Indian Railways: ఆ రూట్ లో తమ స్టేషన్ వద్ద ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగాలని ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఎట్టకేలకు వారి వినతిని దక్షిణ మధ్య రైల్వే పరిశీలించింది. ఆ స్టేషన్ల వద్ద ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టేషన్స్ వద్ద ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రైల్వే ప్రయాణికులు అంటున్నారు. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే ఎక్స్ ప్రెస్ లలో పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12605/12606), పాలరువి ఎక్స్‌ప్రెస్ (16791/16792) లు ముందుంటాయని చెప్పవచ్చు. పల్లవన్ ఎక్స్‌ప్రెస్ రైలు న్నై ఎగ్మోర్ (Chennai Egmore) నుండి రామేశ్వరం (Rameswaram) వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలను అనుసంధానిస్తూ నిత్యం పరుగులు తీస్తుంది. పల్లవుల కాలానికి గౌరవంగా ఈ రైలుకు ఈ పేరుపెట్టబడింది.
పాలరువి ఎక్స్‌ప్రెస్ (16791/16792) రైలు పాలక్కాడు (Palakkad Junction, కేరళ) నుండి తిరుచ్చిరాపల్లి (Tiruchirappalli, తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు పాలరువి జలపాతం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం గుర్తుగా పేరుపడింది. ఇది కేరళ, తమిళనాడు మధ్య ప్రయాణించే ముఖ్యమైన రైళ్లలో ఒకటి.
ఈ రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే, రైల్వే బోర్డు తాజా ఆమోదంతో రెండు ప్రధాన రైళ్లకు కొత్తగా స్టాప్‌లు కల్పించారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ మార్పులు ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని అధికారులు స్పష్టం చేశారు. పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటి నుంచి ఈ రైలు పెన్నాడం స్టేషన్ వద్ద 1 నిమిషం ఆగనుంది. పాలరువి ఎక్స్‌ప్రెస్ ఈ రైలు కల్లిడైకురిచి స్టేషన్ వద్ద 1 నిమిషం హాల్ట్ పొందనుంది.
Also Read: Google G Logo: లోగోను మార్చిన గూగుల్, కొత్త వెర్షన్ ఎలా ఉందంటే?
ఈ మార్పులు ప్రయోగాత్మకంగా అమలవుతున్నాయి. ప్రయాణికుల స్పందన, ప్రయోజనం వంటి అంశాల ఆధారంగా ఈ హాల్టులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక ప్రయాణికులకు ఇది నిజమైన వరం. ఇప్పటి వరకూ పక్క స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ నివాస ప్రాంతాలకే రైలు హాల్ట్ కల్పించడం వల్ల ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందన్న భావన కనిపిస్తోంది. అలాగే, ఈ మార్గాల్లో ప్రయాణించే వారు కొత్తగా కల్పించిన హాల్టుల వివరాలు తెలుసుకుని తమ ప్రయాణ ప్రణాళికను సులభంగా రూపొందించుకోవచ్చు.