E-Paper
Advertisement

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Advertisement

Constable Suicide: రూపాయి అవసరమొస్తే ఆన్‌లైన్‌లో లోను క్షణాల్లో ఇస్తామంటూ వచ్చే యాప్‌లు ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. పోలీసు ఉద్యోగంలో ఉండి ఇతరులకు రక్షణగా నిలవాల్సిన ఒక కానిస్టేబుల్, ఈ డిజిటల్ రాబందుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు వదిలిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

40 వేల అప్పుతో మొదలైన నరకం

Advertisement

గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రీను నాలుగు నెలల క్రితం అత్యవసర అవసరాల నిమిత్తం ఓ ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో అప్పు సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్‌ నిర్వాహకుల అసలు స్వరూపం బయటపడింది. రోజు రోజుకూ వారి వేధింపులు మితిమీరిపోయాయి.

నగ్న చిత్రాలతో దారుణమైన బెదిరింపులు

Advertisement

చెల్లించాల్సిన డబ్బుల కోసం రాత్రీ పగలూ అని తేడా లేకుండా గంటకోసారి ఫోన్ చేస్తూ మానసికంగా నరకం చూపించారు. అంతటితో ఆగకుండా, శ్రీనుతో పాటు ఆయన భార్యకు సంబంధించిన చిత్రాలను నగ్నంగా మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు పంపిస్తామంటూ దారుణమైన బెదిరింపులకు దిగారు.

తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య

సమాజంలో గౌరవంగా బతికే వ్యక్తికి ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ ఎదురవ్వడంతో శ్రీను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వేధింపుల భారాన్ని తట్టుకోలేక చివరికి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

Tags

Related News

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచింది నేనే: దయాకర్ రావు!

చెరుకు రైతులకు తీపి కబురు అందేనా.. టన్నుకు రూ.4 వేల ధర!

Big Stories

Advertisement
×