Big TV Kissik Talks : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు న్యూస్లను అందించడంతో పాటుగా ఎంటర్టైన్ చేయడంలో కూడా ఒక్క అడుగు ముందుగానే ఉంటుంది. ఈ ఛానల్ ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాంలను జనాలకు అందిస్తూ జనాల మెప్పును పొందింది. ఇటీవల ప్రారంభమైన కిస్సిక్ టాక్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ షో కి వచ్చి తమ అమూల్యమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ షో కి యంగ్ హీరోయిన్ అనన్య శర్మ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా ప్రస్తుతం ఆమె నటించిన హై మూవీ గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. అంతేకాదు ఆమె బ్రేకప్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇంతకీ అనన్య బ్రేకప్ స్టోరీ వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనన్య శర్మ. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈమె నటించిన ‘హై’ మూవీ విడుదల కోసం సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె బిగ్ టీవీ కి కిస్సిక్ టాక్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె తన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడంతో పాటుగా తన పర్సనల్ లైఫ్ లో అనుకోని సంఘటనల గురించి కూడా బయటపెట్టారు.. అందులో ముఖ్యంగా ఆమె బ్రేకప్ స్టోరీ గురించి రివిల్ చేశారు. అయితే కాలేజీ రోజుల్లో ఒక అతన్ని ప్రేమించిన విషయాన్ని చెప్పింది. అయితే అప్పట్లో కొన్ని అనుకొని పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్లు చెప్పింది. అయితే అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు కానీ బ్రేకప్ అయిన విషయాన్ని మాత్రమే తాను బయటపెట్టింది.. అయితే ఇప్పటివరకు అనన్యకు లవ్ స్టోరీ లేదు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె బ్రేకప్ స్టోరీ గురించి చెప్పడంతో అయ్యో అనన్యకు బ్రేకప్ అయ్యిందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అనన్య తన బ్రేకప్ గురించి ఏ విషయాన్ని పంచుకున్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి.
ఒకప్పుడు యూట్యూబ్లో వెబ్ సిరీస్ లు, షార్ట్ వీడియోలు చేసి మంచి పాపులారిటిని సొంతం చేసుకున్న ఎంతోమంది యాక్టర్స్ ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ జనాలని ఆకట్టుకుంటున్నారు.. అలా ఈ ముద్దుగుమ్మ అనన్య శర్మ కూడా తన క్రేజ్ తో సినిమాను నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హై మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతుంది నవంబర్ 27న ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని చూస్తుంటే సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుంది అని ఒక టాక్ జనాల్లో వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
Also Read :Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..