Big TV Folk Night:జానపదాలంటే ఒకప్పుడు మారుమూల గ్రామాలకే పరిమితం కాని ఇపుడు ట్రెండ్ మారింది.సోషల్ మీడియా జమానాలో పల్లెపాటలు పట్టాభిషేకం చేసుకుంటున్నాయి.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోక్ సాంగ్స్ కి ఎలాంటి ఆదరణ ఉందో అవి కొల్లగొడుతున్న మిలియన్ల వ్యూస్ ని చూస్తేనే అర్థం అవుతుంది.
ఇక పాటలకు మాత్రమే కాదు వాటిని పాడుతున్న సింగర్స్ కూడా సాలిడ్ ఫ్యాన్స్ బేస్ ని సొంతం చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ఫోక్ మ్యూజిక్ అభిమానులను అలరించేందుకు బిగ్ టీవీ ఫోక్ మ్యూజికల్ నైట్ ఎంతో ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయిపొయింది.గత ఏడాది కూడా బిగ్ టీవీ ఫోక్ మ్యూజికల్ నైట్ ఘనంగా నిర్వహించిన సంగతి తెల్సిందే.
హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ వేదికగా
ఇక ఫోక్ నైట్ ఈ డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ వేదికగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే బుక్‌మైషోలో అందుబాటులో ఉన్నాయి కూడా. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్‌ను ఇష్టపడేవారికి, తమ అభిమాన గాయకులను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారికి ఈ కార్యక్రమం మంచి అవకాశం కానుందనడంలో సందేహం లేదు
టికెట్ ధరలు ఎంతంటే?
ఇక ఈ ఫోక్ నైట్ కార్యక్రమానికి సంబంధించి మూడు రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి . జనరల్ పాస్ ధర రూ.500గా నిర్ణయించగా.. ఎర్లీ బర్డ్ వీఐపీ టికెట్ ధర రూ.1,000గా ఉంది. ఇక ఫ్యాన్‌పిట్ టికెట్ ధర రూ.3,000గా నిర్ణయించారు. ఒక్కొక్కరు గరిష్టంగా 10 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండటం ఒక విశేషం అయితే ఈ కాన్సర్ట్ లో 20కి పైగా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం..
ఒకే వేదికపై ప్రముఖ సింగర్స్ సందడి!
ఇక ఈ బిగ్ టీవీ ఫోక్ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ లో ఫోక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, సింగర్ మంగ్లీ, ఫోక్ డాన్సర్ గా గుర్తింపు పొందిన నాగ దుర్గ, వందేమాతరం శ్రీనివాస్, రాము రాథోడ్ వంటి తదితరులు పాల్గొనబోతుండగాఈ వేడుకకు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించబోతుండటం విశేషం.గతంలో ఎంతోమంది సినిమాలలో పాటల కోసం మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించగా తొలిసారి బిగ్ టీవీ జానపద పాటలను ప్రోత్సహిస్తూ ఇలా ఫోక్ మ్యూజికల్ నైట్ కన్సర్ట్ నిర్వహించడం మెచ్చుకోతగ్గ విషయం.
ఫోక్ పాటల క్రేజ్‌కు తగ్గట్టుగా ఈవెంట్!
ప్రస్తుతం తెలంగాణ జానపద పాటలు నెట్టింట ఎలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మంగ్లీ, నాగదుర్గ, రాము రాథోడ్ వంటి సింగర్స్ పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ ఉంది.ఇలాంటి సమయంలో ప్రముఖ ఫోక్ సింగర్స్ అందరినీ ఒకే వేదికపై చూసే అవకాశం రావడంతో ఈ ఈవెంట్‌పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.మొత్తానికి డిసెంబర్ 12న హైదరాబాద్‌లో జరగనున్న బిగ్ టీవీ ఫోక్ నైట్ ఫోక్ మ్యూజిక్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది అనడంలో సందేహం లేదు !
https://in.bookmyshow.com/events/big-tv-folk-night/et4g058p3m