Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో ఇంకా తనకు తెలియకుండా ఏమేం చేస్తున్నారని అమర్ అందరి మీద అరుస్తుంటాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. మంగళ మాత్రం తాను త్వరగా అక్కడి నుంచి బయట పడాలని ఆలోచిస్తుంది. అమర్ కోపంగా చెప్పండి ఇంకా ఏమైనా దాచారా..? నాకు చెప్పాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా…? అంటూ కోపంగా అడిగితే.. అప్పుడు కూడా ఎవ్వరూ నోరు తెరవరు.. మంగళ మాత్రం బాబు అని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్యగారు.. మీరేమైనా దాచారా..? అంటూ అమర్ అడిగితే మంగళ భయంతో వణికిపోతుంది. లేదు బాబు.. ఇక నేను వెళ్తాను.. భాగీని పిల్లలను చూద్దామని వచ్చాను.. చూశాను కదా ఆయన వచ్చే టైం అయింది అంటూ చెప్తుంది. సరే వెళ్లండి అంటూ అమర్ చెప్పగానే.. మంగళ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి వాటర్ తాగుతుంది మంగళ. మెల్లగా పార్థు రూం దగ్గరకు వెళ్లి తొంగి చూస్తుంది. పార్థు కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇతగాడే అన్న మాట మనోహరి మొగుడు. ఆ తాటకి చేతిలో చావు తప్పించుకుని బతికి చిరంజీవి ఇతనే అయినా చంకలో పిల్లను పెట్టుకుని సంతంతా వెతికినట్టు ఇతని కోసం వాళ్లు దేశం మొత్తం వెతుకుతున్నారు. నేను కూడా ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవిని బయటకు వెల్లగొట్టాను.. ఈ విషయంలో మా ముసలోడిని మెచ్చుకోవాలి. నా మాట విని ఇతన్ని పంపించి వేయలేదు ఇతన్ని అడ్డు పెట్టుకుని బోలెడు డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది.
అప్పుడు వెనక నుంచి వచ్చిన రామ్మూర్తి, మంగళ భుజం మీద చేయి వేస్తే మంగళ భయంతో అరుస్తుంది. రామ్మూర్తి ఏంటే అలా అరుస్తున్నావు అంటే.. వెనక నుంచి సైలెంట్‌గా వచ్చి చేయి వేస్తే భయంతో అరవక ఏం చేస్తారు అంటూ తిడుతుంది. అందుకు రామ్మూర్తి మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను.. నీకు భయం, భక్తి అసలే లేవు కదా అంటాడు. భయం, భక్తి లేకపోవడానికి నేను మనిషిని కాదా..? అంటుంది. అయినా అక్కడ అల్లుడి గారి ఇంట్లో ఏదైనా వెధవ పని చేసి వచ్చావా..? అని రామ్మూర్తి అనుమానంగా అడిగితే.. నేనేం వెధవ పని చేశాను.. భాగీని పిల్లలను చూసి వస్తూ.. ఈ అబ్బాయి గురించి తెలుసుకోమని చెప్పాను.. కానీ మీరే వీళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకుంటానని చెప్పారట కదా అంటుంది. అవును అల్లుడి గారికి ఈ శ్రమ ఎందుకని నేనే వెతుకుతానని చెప్పాను అంటూ రామ్మూర్తి చెప్తాడు.
మంగళ, పార్థును దగ్గరకు పిలిచి ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ ఇబ్బంది పడకూడదు. నీకేం కావాలన్నా నన్ను అడుగు.. నేను నీ సొంత అక్కను అనుకో నా తమ్ముడు నీలాగా కష్టాల్లో ఉంటే ఆదుకునేదాన్ని కదా..? అంటుంది. రామ్మూర్తి ఏంటే నీకేదైనా దెయ్యం పట్టిందా..? ఏంటి..? అని అడిగితే.. మంచిగా మాట్లాడకపోతే దెయ్యం అంటారు. మంచిగా మాట్లాడితే దెయ్యం పట్టిందా అంటారు ఎలా మీతో అంటుంది మంగళ. అదేం లేదు నీకు ఏదో మంచి దెయ్యమే పట్టినట్టు ఉంది అంటూ రామ్మూర్తి షాక్ అవుతూ మంగళను చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.