Gundeninda GudiGantalu Today episode November 23rd: ఇక ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావని ప్రభావతి అడిగితే మీ కొడుకు రవి చాలా మంచివాడు.. అతను చాలా సౌమ్యుడు తనలోని టాలెంట్ ఉన్నా కూడా తను చాలా మంచిగా చూస్తాడు.. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అయితే తనకి పెళ్లి అవుతుంది కదా ఇకమీదట అలాంటి ఆలోచన లేదు అని నీతూ అంటుంది. అప్పుడే పైనుంచి వచ్చిన రవి శృతి ఇద్దరూ కూడా మాకు ఈ ఆఫర్ ఓకే అని చెప్పగానే.. నీతూ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రభావతి మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది.. రవి తనతో కలిసి బిజినెస్ పార్టనర్ గా ఉండబోతున్నాను అని సంతకం పెడతాడు.. ఇక ప్రభావతి మాత్రం తనతో కలిసి బిజినెస్ చేయాల్సిందేనా నువ్వు జాగ్రత్త అని ప్రభావతి హెచ్చరిస్తుంది..
ప్రభావతి శృతికి నీతు వెళ్ళగానే క్లాస్ పీకుతుంది. అరే రవి నువ్వు ఇప్పుడు బిజినెస్ చేయాల్సిందేనా ఆలోచించుకుని బిజినెస్ చేయడం మంచిది అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా నేనేమైనా తప్పుగా చేస్తున్నానో ఏంటి అని అంటే లేదురా ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని ఆలోచించి నిర్ణయానికి వచ్చాను నువ్వు ఆలోచించుకుని బిజినెస్ లోకి దిక్కు అని ప్రభావతి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమీ లేదురా నాకెందుకు ఏదైనా గొడవలు జరుగుతాయి ఏమో అని అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఆలోచించుకొని బిజినెస్ కి దిగడం మంచిది అని ప్రభావతి సలహా ఇస్తుంది కానీ రవి శృతి ఏం జరిగిందని ఆలోచనలో ఉండిపోతారు.
మనోజ్ రోహిణి తనని మోసం చేస్తుంది అని బాధపడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే రోహిణి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకొని తనకి దగ్గర ఎలా చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే చిరాకు మూడులో షోరూం కి వచ్చిన మనోజ్ కస్టమర్లతో చిరాగ్గాని మాట్లాడడంతో వాళ్ళు షాక్ అవుతారు. ప్రతిదీ చిరాకు పడుతూ ఉండడం చూసి మనోజ్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు అని అందరికీ అర్థమవుతుంది. ఇకపోతే మనోజ్ ఫ్రెండ్ మణికంఠ కూడా షాప్ కి వస్తాడు. మనోజ్ బ్రో అని ఎంతగా పిలిచినా మనోజ్అక్కడ సేల్స్ గర్ల్స్ వున్నారు వాళ్ళని అడగండి అని అంటాడు.. నేను బ్రో మణికంఠ అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన మనోజ్ మణికంఠ అనే హగ్ చేసుకుని మరి ఏడ్చేస్తాడు. ఆడ మగ మాట్లాడుకుంటే తప్పు లేదు కదా అని ఎంత చెప్తున్నారు సరే మనోజ్ మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. రోహిణి నాకు మోసం చేయాలని చూస్తున్నట్లు ఉంది. నువ్వు ఒకసారి నెంబర్ తెచ్చాను ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడు అని మనోజ్ అంటాడు అయితే ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
ఇక మనోజ్ ఇంటికి వెళ్ళగానే రోహిణి దగ్గరికి వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నావు. ఇంతసేపు ఫోన్ మాట్లాడల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. అయితే రోహిణి రివర్స్ గా నామీద నీకు అనుమానం ఉందా ఎందుకు నువ్వు పదేపదే నా గురించి అడుగుతున్నావు అని అడుగుతుంది. అతను నా ఫ్రెండ్ నేను ఎంత చెప్పినా కూడా వినడం లేదు అలాంటిది నేను ఎలా అతని దూరం పెడతానని రోహిణి అనగానే మనోజ్ కి ఇంకాస్త అనుమానం పెరిగిపోతుంది. రోహిణి మాట్లాడిన తీరు కూడా మనోజ్ కి కాస్త అనుమానం కలిగించేలా ఉండడంతో తన గురించి ఆలోచిస్తాడు.
మీనా సుమతిని కలవడానికి అని ఆ ఇంటికి వెళ్తే సుమతి పడుకొని దీనంగా కనిపిస్తుంది.. దాంతో సుమతి బాధని చూసిన మేన ఏంటి సుమతి నువ్విలా బాధపడుతూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని మీనా అంటుంది. నేను ఎవరికీ చెప్పలేను అక్క ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సుమతి అంటుంది. అయితే నేను అక్కడ ఉండగానే అరుణ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది సుమతీ పరిస్థితిని చూసి ఇలా బాధపడిపోతూ ఉంటే ఎలా ఎలాగైనా సరే మీ భర్తని కాస్త ఒప్పించమని అడుగుతుంది. మరి అరుణ్ వాళ్ళ అమ్మ మాట విని సుమతికి న్యాయం చేయాలని మీనా బాలు తో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది.
బాలు వెళ్తూ ఉండగా మీనా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అంటుంది. సుమతి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు సుమతి పరిస్థితి చాలా దారుణంగా మారింది. మీరు అరుణ్ క్షమాపణ చెప్తే ఒప్పుకుంటారా అని అడుగుతుంది.. కానీ మీనా మాత్రం మాట్లాడిన మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీనా ఇకమీదట నా గురించి ఆలోచించడం మానేయి ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని వార్నింగ్ కూడా ఇస్తాడు. నన్ను కాదని సుమతి పెళ్లి చేస్తే ఇకమీదట నాకు కూడా శాశ్వతంగా దూరం అయిపోతావు అని బాలు హెచ్చరిస్తాడు.. ఇక మనోజ్ మాత్రం రోహిణి మీద అనుమానంతో తనని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ పరిస్థితి ఏంటి..?