E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 10th: సుమతి  ప్రేమించింది ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ణి అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిన బాలు అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు.. అయితే పార్వతికి ఈ విషయం చెప్పాలి అని అక్కడికి వెళ్లి సుమతి ఏం చేసిందో మీకు తెలుసా అత్తయ్య అనేసి అంటాడు బాలు కోపం చూసి ఏం చేసింది బాబు అని కంగారు పడిపోతుంది.  మీ అమ్మ ఈ ఒక అబ్బాయిని ప్రేమించింది తెలుసా అతను ఎవరో తెలుసా? ఏమీ తెలియకుండా ఎలా ఉన్నారు.. మీకు కొంచెం కూడా అనిపించలేదా మీ కూతురు ఎవరితోనో మాట్లాడుతుంది అని మీరేం భయపడకండి అత్తయ్య నేను ఒక మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాను అని బాలు పార్వతికి మాట ఇస్తాడు. ఇక సుమతి ఎందుకు ఇలా చేసింది అని కంగారు పడిపోతూ ఉంటాడు బాలు.

అయ్యో పాపం రోహిణి..

ఇకపోతే రోహిణి అత్తయ్యకి నేను గిఫ్ట్ ఇచ్చిన కూడా తను మాత్రం నన్ను ఇంకా క్షమించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆవిడ నామీద ప్రేమ లేనట్టే మాట్లాడుతుంది కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా మనోజ్ అని మనోజ్ పై సీరియస్ అవుతుంది కానీ మనోజ్ మాత్రం ఏమీ పట్టనట్లుగా ఉంటాడు రోహిణి మాత్రం ఎందుకు నన్ను శత్రువులాగా చూస్తుంది అని బాధ పడిపోతూ ఉంటుంది. అసలు నేను ఎంతగా ఆవిడని కూల్ చేయాలని చూసినా కూడా నేను చేసిన ఒక పొరపాటున పట్టుకొని నన్ను ఇది చేయాలని చూస్తుందా కొంచెం కూడా బుద్ధి లేదా అని రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది.. నువ్వు చేసిన ఒక్క పని అయినా కూడా అక్కడ అందరినీ బాధ పెట్టేలా చేశావు ముఖ్యంగా మా అమ్మ చాలా ఫీల్ అయింది అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్..

బాలుకు సపోర్ట్ చేసిన పార్వతి..

Advertisement

ఇక బాలు చెప్పిన తర్వాత పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది సుమతి ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదురా.. నా ఇంటి పరువు తీసేసింది అల్లుడు ముందు నాకు పరువు లేకుండా చేసింది అంటూ బాధ పడిపోతుంది పార్వతి.. సుమతి ఇన్నాళ్లు నేను అల్లరి ముద్దుగా పెంచుకున్నందుకు నాకు మంచి మర్యాద చేసింది ఇది ఎవరినో ప్రేమించడం ఏంట్రా నాకు గుండె తరుక్కుపోతుంది అంటూ బాధ పడిపోతుంది పార్వతి. బాధపడకు అమ్మ సుమతి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని శివ ఎంతగా చెప్పినా సరే పార్వతి మాత్రం తన కూతురు తన ఇంటి పరువు తీసేసింది అని చాలా బాధపడిపోతుంది..

సుమతి మాటతో షాక్..

సుమతి మీనా ఇద్దరు ఇంట్లోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఏంటి నువ్వు చేసిన పని అని సుమతి పై అరుస్తారు. ఇన్ని రోజులు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు ఏం పని చేశావు నీకు అర్థం అవుతుందా అని సుమతి పై పార్వతి సీరియస్ అవుతుంది. అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు ఊహించలేదు అల్లుడుగారు ఎంత బాధ పడ్డారో తెలుసా అని పార్వతి చాలా బాధపడిపోతుంది. ఏంటమ్మా నువ్వు ఏమి తెలుసుకోకుండా అంతగా సుమతిని అనేస్తావేంటి? అసలు నువ్వేం మానుకోవద్దు అని మీనా ఎంత చెప్తున్నా సరే పార్వతి మాత్రం అస్సలు మాట వినదు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అల్లుడుగారు ఏం చెప్తే అదే ఇక్కడ జరుగుతుంది అని తేల్చి చెప్పేస్తుంది. దానితో సుమతి కూడా షాక్ అవుతుంది..

పిచ్చోడిలా మారిన మనోజ్..

Advertisement

ఇక మనోజ్ షాప్ లో అన్ని చూసుకుంటూ ఉండగా మణికంఠ అక్కడికి వస్తాడు. ఏంటి బ్రో నువ్వు ఒక్కడివే ఉన్నావు మా సిస్టర్ రాలేదా అని అడుగుతాడు. రోహిణి పంపించడానికి అమ్మ ఒప్పుకోలేదు అని మణికంఠతో మనోజ్ చెప్పగానే నీ భార్యని నువ్వు తెచ్చుకోవడానికి మీ అమ్మ పర్మిషన్ ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ బ్రో ఈ రోజుల్లో ఆడవాళ్లు ఎలా ఉన్నారో తెలుసా అని మణికంఠ క్లాస్ పీకుతాడు.. అయితే ఎందుకు మీ ఆవిడ కోసం మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలి అని మణికంఠ చెప్పగానే మనోజ్ మా అమ్మ ఇష్టమైతేనే ఏదైనా చేస్తాను అని అంటాడు. ఇక మొత్తానికి తన ఫ్రెండ్ స్టోరీని చెప్తాడు మనికంట. ఈరోజుల్లో భార్యలను పట్టించుకోకుండా ఉంటే ఆ భార్యలు వేరే వాళ్ళని చూసుకుంటున్నారు లేదంటే భర్తలని చంపేస్తున్నారు అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ పిచ్చోడు ఎవరో కాదు నా ఫ్రెండు వాడి భార్యను మొదట్లో పట్టించుకోవడం మానేశాడు ఆ తర్వాత ఆవిడ వాడిని పట్టించుకోవడం మానేసి వేరే వాడితో వెళ్లిపోయింది అప్పటి నుంచి అలా పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు అని చెప్పగానే మనోజ్ భయపడిపోతాడు. అంతేకాదు మనోజ్ పిచ్చోడి లాగా మారిపోయినట్లు ఊహించుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మీద నుంచి నేను మా అమ్మ చెప్పినట్టు కాకుండా రోహిణి మీద ప్రేమతో ఉంటాను లేదంటే నేను పిచ్చోడైపోతే అస్సలు బాగోదు అని ఆలోచిస్తూ ఉంటాడు.

శృతి, రవి గొడవలు..

అయితే మనోజ్ రోహిణి వదిలేస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక రాత్రి రవి శృతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ శృతి అప్పుడే ఇంట్లోకి వస్తూనే చాలా కోపంగా రావడంతో ఏంటి నీ ఆవేశం ఏంటి అసలు అని రవి అంటాడు. నీకు విలువ లేని చోట నువ్వు పని చేస్తానని అన్నా కూడా నా భర్తకు విలువలేదు అని నేను చాలా ఫీల్ అయిపోయాను. నీకు ఆ మాత్రం కూడా లేదు అని శృతి రవి ఇద్దరు కాసేపు గొడవపడతారు. అయితే మధ్యలో వచ్చిన ప్రభావతికి రోహిణి మాటలు కోపాన్ని తెప్పిస్తాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×