Gundeninda GudiGantalu Today episode November 19th: ప్రభావతి మనోజ్ మాటలు విని ఏంట్రా ఈ ఇండ్లు నీకు పాతది లాగా కనిపిస్తుందా? ఇంతమంది సంసారాన్ని గుర్తుగా చూసుకుంటున్న ఈ ఇంటిని పోతే పోనీలే అని నువ్వు అంటావా? కొంచమైనా బుద్ధుందా నీ వల్లే కదా ఈ ఇల్లు పోయే పరిస్థితి వచ్చింది అంటూ మనోజ్ పై రెచ్చిపోతుంది. అయితే మనోజ్ మాటతో ప్రభావతి చాలా సీరియస్ అవ్వడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కాబట్టి మొత్తం వడ్డీ డబ్బులు నువ్వే కట్టాలి అని ప్రభావతి అంటుంది. నీవల్ల ఇంట్లో నేను తలెత్తుకో లేకుండా పోయాను. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు నిన్ను నేను పెంచి తప్పు చేశాను అంటూ ప్రభావతి ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి మనోజ్ ని తిడతారు.
బాలు తన దగ్గర 50,000 లేవు ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మీనా తన దగ్గర 40 వేలు ఉన్నాయి తీసుకోండి అని ఎంత చెప్పినా సరే బాలు మాత్రం నీ డబ్బులు నాకు అసలు అవసరమే లేదు అని అంటాడు.. ఎందుకు నా డబ్బులు మీ డబ్బులు అని వేరు చేస్తున్నారు ఏమైంది అని అనగానే సుమతి విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చారు కదా నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకోను అని బాలు అంటాడు కానీ మీనా ఎంత చెప్పినా సరే బాలు మాత్రం డబ్బులు తీసుకోకపోవడంతో మీనా చాలా బాధపడిపోతుంది ఎలాగైనా సరే ఈ డబ్బులు మీరు తీసుకునేలా చేస్తాను అని అనుకుంటుంది. ఇక బాలు మాత్రం తనకి కావలసిన 50 వేల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటు శృతి రవికి సాయం చేసి మంచి భార్యగా పేరు తెచ్చుకుంటుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇంటి కోసం ఎమోషనల్ బాండింగ్ గురించి చక్కగా చెప్తుంది..
అందరూ పైన కూర్చుని బీరు బాటిల్స్ ముందు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అందరూ చూసేదానికి కచ్చితంగా మందు కొట్టారని అనుకుంటారు.. ముగ్గురు ఆడవాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ చేతిలో బీరు బాటిల్ పట్టుకొని ఉండడం చూసిన మగాళ్లు ఏంట్రా వీళ్ళు ఇక్కడ మందు కొడుతున్నారా ఏంటి అని అనుకుంటారు. వాళ్లంతా పైకి రాగానే మగాళ్ళందరూ మందు కొడతారు మీరేంటి ఇక్కడ ఆడవాళ్లు కూడా ముందు కొడుతున్నారు అని అంటారు. ఆ మాటతో మీరు కొడితే తప్పులేదు. మేము కొడితే తప్ప మేము కూడా కొత్తగా ట్రై చేసాము చాలా బాగుంది ఇప్పుడు ఒక బీరు కొట్టాము ఇంకొక బీరు కూడా కొట్టాలి అని అనుకున్నాము అందుకే కొడుతున్నాము మీరు వెళ్లి ఫస్ట్ నాకు ఒక చికెను అలాగే గుడ్డు కూడా తీసుకుని రావాలి అని చెప్తారు..
మేము మందు కొడితే ఎలా ఉంటుందా అని ప్రాక్టీస్ చేశాము అంతే తప్ప మేము మందు కొట్టలేదు అని మీనా నిజం చెప్పేస్తుంది. అయితే మీనా మీరు రోజు ముందు కొట్టి ఆ డ్రమ్ము నిండా బాటిల్స్ ఉండడం చూసి మేము కూడా బాటిల్స్ తీసుకొని ఇలా చేశాము.. మీరు పైకొచ్చే రోజు ఇదే చేస్తున్నారా అని వాళ్ళందరూ అంటూనే ఈరోజు మేము వంటగదికి సెలవిస్తున్నాము మీరే వంట చేసుకుని రావాలి అని అంటారు.. అయితే అందరూ మగాళ్లు వంటగదిలో కూర్చుని వంట చేసేందుకు వెళ్తారు. ఇక ఆడాలందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు..
ఆడవాళ్ళందరూ కూడా అయినా కూర్చుని నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుని ఉండడని చూసిన ప్రభావతి ఏంటి వీళ్లంతా ఏదో చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటారు. మీరేంటి అందరూ ఎక్కడున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు కొంపతీసి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని ప్రభావతి అనుమానంతో ఎలాగైనా సరే వెళ్లాలని అనుకుంటుంది. అయితే ప్రభావతి వెళ్లి ఏంటి మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అని అడగగానే మందు కొడుతున్నామని శృతి సమాధానం చెబుతుంది ఏంటి? మీరు కూడా ముందు కొడుతున్నారా అని ప్రభావతి కంగారు పడిపోతూ అడుగుతుంది లేదు.. అత్తయ్య డ్యూయల్ ఊరికే ఆటపాటిస్తున్నారు మీ అబ్బాయిలు తాగిన బాటిల్స్ ఇక్కడ పెట్టారు అని అనగానే సరే సరే కానివ్వండి అంటూ ప్రభావతి కిందకి వెళ్తుంది..
ఇక మగవాళ్ళందరూ కూడా వంటగదిలోకి వెళ్లి ఆడవాళ్లు సరదాగా మాట్లాడుకుంటున్నారు కదా మనం కాఫీ పెట్టుకుని తాగుదామని అనుకుంటారు ఇక రవి కాఫీ పెట్టి అందరికీ ఇవ్వాలని అనుకుంటాడు.. అయితే అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు ఈ నెల వడ్డీ గురించి మాట్లాడుకుంటారు భార్యల దగ్గర తీసుకోవడం తప్ప ఏమీ లేదు. భార్యల దగ్గర డబ్బులు తీసుకుంటే చులకన ఎందుకు అవుతాము తప్ప ఏమీ లేదు కదా అని మనోజ్ అంటాడు ఇక రవి కూడా శృతి దగ్గర తీసుకున్నాడు అని తెలుసుకుని తప్పులేదు కదా అని అంటాడు. అందరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉండడం చూసిన ప్రభావతి మీరేంటి వంట గదిలో ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రోహిణి మనోజ్ ని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..