E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 
Advertisement

Brahmamudi serial today Episode: నేను వద్దు అంటున్నా కూడా ఐశ్వర్యకు ఒక్క చాన్స్‌ ఇద్దామంటూ నువ్వే సంతకాలు పెట్టావు.. భుజాలు తట్టి ప్రోత్సహించావు తను నీ మీద గెలవడం కోసం ఏం చేయడానికైనా సిద్దం అయిపోయింది అది తెలుసుకో ముందు అంటూ రాజు చెబితే.. నేను సంతకం పెట్టింది తన మీద ప్రేమతో రాజు తను మాత్రం దాన్ని నా భయం అనుకుంది. తన గెలుపు మీద నాకున్న అసూయ అనుకుంది. నిజంగా తను నా మీద గెలవడం అనుకుంటే కచ్చితంగా నేను సంతోషిస్తాను అంటూ ఇందు చెప్పగానే.. ఎలా ఇలా అడ్డదారులు తొక్కా అంటూ రాజు ప్రశ్నిస్తే..

లేదు నిజాయితీగా కష్టపడి అంటూ ఇందు చెప్తుంది. రఘువీర్ లాంటి వ్యక్తులతో చేతులు కలిపితే జీవితంలో నిజాయితీ అనే మాట తన నోటి నుంచి మనం వినగలమా..? అంటాడు రాజు. అదే నాభయం అంతా మనం ఏం చెప్పినా వినకుండా రఘువీర్‌ ముందే ఇలా ఐషుకు నూరి పోశాడు. కానీ ఐషు అయితే మన ఇంట్లో మనిషి. ఈరోజు కాకపోయినా రేపైనా మార్చుకోవచ్చు అంటూ ఇందు చెబితే.. తను మారుతుందని నీకు నమ్మకం ఉందా..? తన బ్లడ్‌లోనే ఉంది అందంతా.. రేఖ పిన్ని పెంపకం అంతా  అంటూ రాజు చెబితే..  ఆ రఘువీర్ పక్కా ప్లాన్‌తో వచ్చి మన మీద పగ సాధించేందుకు ఐషును ట్రాప్‌ చేశాడు అనిపిస్తుంది అంటూ ఇందు చెబితే.. వాడి ముఖం డబ్బు పిచ్చిది కాబట్టి ఐషును ట్రాప్‌ చేశాడు. అంత లేదు వాడికి.. అంటూ చెప్తాడు రాజు.

Advertisement

చలపతికి కొరియర్‌ వస్తుంది. ఏంటోనని ఓపెన్‌ చేసి చూస్తూ అందులో రాజు చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి. అందులో తను వాళ్ల అమ్మ నాన్నలతో దిగిన ఫోటోలు, అపర్ణ వాళ్ల ఇంట్లో జరిగిన  బర్తుడే వేడుకలు.. అలాగే చలపతి వాళ్ల దగ్గర పెరిగిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూసి చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. రాజు మన కొడుకు కాదన్న విషయం ఇంకెవరికో తెలిసింది. మనల్ని బెదిరించడానిక ఈ ఫోటోలు పంపించారు అంటూ చలపతి భయపడుతుంటాడు. ఈ విషయం రాజుకు తెలియకూడదని అనుకుంటాడు. మరోవైపు రాజు, శేషు దగ్గరకు వెళ్లి తన శోభనం గురించి అపర్ణతో మాట్లాడమని చెప్తాడు.

శేషు రాజుతో కలిసి అపర్ణ దగ్గరకు వెళ్లి శోభనం గురించి మాట్లాడతాడు. అపర్ణ ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. అప్పుడే ఇందు వస్తుంది. ఇద్దరూ కలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వీళ్ల శోభనానికి అంత తొందరేం వచ్చిందని అంటుంది అపర్ణ. ఇందు, అపర్ణ నాటకాలకు రాజు, శేషు షాక్‌ అవుతారు. ఇందు కూడా ఆరు నెలల తర్వాత అద్బుతమైన ముహూర్తం ఉందన్నారు కదా పంతులు అంటూ చెప్పి వెళ్లిపోతుంది ఇందు. ఇందు వెనకే రూంలోకి వెళ్లిన రాజు ఇందులో చిలిపిగా గొడవ పడతాడు. ఇద్దరూ దిండ్లతో కొట్టుకుంటారు.

Advertisement

భ్రమరాంబ, రేఖ, భూషణ్‌ ముగ్గురూ కలిసి ఇందు, రాజులకు పిల్లలు పుడితే వాళ్లకు కూడా మనం బానిసలుగానే ఉండాలా అని ఆలోచిస్తుంటారు. శేషు వచ్చి వాళ్లను మరింత రెచ్చగొడతాడు. తన మాటలతో మీ పని అయిపోయింది అంటాడు. వెటకారంగా మాట్లాడతాడు. ఒక్కసారి ఫెయిల్‌ అయితే అన్ని సార్లు ఫెయిల్‌ అవుతామా..? అంటూ భూషణ్‌ అడిగితే.. రేపు రాత్రే ఆ శోభనం అంట అని భ్రమరాంబ చెబితే.. అది సెట్‌ చేసింది నేనే కదా అని మనసులో అనుకుంటాడు శేషు. వాళ్లిద్దరిని అసలు కలవనివ్వను.. అంటుంది. రేఖ ఈసారి ఫెయిల్‌ అవ్వదు అంటూ భూషణ్‌ చెబితే.. చెల్లెమ్మ ప్లాన్‌ వేసిందంటే ఇక వాళ్లిద్దరూ ఒక్కటైపోయినట్టే అంటాడు శేషు. శేషును అందరూ తిడతారు. మరోవైపు ఇంట్లో బుక్స్‌ దగ్గర ఉన్న రాజు చిన్నప్పటి ఫోటోలు వెంకీ చూస్తాడు. ఈ ఫోటోలు ఉన్నట్టు నాకెప్పుడూ చెప్పలేదు అంటూ అడగ్గానే.. చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ కు రమ్య సర్ప్రైజ్.. ట్విస్ట్ అదిరింది..

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Thursday TV Movies : సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..

మంగ్లీ, నాగదుర్గలతో బిగ్ ఫోక్ నైట్.. బుక్ మై షోలో టికెట్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Big Stories

Advertisement
×