ఎస్-500 లాంటి అధునాతన వ్యవస్థ భారత్ దగ్గర ఉంటే.. దేశం వ్యూహాత్మక హోదా కూడా పెరుగుతుంది. అయితే.. ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధర ఎస్-400 కంటే ఎక్కువ ఉంది. ఒక్క దాని రేటు రెండున్నర బిలియన్ డాలర్లుగా ఉంటుందనే అంచనాలున్నాయ్. ఈ ఎస్-500 డిఫెన్స్ సిస్టమ్‌కి.. మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్, మరిన్ని స్వదేశీ రక్షణ వ్యవస్థలు తోడైతే.. ఇండియా ఎయిర్ స్పేస్ ఫుల్ సేఫ్. అప్పుడు.. పాకిస్థాన్ కాదు కదా.. వాడి తాతలు దిగొచ్చినా.. ఏమీ చేయలేరనే చర్చ సాగుతోంది.