India-Pak Tension: భారత్, పాక్ మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విమానాలు బయల్దేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు తమ విమానాశ్రయాలకు చేరుకోవాలని సూచించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సహా పలు విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి. అటు విమానాశ్రయాల టెర్మినల్ బిల్డింగ్ లోకి సందర్శకులను నిషేధిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) వెల్లడించింది. మెరుగైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ ను తప్పనిసరి చేసింది. అంటే.. విమానం ఎక్కే ముందు ప్రయాణీకులను, వారి హ్యాండ్ బ్యాగేజీని తిరిగి తనిఖీ చేస్తారు. ఇది జనరల్ చెకింగ్స్ కు అదనంగా ఉంటుంది.
75 నిమిషాల ముందే చెక్ ఇన్ కంప్లీట్
ప్రయాణీకులు 3 గంటల ముందే విమానాయాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులకు సూచించింది. చెక్ ఇన్ అనేది ఫ్లైట్ బయల్దేరడానికి 75 నిమిషాల ముందే ముగుస్తుందని వెల్లడించింది. “విమానాశ్రయాలలో ఎలాంటి భద్రతా సమస్యలు ఏర్పడకుండా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం అంతటా ప్రయాణీకులు చెక్ ఇన్, బోర్డింగ్ సజావుగా ఉండేలా విమానాలు బయల్దేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాలని సూచించారు. చెక్ ఇన్ ఫ్లైట్ బయలుదేరడానికి 75 నిమిషాల ముందు ముగుస్తుంది” అని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో వెల్లడించింది.
In view of an order by the Bureau of Civil Aviation Security on enhanced measures at airports, passengers across India are advised to arrive at their respective airports at least three hours prior to scheduled departure to ensure smooth check-in and boarding.…
— Air India (@airindia) May 8, 2025
అటు “ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయబడ్డాయి. భద్రతా తనిఖీలకు అనుగుణంగా ప్రయాణీకులు తమ ప్రయాణానికి కొంత అదనపు సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకుని సహకరించాలని కోరుతున్నాం” అని ఇండిగో వెల్లడించింది. జమ్మూతో పాటు పశ్చిమ సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేక సైనిక స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత విమానయానశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులు ముందుగానే ఎయిర్ పోర్టుకు వచ్చేలా చూడాలని సూచించింది.
In these extraordinary times, heightened security measures are taken up across all airports. We request you to allow some extra time for your journey to accommodate security checks and formalities. We appreciate your understanding and cooperation.
— IndiGo (@IndiGo6E) May 8, 2025
Read Also: భారత రైళ్లపై పాక్ నిఘా, ఉద్యోగస్తులకు కేంద్రం హెచ్చరికలు!
గురువారం 430 విమానాలు రద్దు
ఇక గురవారం నాడు దేశీయ విమానయాన సంస్థలు దాదాపు 430 విమానాలను రద్దు చేశాయి. దేశంలోని మొత్తం విమానాలలో దాదాపు మూడు శాతం. మే 10 వరకు 27 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన తర్వాత బుధవారం నాడు 300కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 21 విమానాశ్రయాలలో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను టార్గెట్ చేసే అవకాశం ఉందనే సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకుంది భారత్. అందులో భాగంగానే పలు విమానాశ్రయాలను షట్ డౌన్ చేసింది.
Read Also: మే 10 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్, కేంద్రం కీలక నిర్ణయం!