Nindu Noorella Saavasam Serial Today Episode: ఛంభాను తీసుకుని మనోహరి నేరుగా ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్తుంది. వెనకాలే ఫాలో అవుతూ వస్తున్న అమర్, రాథోడ్ కూడా ఆశ్చర్యంగా పోలీస్ స్టేషన్ బోర్డు చూసి షాక్ అవుతారు. మనోహరికి ఇక్కడేం పని అని అమర్ అడిగితే.. ఏమో సార్ అంటాడు రాథోడ్. సార్ ఒక్క ఫోన్ మాట్లాడి వస్తాను అంటూ కారులోంచి దిగి పక్కకు వెళ్లి మిస్సమ్మకు కాల్ చేస్తాడు రాథోడ్.
మనోమరి, యాదమ్మ కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూంకు వెళ్లారని కచ్చితంగా మనోహరికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిందని అది రణవీర్ ది అయ్యుండొచ్చు లేదా పార్థుది అయ్యుండొచ్చు అని రాథోడ్ చెప్పగానే.. వెంటనే అదేంటో తెలసుకోవాలి రాథోడ్.. అంటూ మిస్సమ్మ చెబితే.. సరే మిస్సమ్మ నేను తెలుసుకుని నీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి అమర్ దగ్గరకు వెళ్లి సార్ మనం లోపలికి వెళ్దామా అంటే.. వద్దని అది మనోహరి పర్సనల్ ఇష్యూ అయ్యుండొచ్చు అంటాడు అమర్. అబ్బా సార్ మీ ఎథికల్ వ్యాల్యూస్ వల్లే ఆ మనోహరి ప్రతిసారి తప్పించుకుంటుంది అని మనసులో అనుకుంటాడు.
లోపలికి వెళ్లిన మనోహరి ఎస్సైని కలిసి తన గోల్డ్ చైన్ పోయిందని ఒకసారి సీసీటీవీ ఫుటీజీ చూడాలని అడుగుతుంది. అందుకు అక్కడి ఎస్సై అలా చూపించడం కుదరదు.. వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వండి అంతా వాళ్లు చూసుకుంటారు అని ఎస్సై చెప్తాడు. మనోహరి వినకుండా అంతదూరం ఎందుకు సార్ మీరు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తే మేమే ఎంక్వైరీ చేసుకుంటామని చెప్తుంది. ఎస్సై కోపంగా ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు. మనోహరి మెల్లగా మీకు కావాలిస్తే డబ్బులు ఇస్తాను అంటూ చెప్పగానే.. ఎస్సై మరింత కోపంగా ఏంటి మీరు నాకు లంచం ఇస్తారా..? నేను మీకెలా కనిపిస్తున్నాను. చూడండి నాకు లంచం ఇవ్వజూపినందుకు ఇప్పుడే మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను అంటూ బెదిరించగానే..
యాదమ్మ భయంగా మనోహరి వెళ్దాం పద అంటుంది. మనోహరి మాత్రం మీకు ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర గారు తెలుసా..? అని అడుగుతుంది. తెలుసని ఆయన సిటీలో కూడా చాలా ఆపరేషన్స్ చేశారని ఎస్సై చెప్పగానే.. మేము ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆయన ఇంట్లోనే ఉంటాము అని మనోహరి చెప్పగానే.. అవునా మేడం.. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటూ మనోహరి, యాదమ్మలను తీసుకుని సీసీటీవీ మానిటరింగ్ రూంలోకి వెళ్తాడు. అక్కడ ఏ ఏరియా సీసీటీవీ ఫుటేజీ కావాలో చెప్పండి అని ఎస్సై అడగ్గానే.. జూబ్లీహిల్స్ మార్కట్ రోడ్డులో ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య అని యాదమ్మ చెప్తుంది.
అక్కడి కానిస్టేబుల్ యాదమ్మ చెప్పిన టైంలో సీసీటీవీ ఫుటేజీ చూపిస్తుంటాడు. ఆ వీడియో పార్థు కనిపిస్తాడు. అది చూసి మనోహరి షాక్‌లో అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. అక్కడ గోల్డ్ నెక్లెస్ ఎక్కడ ఉంది మేడం అని ఎస్సై అడిగితే.. మేము అక్కడకు వెళ్లి ఎంక్వైరీ చేసుకుంటాము సార్ పద మనోహరి అంటూ మనోహరిని తీసుకుని బయటకు వెళ్తుంది యాదమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.