Intinti Ramayanam Today Episode November 19th : చూసావా బావా నేనంటే నీకు ఇష్టం ఉంది కాబట్టే నేను అర్చన చేస్తే నువ్వు చేయించుకున్నావు అని కమల్ తో పల్లవి అంటుంది. అయితే ఆ మాట విన్న తర్వాత కమ్మలు చాలా సీరియస్ అవుతాడు. నేను నీ మీద ప్రేమతో చేయించుకోలేదు దేవుడికి ఇలాంటివి నచ్చవు దేవుడు కాబట్టే అర్చన చేయించుకున్నాను అని చెప్పగానే.. పల్లవి కాస్త షాక్ అయినా కూడా నాకు మాట విన్నాడు అని సంతోషపడుతుంది. ఇక అదేంటి బావా వెళ్ళిపోతున్నావు ప్రసాదం తీసుకోకుండా అని పల్లవి అంటుంది. ఇక పల్లవి ప్రసాదంను ఇస్తూ ఉండగా వాళ్ళని చూసిన రమ్య పిలుస్తుంది అయితే అక్కడ ఏదో జరుగుతుంది అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు.
రమ్య ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఏమైంది అని అవని వాళ్ళందరూ కంగారుపడుతూ అడుగుతారు. మా అన్నయ్య నాకు బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు అండి అని రమ్య చెప్పగానే వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పు అని నీకు తెలియదా అని ఎంత చెప్తున్నా సరే వాళ్ళ అన్నయ్య మాత్రం నా చెల్లెలు నా ఇష్టం అడగడానికి మీరు ఎవరు అంటూ మాట్లాడడంతో ఇక అవని అలాగే శ్రీకర్ కమల్ ఆ పెళ్లి కొడుకుని వాళ్ళ అన్నయ్యకి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తారు పోలీసులకు పిలిపిస్తామని అంటారు. ఇక వాళ్ళు భయపడి ఎక్కడి నుంచి వెళ్లిపోతారు. మొత్తానికి రమ్య సేఫ్ గా ఉంటుంది.
కమల్ చేసిన మంచి పనికి అవని సపోర్ట్ ఉండటంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కమల్ నిజంగానే చాలా మంచి పని చేస్తాడు ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాడు అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు.. ఒకవేళ రమ్యకి ఏదైనా చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అని కమల్ రమ్య వాళ్ళ అన్నయ్యకి మార్నింగ్ ఇచ్చి మరి పంపిస్తాడు.. వాళ్ళు ఎవరో కష్టాల్లో ఉన్నారని నువ్వు ఎందుకు బావ ఇలా చేస్తున్నావు కొంచమైనా నీకు బుద్ధి లేదా అంటూ పల్లవి అంటుంది.. ఆమె ఎవరో కష్టాల్లో ఉంది అంటే నువ్వు ఎందుకు చొరవ తీసుకున్నావు అని పల్లవి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కానీ.. అవును ఇప్పుడు నేను ఎవరితో ఉంటే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు అని కమల్ పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఇక అవని కూడా పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
ఇది ఇంటికి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేయాలని అనుకుంటారు అయితే కమల్ పుట్టినరోజు నాడు మనమందరం చాలా సంతోషంగా ఉండాలని గుడికి వెళ్ళాము. కానీ అక్కడ పల్లవి వచ్చి అంత పాడు చేసింది అని అందరూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సరే పల్లవి గురించి నేను ఆలోచించడమే మానేశాను. ఇప్పుడు మళ్లీ తన గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు అని అలాగే పల్లవి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను పల్లవి గురించి ఎప్పుడూ మానేశాను మీరు ఎవరు దాని గురించి ఆలోచించకండి అని కమల్ అనగానే అందరూ కాస్త సంతోషంగా ఉంటారు.. కమల్ ఈ బాధ నుంచి పూర్తిగా మారిపోయాడు అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.
మీరందరూ బాధపడకండి ముందు అన్నం తినండి అని కమల్ అందరికీ అన్నం వడ్డించి వదినా అని అవనితో చెప్తాడు. అయితే అప్పుడే రమ్య చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఫోన్ చేసి అర్జెంటుగా నేను కలవాలి ఒక లొకేషన్ పంపిస్తాను రండి అని అంటుంది. రమ్యకి ఏదో కష్టం వచ్చినట్లుంది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది అని కమల్ చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ప్రమ్యూని కలవడానికి కమల్ నేను ఒక్కడినే వెళ్తాను అని చెప్పినప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తాను మీరు అప్పుడు రండి అని కమల్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
రమ్య ఫోన్ చేసినా లొకేషన్ కి కమల్ వెళ్తాడు. ఏమైంది ఎందుకు నన్ను అర్జెంట్ కదా మనో ఏదైనా సమస్యలో ఉన్నావా అని కమల్ అడుగుతాడు. అయితే కమల్ నేను పిలిస్తే రావు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను వచ్చాను అని అనగానే కమల్ మొదట షాక్అయిన కూడా తనిచ్చిన బొకేతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రమ్య కేక్ కట్ చేయించడంతో కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కమల్ వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతుంటారు. అప్పుడే కమల్ ఇంట్లోకి చాలా సంతోషంగా రావడం చూసి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :వామ్మో.. మాళవిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?