Karthika Deepam 2 serial today Episode: టిఫిన్ బండి దగ్గర శివనారాయణ కస్టమర్లకు సర్వ్ చేస్తుంటే.. పారిజాతం ఐటమ్స్ అన్ని ప్లేట్లలో పెట్టి ఇస్తుంది. అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడటం లేదని నిర్దారించుకున్న పారిజాతం గల్లాపెట్టలోని డబ్బులు నొక్కేస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి చూసి పారు చేతికి గట్టిగా పట్టుకుంటాడు. ఏంట్రా ఇలా పట్టుకున్నావు.. వదిలేయ్ అంటే నేను చెప్పేది అదే ఆ డబ్బులు వదిలేయ్ అంటాడు. నేను ఇవి దాయడానికే తీస్తున్నాను అంటుంది పారు.. దీన్ని తీయడం అనరు కొట్టేయడం అంటారు అని కార్తీక్ చెబుతుంటే.. శివనారాయణ వస్తాడు. ఏంట్రా అని అడిగితే.. పారు మాత్రం ఏవండి వీణ్ని ఇక్కడి నుంచి పంపించేయండి అంటుంది. కార్తీక్ మాత్రం పారు డబ్బులు కొట్టేస్తుందని చెప్తాడు. శివనారాయణ కోపంగా చూస్తూ.. చివరికి నువ్వు కూడానా పారు ఇంట్లో అందరూ మోసం చేస్తున్నారు అంటూ కార్తీక్‌ను చూస్తూ అంటే.. కార్తీక్ తన ఫోన్ తీసి చూసుకుని మీటింగ్ ఉందట నేను వెళ్తున్నాను అంటూ చెప్పి వెళ్లిపోతాడు.
ఇన్వెస్టర్లతో సూరజ్, దీప, మాలిని మీటింగ్‌లో ఉంటారు. అందరూ జ్యోత్స్న రాలేదేంటని చూస్తుంటారు. జ్యోత్స్నకు ప్రపోజ్ చేసిన ఇన్వెస్టర్ కూడా జ్యోత్స్న కోసం చూస్తుంటాడు. అందరూ వచ్చారని ప్రజంటేషన్ ఇవ్వమని సూరజ్‌కు చెబితే.. సూరజ్ తన ముందు ఉన్న ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఫైల్స్ చెల్లాచెదురుగా ఉంటాయి. జ్యోత్స్నను తిట్టుకుని కొన్ని ఫైల్స్ లేవని పీఏ దగ్గర ఉన్నాయని మీటింగ్ రేపు పెట్టుకుందామా అంటాడు సూరజ్. అందుకు ఆ ఇన్వెస్టర్ మాత్రం అదేంటి మా టైం వేస్ట్ చేస్తున్నారా..? లేక మీ పీఏ యాటిట్యూడ్ చూపిస్తుందా..? ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాం అంటూ బెదిరిస్తాడు. సూరజ్ ఎంతో బతిమాలి అతన్ని ఒప్పిస్తాడు.. అతను కూడా ఇవాళ ఒక్కరోజు జ్యోత్స్నకు చాన్స్ ఇద్దాం.. రేపు నా కోసం ఎదురుచూస్తుంది అని మనసులో అనుకుంటూ..రేపు కచ్చితంగా ప్రజంటేషన్ ఉండాలని లేకపోతే మేము కాదు ఇక జీవితంలో మీకు ఎవ్వరూ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా చేస్తామని బెదిరించి వెళ్లిపోతాడు.
వాళ్లందరూ వెళ్లిపోయాక సూరజ్ కోపంగా జ్యోత్స్నను తిడుతూ.. అసలు ఎక్కడికి వెళ్లింది అంటూ అరుస్తాడు. కార్తీక్, సూరజ్‌ను కూల్‌గా ఉండమని ఒకమనిషి సడెన్‌గా కనిపించకుండా పోయిందంటే ఏదో జరిగి ఉంటుంది కదా అంటాడు. ఏదైనా ఉంటే మనతో చెప్పాలి కదా అంటాడు సూరజ్. మాలిని కూడా మీరందరూ ఏం చేయడానికి వచ్చారో అదే చేస్తున్నారురా చేయండి అది చూస్తాను అంటూ మాలిని వెళ్లిపోతుంది. అసలు జ్యోత్స్న ఏమైంది. చూద్దాం పద అంటూ కార్తీక్, దీపను తీసుకుని వెళ్లిపోతాడు.
ఆఫీసులో అందరినీ తిడుతూ సూరజ్ ఫైల్స్ అన్ని విసిరికొడుతుంటాడు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. పేపర్స్ లేవు మనిసి లేదు అసలు ఏమైపోయింది ఈ మనిషి అంటూ కోప్పడుతూ కూర్చుంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. దీప దగ్గరకు వెళ్లబోతుంటే.. కార్తీక్ ఆపుతాడు. సూరజ్ కోపంగా ఎక్కడికి వెళ్లావు అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు ఇలాంటి తెలివి లేని పని ఏదైనా చేస్తావనే నేను ముందే చెప్పాను అంటాడు. ఫైల్ మీ టేబుల్ మీద పెట్టాను సార్ అంటుంది. సూరజ్ కోపంగా జ్యోత్స్నను తిడుతూ ఆ ఇన్వెస్టర్ సంతకం పెట్టను అన్నాడు. మీటింగ్ ఫోస్ట్ ఫోన్ అయింది. అంటూ జ్యోత్సను రిజైన్ చేసి వెళ్లిపోమ్మని చెప్తాడు.
సూరజ్ కోపంగా తిడుతుంటే.. జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. మాలిని వచ్చి ముందు ఎక్కడికి వెళ్లిందో అడగరా అంటే.. ఎక్కడికి వెళ్లావు చెప్పు.. కళ్లెందుకు ఎర్రగా ఉన్నాయి అంటూ సూరజ్ అడిగితే.. దీప, కార్తీక్ కూడా ఎందుకు కళ్లు ఎర్రగా అయ్యాయి ఏడ్చావా..? చెప్పు జ్యోత్స్న అని అడిగితే.. జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. మాలిని కోపంగా కావాలని ఆడుతున్న నాటకాలురా ఇవన్నీ అంటుంది. అప్పుడే దీప నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు అత్తా.. అంటూ ఏమైందని జ్యోత్స్నను అడుగుతుంది. జ్యోత్స్న క్షమించమని తన వల్ల తప్పు జరిగిందని చెప్తుంది. ఏం జరిగిందో చెప్పమంటే మాత్రం జ్యోత్స్న చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.