Intinti Ramayanam Today Episode November 10th : అతనిని అలాగే అత్తయ్యని చంపేస్తే నా గురించి తెలిసిన నిజాలు ఎవరికీ తెలియవు కదా అని అనుకుంటుంది పల్లవి. అయితే స్వామివారి పానకంలో విషయం కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చి చంపేయాలని అనుకుంటుంది. కానీ కమల్ వచ్చి ఈ మధ్యలో ఆ పానకంను విసిరి కొట్టేస్తాడు దాంతో పల్లవి ఫ్యాను దారుణంగా ఫెయిల్ అయిపోతుంది నువ్వు నాటకాలు ఆడుతూ ఇలా చేయడం వల్ల నీకు ఏమీ రాదు అని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఈ తింగరోడు ఒక్క నిమిషం లేట్ వచ్చినా నా ప్లాన్ సక్సెస్ అయ్యేది అని కమల్ గురించి పల్లవి అనుకుంటూ ఉంటుంది.అయితే అమ్మవారి ప్రసాదం నేలపాలు చేశాడు అని కమల్ని అందరూ అరుస్తారు. అమ్మవారికి దండం పెట్టుకుంటాను అని కమల్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు రమ్య ఇంట్లోకి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ పల్లవి మాత్రం షాక్ అవుతుంది.
రమ్య ఇంట్లోకి రావడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా తనని లోపలికి తీసుకొని వస్తారు. దాంతో ఎవరు ఈవిడ ఇంత విఐపి లాగా చూసుకుంటున్నారే అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కొత్త క్యారెక్టర్ పైన నాకు ఏదో అనుమానంగా ఉంది ఎవరు ఈవిడ కనుక్కోమని భానుమతిని పంపిస్తుంది. భానుమతి కూడా ఆ రమ్య ఎవరు అంతగా తనని పొగిడేస్తున్నారే అంతగా అభిమానిస్తున్నారు. అందరూ కలిసి తనని చూసుకుంటున్నారు కదా.. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయి కమల్ తో కూడా చాలా సరదాగా మాట్లాడుతుందని అనుమానంగా చూస్తూ ఉండిపోతారు. ఇక పల్లవి ఎలాగైనా సరే ఈ రమ్యని కమల్ కి దూరం చేయాలి అని అనుకుంటుంది.
అవని ఇంట పండుగ వాతావరణం సందడిగా మారుతుంది అందరూ కలిసి పండుగని ఎంతో ఘనంగా చేసుకోవడంతో పాటుగా అటు డాన్సులు వేస్తూ సరదాగా ఉంటారు. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎపిసోడ్ మొత్తం వాళ్ల సరదాలతోనే హైలెట్గా నిలుస్తుంది. అందరూ దాండియా ఆడుతూ చాలా సంతోషంగా ఉంటారు. పల్లవి మాత్రం నేను ఒక దాన్ని ఉన్నాను అన్న సంగతి ఎవరు పట్టించుకోవడం లేదు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని పల్లవి చాలా బాధపడిపోతూ ఉంటుంది..
ఇకపోతే రమ్య ఒక సైడ్ నిల్చుని చూస్తూ ఉంటుంది. అయితే అందరూ కూడా అమ్మవారికి పూజలు చేసిన తర్వాత భజన చేస్తూ పాటలకే డాన్సులు వేస్తూ ఉంటారు అప్పుడే రమ్యను కూడా డాన్స్ వేయమని చెప్పగానే తను కూడా చాలా సందడిగా వెళుతూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కమల్ తో కలిసి రమ్య డాన్స్ చేస్తూ ఉండగా కమల్ కి తగులుతుంది దాంతో రమ్య తనని ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ అడుగుతుంది అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోవడంతో పాటుగా రమ్య దగ్గరకు వచ్చి రమ్య చెంపలు వాయించేస్తుంది. అది చూసే నా ఫ్రెండ్ ఎందుకు నువ్వు నా ఫ్రెండ్ ని కొట్టావు అని అడుగుతాడు. పల్లవి ప్రవర్తన చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
పల్లవి అలా రమ్యను కొట్టగానే అవని ఇంటికి వచ్చిన గెజిటనే నువ్వు కొడతావా నీకు ఎంత ధైర్యం అని అరుస్తుంది. అంతే కాదు పల్లవిని కొడుతుంది కూడా.. నువ్వు నా ఇంటికొచ్చిన నా ఫ్రెండ్ నే కొడతావని కమల్ కూడా పల్లవిని కొట్టబోతాడు. ఇక అందరూ కూడా ఇంట్లోని వాళ్ళందరూ పల్లవిని అరుస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అతను ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన పొరపాటు అని అందరూ చాలా ఫీల్ అవుతారు. అయితే పల్లవి మీ అంత చూస్తాను మీరు ఇంత సంతోషంగా ఉంటారు నేను అసలు అనుకోలేదు అని ఇక అంటుంది ఆ మాటతో భరత్ కూడా రెచ్చిపోతాడు ఇక అందరూ కూడా కొట్టుకునే వారికి వెళ్తారు మొత్తానికి పల్లవి వెళ్లిపోగానే రమ్య ఫీల్ అయిపోయిందని చాలా బాధపడిపోతారు.
పల్లవి పై చక్రధర్ సీరియస్ అవుతాడు మీరు ఎందుకు తీసుకొని వెళ్లారు. ఇలాంటివేదో చేస్తారనే మేము మీతో రాలేదు.. మీరు అక్కడికి వెళ్లి ఇంత పెద్ద ఘనకార్యం చేస్తారని మేము అసలు ఊహించలేదు చూసావా నీ బుద్ధి మార్చుకోలేదు అని అందరూ కూడా పల్లవిని తిడతారు. నా తప్పేమీ లేదు కేవలం మీ ముద్దుల కూతురే ఇదంతా చేసింది అది ఎవరితో మేకప్ వేసుకునే దాన్ని తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకుంది అని పల్లవి పై సీరియస్ అవుతారు మొత్తానికి పల్లవికి మాత్రం చివాట్లు తప్పలేదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. అసలేం జరిగింది..?