BigTV English
Advertisement

Mass Jathara Twitter Review : ‘ మాస్ జాతర ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mass Jathara Twitter Review : ‘ మాస్ జాతర ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mass Jathara Twitter Review : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం మాస్ జాతర.. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల సినిమాలో హీరోయిన్గా నటించింది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.. గత కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ ఈసారి పవర్ ఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. అక్టోబర్ 31 న సినిమా రిలీజ్ కావాల్సింది. బాహుబలి ది ఎపిక్ మూవీ థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ఒకరోజు తర్వాత థియేటర్లలోకి వచ్చేసింది.


నవీన్ చంద్ర విలన్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం.. పోలీస్ పాత్రలో నటించిన రవితేజా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న మాస్ జాతర రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుందో.. నెటిజన్ల ట్విట్టర్ రివ్యూ టాక్ ఎలా ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.

మాస్ జాతర ఫస్టాఫ్ ఫుల్ మాస్ ట్రీట్. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, థండరింగ్ బీజీఎం, ఎలివేషన్ మూవ్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయి థియేటర్లలో ఆ ఫైర్ బ్లాస్ట్ అయ్యింది. రవితేజ కమ్ బ్యాక్ మూవీ ఇది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


రవన్న వన్ మ్యాన్ షో.. ఈ మూవీలో సాంగ్స్ ఫైట్స్ మాములుగా లేవు.. శ్రీలీల లుక్ చాలా బాగుంది. బోరింగ్ అనిపించలేదు. రొటీన్ స్టోరీ. ఒక్కోసారి క్రాక్ మూవీని దించేసినట్లు కనిపిస్తుంది. టైం పాస్ కోసం చూసేవారికి మంచి ఎంటర్టైనర్.. థియేటర్లలో చూసేయ్యండి అంటూ ట్వీట్ చేశారు.

మాస్ మహారాజ్ ఇస్ బ్యాక్.. ఈయన యాక్షన్ సీక్వెన్స్ ఇదే.. యాక్షన్ బ్లాక్ బ్లాస్టర్. మెంటలెక్కిస్తుంది. ఈసారి మిస్ అవ్వదు రవితేజ ఖాతాలో హిట్ పడినట్లే..

పక్కా మాస్ మహారాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్. మాస్ మహారాజా రవితేజ పవర్ ప్యాక్డ్ వింటేజ్ పర్ఫార్మెన్స్ అయితే ర్యాంపేజ్. నవీన్ చంద్ర కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. భాను భోగవరపు సత్తా చాటేసాడు అని టాక్ వినిపిస్తుంది. మరి పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంxటాయో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీతో రవితేజ ఖాతాలో మరో హిట్ పడుతుందేమో చూడాలి..

 

Related News

Mass Jathara Movie Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ – ‘క్రాక్’ జాతర

Mass Jathara Twitter review : మాస్ జాతర ట్విట్టర్ రివ్యూ

Baahubali: The Epic Review : “బాహుబలి ది ఎపిక్” రివ్యూ… రెండో సారి వర్త్ వాచింగేనా?

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Thamma Twitter Review: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?

Big Stories

×