E-Paper
Advertisement

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!
Advertisement

Ayodhya-Janakpur Express: భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక, పర్యాటక సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య నుంచి నేపాల్‌ లోని జనక్‌పూర్ వరకు డైరెక్ట్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇవాళ(సోమవారం) ఈ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. సరయూ-కమలా ఎక్స్‌ ప్రెస్ పేరుతో నడిచే ఈ రైలు రెండు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచనుంది.

604 కిలోమీటర్ల ప్రయాణం.. 19 గంటల సమయం!

అయోధ్య కంటోన్మెంట్ నుంచి జనక్‌ పూర్ ధామ్ వరకు ఈ రైలు సుమారు 604 కిలోమీటర్లు ప్రయాణం చేయనుంది. ఈ ప్రయాణానికి సుమారు 19 గంటల సమయం పడుతుంది. ఈ రైలు సర్వీసు ఇవాళ ప్రారంభం అయినా, నవంబర్ 28 నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు ప్రతి సోమవారం సాయంత్రం 5.50 గంటలకు అయోధ్య నుంచి బయల్దేరుతుంది. మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు జనక్‌ పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు జనక్‌పూర్ నుంచి బయల్దేరి, ఆదివారం ఉదయం 8.10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది.

ఏ స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుందంటే?   

Advertisement

ఈ రైలు మాంకాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నార్కటియాగంజ్, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్ సహా పలు రైల్వే స్టేషన్ల మీదుగా ముందుకు సాగుతుంది. మొత్తం 17 కోచ్‌లతో ఈ రైలును నడపనున్నారు. ఇందులో 8 ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లతో పాటు దివ్యాంగులకు అనుకూలంగా ఉండే లగేజీ కోచ్, పవర్ కార్ కూడా ఉంటాయి.

రామాయణ సర్క్యూట్‌కు మరింత బూస్టింగ్  

అయోధ్య శ్రీరాముడి జన్మస్థలంగా, జనక్‌ పూర్ సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెండు ప్రాంతాల మధ్య  డైరెక్ట్ రైలు ప్రారంభం కావడం వల్ల రామాయణ సర్క్యూట్ టూరిజానికి మరింత బూస్టింగ్ రానుంది. భక్తులు, పర్యాటకులు ఈజీగా రెండు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారాలు, స్థానిక ఉపాధి అవకాశాలు సైతం మరింత మెరుగుపడనున్నాయి.

భారత్-నేపాల్ మధ్య మరింత సాకారం

Advertisement

మోదీ, బాలేంద్ర షా సమావేశంలో రైల్వేలు, విద్యుత్, జలవిద్యుత్, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా  చర్చించనున్నారు. నేపాల్ నుంచి వచ్చే పదేళ్లలో 10,000 మెగావాట్ల వరకు విద్యుత్ కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతం నేపాల్ నుంచి భారత్ ఏటా సుమారు 1,200 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది.

అటు రక్సౌల్-కాఠ్మండు రైల్వే రూట్ మీద ఇరు దేశాలు ఫోకస్ పెట్టనున్నాయి. గతంలో సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడినా, తాజా పర్యటనతో సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.

Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Tags

Related News

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

జపాన్ కోసం అరకు రైల్వే మార్గం? ఈ రైల్వేలైన్ వెనుక ఉన్న అసలు కథ తెలుసా?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

Big Stories

Advertisement
×