E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  
Advertisement

Brahmamudi serial today Episode: రుద్రాణి, రాహుల్‌ ఫోటోలు తీసేసి ఆ స్థానంలో మా అమ్మా నాన్నల ఫోటోలు పెడతానని సుభాష్‌ చెప్తాడు. వాళ్లిద్దరూ ఈ ఫ్యామిలీ సర్వనాశనం చేయాలని చూసిన నరరూప రాక్షసుల అలాంటి రాక్షసుల ఫోటోలు పొద్దున్నే లేస్తే చూస్తూ ఉండాలా అంటూ ఫైర్‌ అవుతాడు. సుభాష్‌ మాటలకు రాజు సూపర్‌ తాతయ్య భలే మాట్లాడారు.. అక్కడి నుంచి తీసేస్తే కనీసం నువ్వన్నట్టు స్టోర్‌ రూంలోనైనా సేఫ్‌గా ఉంటాయి.. లేకుంటే డంపింగ్‌ యార్డుకు వెళ్తాయి అంటూ రాజు చెబితే..

రేఖ కోపంగా వేలు చూపిస్తూ ఒరేయ్‌ రాజు అంటుంది. ఏయ్‌ చెయ్యి దించు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు రాజు. ఎదురుగా ఉన్న రుద్రాణి, రాహుల్‌ ఫోటో తీసేసి ఇందిరాదేవి, పరంధామయ్యల ఫోటో పెట్టి ఇప్పుడు చెప్పండి ఈ ఫోటోను ఇక్కడి నుంచి తీసే దమ్ము ఎవరికైనా ఉందా..? అని అడుగుతాడు. అల్లుడు నువ్వు పెట్టాక ఆ ఫోటో తీసే దమ్ము ఎవరికి ఉంటుంది అల్లుడు అంటాడు శేషు. రేఖ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇందు వెంటనే వెళ్లి ఆ ఫోటోకు దండ తీసుకొద్దాం అని చెప్పగానే.. రాజు సరే అంటాడు.

Advertisement

తర్వాత సుభాష్‌ మెడిసిన్‌ తీసుకుంటుంటే.. రాజు వెళ్తాడు. రాజును చూసిన సుభాష్‌, ఆపర్ణ ఎమోషనల్‌ అవుతారు. ఇన్ని రోజులు ఆ రేఖ తమను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. మా తిండి మేము తినాలన్నా ఆంక్షలు.. మా నీళ్లు మేము తాగాలన్నా అంక్షలు పెట్టింది. కానీ ఈరోజు మా అమ్మానాన్నల ఫోటోలను అలా నువ్వు నిలబెట్టగానే.. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిందని ఫ్రౌడ్‌గా ఫీలవుతారు. ఇప్పుడు వాళ్లకు నిజమైన నివాళి అర్పించావు అంటారు. రాజు వాళ్లిద్దరిని ఓదారుస్తాడు.

మరోవైపు రూంలో భ్రమరాంబ, రేఖ, ఐశ్వర్య, బాధపడుతూ ఉంటారు. రేఖ కోపంగా చూస్తుంటే. రుద్రాణి, రాహుల్‌ ఫోటోలు తీసుకుని రూంలోకి వస్తారు భూషణ్‌, లక్కీ. ఆ ఫోటోలను చూసి రేఖ ఏడుస్తుంది. నన్ను క్షమించు అమ్మా నా ముందే నీ ఫోటోలు తీసి పక్కన పడేస్తున్నా చూస్తున్నాను తప్ప ఆడ్డుకోలేకపోయాను. మీకు జరిగిన అవమానాన్ని అపలేకపోయాను అంటూ ఏడుస్తుంది. ఇన్నాళ్ళు వాళ్లను చెప్పు చేతల్లో పెట్టుకున్న నువ్వు ఆ రాజును ఎందుకు ఆపలేకపోతున్నావు అంటీ అని ఐశ్వర్య అడుగుతుంది. నువ్వు ఫైర్‌బ్రాండ్‌ అని విన్నాను అమ్మ కానీ ఎందుకిలా సైలెంట్ అయిపోయావు అంటూ లక్కీ ప్రశ్నిస్తాడు. ఇలా తలో మాట అంటుంటారు. శేషు సెటైర్ల వేస్తే.. రేఖ వార్నింగ్‌ ఇస్తుంది. శేషును అన్నయ్య అని కూడా చూడనని చెప్తుంది. నెక్ట్స్‌ రాజును దెబ్బకొట్టేందుకు ప్లాన్‌ చేస్తుంది.

Advertisement

రాజు కోసం నందు, ఇందు కాఫీ, టీలు తీసుకెళ్తారు. ఇద్దరూ తీసుకెళ్లి తనది తాగమంటే తనది తాగమని అడుగుతుంటే.. తనదే ముందు తాగాలని.. ఇందు. తనదే ముందు తాగాలని నందు అంటే ఇద్దరిది తీసుకుని మిక్స్ చేసుకుని తాగేసి ఇలా తాగితే ఇక గొడవలు ఉండవు అంటాడు. తర్వాత ఇందు, నందు ఇద్దరూ కలిసి వెంకీ గురించి చెప్పి మన కంపనీలోనే వెంకీకి మంచి జాబ్‌ ఇద్దామని చెప్తారు. సరే చెప్పండి.. అంటూ రాజు అంటే అదేం లేదు నువ్వే వెళ్లి మీ నాన్నను ఒప్పించి వెంకీకి మన కంపెనీలో జాబ్‌ ఇవ్వాలి అని చెప్తారు. ముందు రాజు ఒప్పుకోకపోయినా నందు, ఇందు కన్వీన్స్‌ చేయడంతో రాజు ఓకే అంటాడు. చలపతి దగ్గరకు వెళ్లిన రాజు విషయం చెప్పగానే.. మీ జాబ్‌ ఏం అవసరం లేదని.. వాడు ఇక్కడే ఉండి మాతోనే ఏదో ఒకటి చేస్తాడు అంటూ రాజును ఇంట్లోంచి గెంటేస్తాడు.

మరోవైపు ఐశ్వర్య ఆఫీసుకు వెళ్లే సరికి పీఏ ఈ కంపనీ త్వరలో మూతపడబోతుంది నేను వేరే జాబ్‌ చూసుకుంటున్నానని చెప్తాడు. అంతా విన్న ఐశ్వర్య కోపంగా పార్వతీశాన్ని తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లి క్లాస్‌ పీకుతుంది. అందుకు పార్వతీశం నిజం చెప్తున్నాను మేడం అంటాడు. అప్పుడు జ్యూవలరీ ఎక్స్ ఫో గురించి తెలుసుకుని ఈ ఎక్స్‌ఫో లో పాల్గొందామని ఐశ్వర్య అంటే మీరు ఈ కంపెనీకి ఎలా ఎండీ అయ్యారు అంటూ పార్వతీశం మనం అందులో పాల్గొనలేమని చెప్తాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!

Big Stories

Advertisement
×