BigTV English

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. సత్యంకు నిజం చెప్పని బాలు.. ఏం జరిగింది..?

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. సత్యంకు నిజం చెప్పని బాలు.. ఏం జరిగింది..?

Gundeninda GudiGantalu Today episode May 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా శివకిలా అయిందని బాధపడుతూ ఉంటుంది. బాలు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేదని సత్యం కూడా అడుగుతాడు. మీ సొంత బామ్మర్ది కి అలా సీరియస్ అయితే నువ్వు వెళ్లకుండా ఎలా ఉంటావు ట్రిప్పు ముఖ్యం కాదు ట్రిప్పు పక్కన పెట్టు ముందు వెళ్లి మీ బామ్మర్దిని చూసి పరామర్శించి మీ అత్తయ్యకు ధైర్యం చెప్పి ఆ తర్వాత నువ్వు ట్రిప్ పెట్టుకో అనేసి అంటాడు. ఇక బాలు ఏం మాట్లాడలేక సత్యం చెప్పినట్లు హాస్పిటల్ కి వెళ్తాడు. నిన్ను చూడటం నాకు ఇష్టం లేకపోయినా సరే మా నాన్న చెప్పాడని దగ్గరికి వచ్చాను. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది. ఆ గుణ గాడితో కలిసి నువ్వు ఇలాంటి దొంగతనాలు అవి ఇవి చేస్తే బాగోదు మీ అమ్మ చెల్లి నీ మీద ప్రాణాలను పెట్టుకున్నారు అది గుర్తుపెట్టుకో అనేసి బాలు వార్నింగ్ ఇస్తాడు. కానీ శివ మాత్రం బావ అని కూడా చూడకుండా అరుస్తాడు.. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


బాలు రాజేష్ దగ్గరికి వెళ్లి ఆ శివకి బెదిరించిన కూడా వీడియో చూపించిన కూడా భయపడకుండా నన్నే అంటున్నాడు వాడికి ఎంత ధైర్యం నన్ననే ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని బాధపడుతూ మందు తాగుతాడు. అటు పార్వతి తన కొడుకు ఏమీ కాకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఎక్స్రే రిపోర్టులను తెచ్చిస్తారు. ఏమైంది బాబు మరేం ప్రాబ్లం లేదు కదా అని పార్వతి అడుగుతుంది. అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అతని చెప్పి వెళ్ళిపోతాడు పార్వతి తన కొడుక్కి ఇలా అయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనాకు విషయం తెలిసి బాలును అడగడానికి వస్తుంది కానీ బాలు ఏం సమాధానం చెప్పడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా శివ చెప్పిన విషయాన్ని బట్టి బాలు ఎందుకు చేయి విరగగొట్టాడో తెలుసుకోవాలని కారు స్టాండ్ కి వస్తుంది. అక్కడ రాజేష్ ని ఏమైంది అన్నయ్య ఎందుకు ఏదో దాస్తున్నారు. వాడిని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఈయన ఎక్కడున్నారు నేను ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే అని మీనా అడుగుతుంది. మీనాకు రాజేష్ అసలు విషయం గురించి చెప్పాలని అనుకుంటాడు.


అప్పుడే బయటికి వచ్చిన బాలు ఆ విషయాన్ని చెప్పనివ్వకుండా రాజేష్ ని అడ్డుకుంటాడు. బాలుని వాడు చేయి ఎందుకు విరగొట్టారు.. మేమంటే మీకు అంత చులకన.. డబ్బులు లేవని మీరు అంతగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు వాడు ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఇది ఆలోచించరా అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు మాత్రం మీ నాకు అసలు నిజం చెప్పనివ్వకుండా తనలో తానే బాధపడతాడు..ఇన్నాళ్లు మా నాన్న లేని లోటును మా వాళ్లకు మీరు తీరుస్తారు అనే నమ్మకం నాకుంది ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నేను తప్పు చేశాను కదా నన్ను కొట్టి చంపేసేయండి అని మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది..

ఈ విషయాన్ని తన ఇంట్లో చెప్పాలని బాధపడుతూ వెళ్ళిపోయిన ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్తుంది. శివ చెయ్యి విరగొట్టాల్సినంత పని ఏం చేశాడు ఆయన ఇది క్రిమినల్ కేస్ అవుతుంది తెలుసా అని శృతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు కి ఇలాంటివి కొత్తవి కాదు కదా కారణం లేకుండానే ఇలాంటివి చేయగలడు అని అనుకుంటారు. అంతలోపే బాలు అక్కడికి వస్తారు.. నువ్వు శివ చెయ్యి ఎందుకు విరగొట్టావు? మీనా ఎంత బాధ పడుతుందో చూస్తున్నావా అని సత్యము అడుగుతాడు. వాడు తప్పు చేశాడు కాబట్టే పొరపాటున కొట్టాను అది కాస్త వాడికి చెయ్యికి తగిలింది ఇందులో నా తప్పేముంది అందరూ నన్ను వచ్చి అరుస్తున్నారు అని బాలు అంటాడు.

వాడు చేసిన పనికివన్ని ఎలా కొట్టాలో కూడా తెలియలేదు కానీ వదిలేసాను అని బాలు అనగానే ప్రభావతి తప్పు లేకుండా వాడు ఎప్పుడు ఏ పని చేయడు వాడు ఏదో తప్పు చేశాడు. అందుకే వీడు కొట్టాడు ఇందులో తప్పేముంది అని బాలుని వెనకేసుకొని వస్తుంది. కొట్టడానికి కారణం కావాలా నా చెయ్యి విరగట్లేదా అని మనోజ్ అంటాడు. అటు రవి శృతి కూడా బాలునే తప్పు అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా బాలు తప్పు చేశారనే రీతిలోనే మాట్లాడతారు. వాడు చేసిన తప్పు గురించి తెలిస్తే మీరందరూ ఎలా అంటారో నాకు తెలుసు కానీ నేను ఈ విషయాన్ని బయట పెట్టను అనేసి బాలు అంటాడు.

దానికి మీనా వదిలేయండి మామయ్య మా బతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే ఎలాగో మేము డబ్బులు లేనోళ్ళం కదా కొట్టిన భరించాలి. ఈరోజు నాతో ముందు కొట్టాడు. రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది అని బాధపడుతుంది. అయితే ఇక మీనా దగ్గరికి వచ్చి బాలు తప్పు చేసింది నేనైతే నన్ను అడగాలి గాని వాళ్ళందరిని అడుగుతావేంటి అని అంటాడు. దానిమీద మాత్రం బాలు తో మాట్లాడటానికి ఇష్ట పడదు.. చేతులు కాలిన కూడా బాలుని పట్టుకొనివ్వదు. ఇక ప్రభావతి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. బాలు మీనా గొడవ పడుతున్నారని కామాక్షితో చెప్పి సంతోష్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×