Telugu TV Serials: బుల్లితెర ఆడియన్స్ ను తెలుగు సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి రోజు బోలెడు సీరియల్స్ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వీటికి డిమాండ్ పెరుగుతుంది. ప్రతి రోజు సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఇటీవల తెలుగు ఛానెల్స్ పోటీ పడి డిఫరెంట్ స్టోరీలతో రావడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రతి రోజు కొత్త స్టోరీతో రావడంతో డిమాండ్ కూడా ఓ రేంజ్ లో పెరుగుతుంది. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతివారం ప్రసారం అవుతున్న సీరియల్స్ రేటింగ్ పెరుగుతుంది. మరి ఈవారం ఏ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ ప్రతి ఒక్క సీరియల్ కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఎన్ని సీరియల్స్ వచ్చిన ఒక్కొక్కటి ఒక్కో విధమైన స్టోరీతో రావడంతో ప్రతి సీరియల్ కు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జనాలను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మొన్నటివరకు ఈ సీరియల్ కాస్త డల్ గా స్టోరీ సాగడంతో టీఆర్పీ రేటింగ్ బాగా తగ్గిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు స్టోరీలో అనేక మార్పులు రావడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ స్టోరీ జనాలను బాగా అలరిస్తుంది. ఈ సీరియల్ రేటింగ్ అమాంతం బాగా పెరుగుతుంది. వల్లి ఇప్పుడు తల్లి కాబోతుంది. కాబట్టి ఈ సీరియల్ నెక్స్ట్ స్టోరీ ఎలా సాగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
స్టార్ మా ఛానెల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ప్రతి రోజు పెరుగుతూ ఉంటుంది.. ఇందులో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో కార్తిక దీపం 2 మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ సీరియల్ రేటింగు 12.83 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంటుంది.. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.60 ఉంది. పొదరిల్లు 11. 75, ఇంటింటి రామాయణం 11.54, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.77, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.60, చిన్ని 8.83, బ్రహ్మముడి 8.87.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతున్నాయి.. ముఖ్యంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ వారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి.. ఇకపోతే ఈ వారం సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఎక్కువమంది సీరియల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈవారం కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ లోకి వస్తుందా లేదంటే వేరే సీరియల్ ఏదైనా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందా అన్నది చూడాలి..