E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..
Advertisement

Podarillu Today Episode November 19th : మహాలక్ష్మి ఇంకా తినడానికి రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. వదిన ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు అని కన్నా కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే బయట బాల్కనీలో ఉన్నట్లుంది నేను వెళ్లి తీసుకుని వస్తానని చక్రి వెళ్తాడు. ఏంటండీ మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా అని చక్రి అనగానే మహాలక్ష్మి మీకోసం నేను ఎందుకు ఆలోచిస్తూ ఉంటాను ఏం మాట్లాడుతున్నారు అని చక్రికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు నాకు అర్థం కావడం లేదు అని చెప్పినా సరే మహాలక్ష్మి మీకు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉంది కదా వాళ్ళు ఇష్టపడతారు లే అన్నట్టుగా మాట్లాడుతుంది. కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అని మహాలక్ష్మి నిజం చెప్పడంతో చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇకపోతే మహాలక్ష్మి విడాకులు తీసుకోకుండా ఏదో ఒకటి చేయాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.

అయ్యో పాపం చక్రీ..

మహాలక్ష్మి ఆ మాట అనగానే ఈవిడకి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే కచ్చితంగా నాకు దూరం అవుతుందేమో అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే చక్రి అందరూ మంచిగానే ఉన్నారు నాకు మాత్రమే ఇలాంటి గతి పట్టింది అని బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే నారాయణ గురక పెట్టడం చూసి ఎక్కడ ఎలుగుబంటి వచ్చినట్టుంది అని కంగారు పడిపోతుంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే మాధవ్ మనిషా తో మాట్లాడుతూ సంతోషంగా ఉండడం చూసి చక్రి ఫీల్ అవుతాడు. అంతేకాదు కేశవ కూడా శైలుతో మాట్లాడుతూ కనిపించడంతో వీడు కూడా ముదిరిపోయాడు అని ఆలోచిస్తాడు. ఇక కన్నా కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో మెసేజ్ చేస్తూ కనిపించడం చూసి చక్రి వీడు కూడా మారిపోయాడు నేనొక్కడినే నా ఇక్కడ ఒంటరిగా మిగిలింది అని బాధపడిపోతూ ఉంటాడు.

విడాకులు తీసుకుంటారా..?

Advertisement

ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా కౌన్సిలింగ్ కోసమని కోర్టుకు వెళ్తారు.. అయితే అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మాటలు విన్న అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని మాట్లాడతారు.. అయితే మహాలక్ష్మి అలాగే చక్రి మధ్య ఏదో జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్లో అక్కడ ఉన్నవాళ్లు మహాలక్ష్మి అలాగే చక్రి ల గురించి అడుగుతారు.. ఒకరినొకరు అడిగినప్పుడు మహాలక్ష్మి మాత్రం మౌనంగా ఉంటుంది. కానీ చక్రి మాత్రం తన గురించి తానే అందరూ అనుకున్నట్లుగా చెప్పేస్తాడు ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే మహాలక్ష్మి చక్రి మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక నేను ఇలాంటి వాడిని కాబట్టి నేను మహాలక్ష్మికి విడాకులు ఇస్తాను అని ఒప్పుకుంటాడు చక్రి..

మాధవ్ కు పెద్ద షాక్..

అయితే మహాలక్ష్మి అటుగా వెళుతూ ఉంటే చక్రి మన కారు ఎక్కడ ఉందండి మీరు అప్పుడే అటు మర్చిపోయి వెళ్తున్నారా అని అంటాడు. ఇక మీదట విడాకులు ఇస్తే నేను మీకు డ్రాప్ చేయడానికి కూడా రాను కదా విక్కి వస్తాడేమో అని అనగానే మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. ఇక ఇద్దరు ఇంటికి రావడం చూసి ఏంటి వీళ్లిద్దరూ కలిసి వచ్చారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మాధవ్ ఏంట్రా అలా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతాడు.. నేను మహాలక్ష్మి ఇకమీదట విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాం అన్నయ్య అని అనగానే.. మాధవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు మహాలక్ష్మికి నువ్వు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని మాధవ అడుగుతాడు కానీ చక్రి మాత్రం తన ఎమోషనల్ డైలాగులతో అందరిని కంటతడి పెట్టిస్తాడు.. మహాలక్ష్మి ని నువ్వు ఇష్టపడుతున్నావ్ కదరా అలాంటిది నువ్వు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని పెద్ది అనగానే చక్రి అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు..

చక్రీకి మాటకు మహా ఫీల్..

Advertisement

చక్రి తన మనసులోని బాధని పక్కకు పెట్టి మహాలక్ష్మి తో పాటు ఉండడానికి వద్దు.. తన జీవితం తనది నేను ఇలాంటి పాత ఇంట్లో పుట్టాను. నాకు కార్లు లేవు నేను ఒక కారు డ్రైవర్ని అని ఎమోషనల్ గా మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతుంది. ఇకపోతే మహాలక్ష్మి చక్రి గురించి అన్న మాటలు విని మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది కానీ మాధవ్ మాత్రం నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రా.. ఎందుకురా ఇలా చేశావు అని అనగానే తను నా నుంచి విడాకులు కోరుకుంటుంది.. అన్నయ్య తన కోరికను తీర్చాలి కదా అని చక్రి అనగానే మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు.

నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్..

చక్రి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ నారాయణ అడ్డుపడి ఏంట్రా దొంగ నా మై ఫ్రెండ్ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చక్రితో మాట్లాడతాడు. మహాలక్ష్మి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఉండగలుగుతావా అని చక్రిని అడుగుతాడు. కానీ చక్రి తను నాతో ఉండాలని అనుకోవడం లేదు అందుకే నేను తనకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అలాంటిది నువ్వు ఇలా మహాలక్ష్మికి వెంటనే విడాకులు ఇవ్వాలని అనుకోవడం నాకు అస్సలు నచ్చలేదు రా అనేసి నారాయణ చక్రికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో మహాలక్ష్మి తన మనసు మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..

Related News

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ కు రమ్య సర్ప్రైజ్.. ట్విస్ట్ అదిరింది..

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Thursday TV Movies : సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..

మంగ్లీ, నాగదుర్గలతో బిగ్ ఫోక్ నైట్.. బుక్ మై షోలో టికెట్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Big Stories

Advertisement
×